దేశాభిమాని
సంపాదకులు | దేవగుప్తం శేషాచలపతిరావు |
---|---|
తరచుదనం | వార పత్రిక వారానికి రెండు, మూడు సార్లు దినపత్రిక |
స్థాపక కర్త | దేవగుప్తం శేషాచలపతిరావు |
దేశం | భారతదేశం |
కేంద్రస్థానం | బెజవాడ గుంటూరు |
దేశాభిమాని, తెలుగులో మొట్టమొదటి దినపత్రిక. తొలుత వారపత్రికగా మొదలై, తరువాత దినపత్రికగా మారింది. ఇది బెజవాడ నుండి వెలువడేది. మొదట ఇది 1887 లో 'కృష్ణావృత్తాంతిని' అనే పేరుతో మొదలైంది.[1] ఆ తరువాత 'కృష్ణాన్యూస్' అని పేరు మార్చుకుంది. చివరికి దేశాభిమానిగా మారింది. మొదట ఇది వారపత్రికగా నడచి 1901 నాటికి దినపత్రికగా మారింది. ఈ పత్రికను స్థాపించిన దేవగుప్తం శేషాచలపతిరావు తొలి తెలుగు దినపత్రికా వ్యవస్థాపకుడనే కీర్తి దక్కించుకున్నాడు.[2]
చరిత్ర
[మార్చు]దేశాభిమాని తన జీవిత కాలంలో పలు మార్పులకు లోనైంది. కృష్ణా వృత్తాంతినిగా మొదలై, కృష్ణా న్యూస్‌గా మారి, ఆ తరువాత దేశాభిమానిగా స్థిరపడింది. పక్షపత్రికగా, వారపత్రికగా, వారానికి రెండు సార్లు, మూడుసార్లు వెలువడి, చివరికి దినపత్రికగా మారింది. బెజవాడలో ప్రచురణ మొదలై, గుంటూరుకు మారింది. మారనిదల్లా పత్రికను స్థాపించిన దేవగుప్తం శేషాచలపతిరావు, ఆయన పట్టుదలాను. ప్రభుత్వాన్ని, అధికారులనూ విమర్శించడానికి ఆయన వెనకాడేవాడు కాదు. ఈ పత్రిక 30 సంవత్సరాల పాటు నడిచింది.
మూలాలు
[మార్చు]- ↑ సి, నారాయణరెడ్డి; జె, చెన్నయ్య, eds. (2016). తెలుగు పత్రికలు, ప్రసార మాధ్యమాల భాషా స్వరూపం. తెలంగాణ సారస్వత పరిషత్తు. p. 55.
- ↑ డా. జె., చెన్నయ్య (2003). "పత్రికల వర్గీకరణ". తెలుగు దినపత్రికలు భాషా, సాహిత్య స్వరూపం. హైదరాబాదు: రవికిరణ్ పబ్లికేషన్స్. p. 60.