Jump to content

దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు

వికీపీడియా నుండి
ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలను, ఆయా దేశాల ఆధారిత భూభాగాలను (ఐ.రా.స. గుర్తింపు ప్రకారం)చూపే చిత్రపటం. - ఇందులో కలుపనివి : అంటార్కిటికా (అంటార్కిటికా ఒడంబడిక ప్రకారం నియంత్రింపబడుతున్నది), వాటికన్ నగరంలేదా హోలీ సీ (ఐ.రా.స. సాధారణ సభలో అబ్సర్వవర్ హోదా కలిగి ఉన్నది), పాలస్తీనా భూభాగాలు (ఐ.రా.స. అబ్సర్వర్), పశ్చిమ సహారా (మొరాకో, పోలిసారియో ఫ్రంట్ల మధ్య వివాదంలో ఉన్నది), తైవాన్ - (చైనా రిపబ్లిక్ (తైవాన్) అనబడే దీనిని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో ఒక భాగంగా ఐ.రా.స. గుర్తిస్తుంది.
ఐ.రా.స.లో వివిధ దేశాలు చేరిన దశకాలను సూచించే చిత్రపటం.

ఐక్య రాజ్య సమితిలో సభ్యులు (List of countries in the United Nations) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. 2017 నాటికి ఐక్య రాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స. సాధారణ సభలో సభ్యత్వం కలిగి ఉంటుంది. ఐ.రా.స. చార్టర్ 2వ ఛాప్టర్ 4వ ఆర్టికిల్ ప్రకారం ఏదైనా దేశానికి ఐ.రా.స. సభ్యత్వం రావాలంటే ఐ.రా.స. భద్రతా సభ ఆమోదంపై, ఐ.రా.స. సాధారణ సభ తీర్మానం జరగాలి. . నియమాల ప్రకారం సంపూర్ణ స్వాధిపత్యం ఉన్న దేశాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. కాని ఐ.రా.స. ఏర్పాటు సమయంలో చేరిన నాలుగు ఆరంభ సభ్య దేశాలకు (బెలారస్, భారత దేశం, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్) అప్పటికి సంపూర్ణ స్వాతంత్ర్యం లేదు. అంతే కాకుండా భద్రతా సభ ఆమోదం ఉండాలన్న నిబంధన కారణంగా మాంటివిడియో కన్వెన్షన్ ప్రకారం స్వాధిపత్యం కలిగిన కొన్న దేశాలు కూడా, మరి కొన్ని ఐ.రా.స. సభ్య దేశాలు వ్యతిరేకించిన కారణంగా ఐ.రా.స. సభ్యత్వం కలిగి లేవు.

కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సంపూర్ణ స్వాధిపత్యం స్పష్టంగా లేని దేశాలు ఐ.రా.స. సాధారణ సభలో "పరిశీలకులు" (అబ్సర్వర్) హోదాను మాత్రం పొందగలవు. వారి ప్రతినిధులు సమావేశాలలో పాల్గొనగలరు గాని వారి ఓటు హక్కు ఉండదు.

ప్రస్తుత సభ్యులు

వివిధ సభ్యుల పేర్లు క్రింది జాబితాలో ఇవ్వబడ్డాయి. 1945లో ఐ.రా.స. ఏర్పడినప్పుడు 51మంది సభ్య దేశాలున్నాయి. వాటిలో 49 దేశాలు ఇప్పటికీ సభ్యులుగా ఉన్నాయి. లేదా వారి సభ్యత్వం వేరే దేశాలకు సంక్రమించింది. (ఉదాహరణకు - సోవియట్ యూనియన్ సభ్యత్వం రష్యాకు సంక్రమించింది.) చెకొస్లవాకియా, యుగొస్లావియా దేశాలు విచ్ఛిన్నమైనాక వాటి సభ్యత్వం వేరేదేశాలకు సంక్రమించలేదు. చైనా రిపబ్లిక్ (తైవాన్) సభ్యత్వం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు 25 అక్టోబరు 1971న సంక్రమించింది. - చైనా (తైవాన్), కమ్యూనిస్టు చైనా అనే రెండు దేశాలూ అంతకు ముందు, తరువాత కూడా ఉన్నాయి.

సభ్య దేశం ప్రవేశం తేదీ గమనికలు
Afghanistan19 నవంబరు 1946
Albania14 డిసెంబరు 1955
Algeria8 అక్టోబరు 1962
Andorra28 జూలై 1993
Angola1 డిసెంబరు 1976
Antigua and Barbuda11 నవంబరు 1981
Argentina24 అక్టోబరు 1945
Armenia2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Australia1 నవంబరు 1945
Austria14 డిసెంబరు 1955
Azerbaijan2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Bahamas18 సెప్టెంబరు 1973
Bahrain21 సెప్టెంబరు 1971
Bangladesh17 సెప్టెంబరు 1974
Barbados9 డిసెంబరు 1966
Belarus[1]24 అక్టోబరు 1945 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Belgium27 డిసెంబరు 1945
Belize25 సెప్టెంబరు 1981
Benin[2]20 సెప్టెంబరు 1960
Bhutan21 సెప్టెంబరు 1971
Bolivia14 నవంబరు 1945
Bosnia and Herzegovina22 మే 1992 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Botswana17 అక్టోబరు 1966
Brazil24 అక్టోబరు 1945
Brunei[3]21 సెప్టెంబరు 1984
Bulgaria14 డిసెంబరు 1955
Burkina Faso[4]20 సెప్టెంబరు 1960
Burundi18 సెప్టెంబరు 1962
Cambodia14 డిసెంబరు 1955
Cameroon[5]20 సెప్టెంబరు 1960
Canada9 నవంబరు 1945
Cape Verde16 సెప్టెంబరు 1975
Central African Republic20 సెప్టెంబరు 1960
Chad20 సెప్టెంబరు 1960
Chile24 అక్టోబరు 1945
China24 అక్టోబరు 1945 see Seat of China
Colombia5 నవంబరు 1945
Comoros12 నవంబరు 1975
Democratic Republic of the Congo[6]20 సెప్టెంబరు 1960
Republic of the Congo[7]20 సెప్టెంబరు 1960
Costa Rica2 నవంబరు 1945
Côte d'Ivoire[8]20 సెప్టెంబరు 1960
Croatia22 మే 1992 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Cuba24 అక్టోబరు 1945
Cyprus20 సెప్టెంబరు 1960
Czech Republic19 జనవరి 1993 - "పాత చెకొస్లవేకియా" భాగస్వామి
Denmark24 అక్టోబరు 1945
Djibouti20 సెప్టెంబరు 1977
Dominica18 డిసెంబరు 1978
Dominican Republic24 అక్టోబరు 1945
Ecuador21 డిసెంబరు 1945
Egypt24 అక్టోబరు 1945 పాత "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్"కు చెందినది
El Salvador24 అక్టోబరు 1945
Equatorial Guinea12 నవంబరు 1968
Eritrea28 మే 1993
Estonia17 సెప్టెంబరు 1991 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Ethiopia13 నవంబరు 1945
Fiji13 అక్టోబరు 1970
Finland14 డిసెంబరు 1955
France24 అక్టోబరు 1945
Gabon20 సెప్టెంబరు 1960
Gambia21 సెప్టెంబరు 1965
Georgia31 జూలై 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Germany18 సెప్టెంబరు 1973 ఇంతకు ముందు "తూర్పు, పశ్చిమ జర్మనీ"లుగా ఉండేది.
Ghana8 మార్చి 1957
Greece25 అక్టోబరు 1945
Grenada17 సెప్టెంబరు 1974
Guatemala21 నవంబరు 1945
Guinea12 డిసెంబరు 1958
Guinea-Bissau17 సెప్టెంబరు 1974
Guyana20 సెప్టెంబరు 1966
Haiti24 అక్టోబరు 1945
Honduras17 డిసెంబరు 1945
Hungary14 డిసెంబరు 1955
Iceland19 నవంబరు 1946
India30 అక్టోబరు 1945
Indonesia[9]28 సెప్టెంబరు 1950
Iran[10]24 అక్టోబరు 1945
Iraq21 డిసెంబరు 1945
Ireland14 డిసెంబరు 1955
Israel11 మే 1949
Italy14 డిసెంబరు 1955
Jamaica18 సెప్టెంబరు 1962
Japan18 డిసెంబరు 1956
Jordan14 డిసెంబరు 1955
Kazakhstan2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Kenya16 డిసెంబరు 1963
Kiribati14 సెప్టెంబరు 1999
North Korea[11]17 సెప్టెంబరు 1991 సస్పెన్షన్లో ఉన్నది
South Korea17 సెప్టెంబరు 1991
Kuwait14 మే 1963
Kyrgyzstan2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Laos[12]14 డిసెంబరు 1955
Latvia17 సెప్టెంబరు 1991 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Lebanon24 అక్టోబరు 1945
Lesotho17 అక్టోబరు 1966
Liberia2 నవంబరు 1945
Libya[13]14 డిసెంబరు 1955
Liechtenstein18 సెప్టెంబరు 1990
Lithuania17 సెప్టెంబరు 1991 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Luxembourg24 అక్టోబరు 1945
Republic of Macedonia[14]8 ఏప్రిల్ 1993 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Madagascar20 సెప్టెంబరు 1960
Malawi1 డిసెంబరు 1964
Malaysia[15]17 సెప్టెంబరు 1957
Maldives21 సెప్టెంబరు 1965
Mali28 సెప్టెంబరు 1960
Malta1 డిసెంబరు 1964
Marshall Islands17 సెప్టెంబరు 1991
Mauritania27 అక్టోబరు 1961
Mauritius24 ఏప్రిల్ 1968
Mexico7 నవంబరు 1945
Micronesia[16]17 సెప్టెంబరు 1991
Moldova2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Monaco28 మే 1993
Mongolia27 అక్టోబరు 1961
Montenegro28 జూన్ 2006 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Morocco12 నవంబరు 1956
Mozambique16 సెప్టెంబరు 1975
Myanmar[17]19 ఏప్రిల్ 1948
Namibia23 ఏప్రిల్ 1990
Nauru14 సెప్టెంబరు 1999
  Nepal14 డిసెంబరు 1955
Netherlands10 డిసెంబరు 1945
New Zealand24 అక్టోబరు 1945
Nicaragua24 అక్టోబరు 1945
Niger20 సెప్టెంబరు 1960
Nigeria7 అక్టోబరు 1960
Norway27 నవంబరు 1945
Oman7 అక్టోబరు 1971
Pakistan30 సెప్టెంబరు 1947
Palau15 డిసెంబరు 1994
Panama13 నవంబరు 1945
Papua New Guinea10 అక్టోబరు 1975
Paraguay24 అక్టోబరు 1945
Peru31 అక్టోబరు 1945
Philippines[18]24 అక్టోబరు 1945
Poland24 అక్టోబరు 1945
Portugal14 డిసెంబరు 1955
Qatar21 సెప్టెంబరు 1971
Romania14 డిసెంబరు 1955
Russia[19]24 అక్టోబరు 1945 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Rwanda18 సెప్టెంబరు 1962
Saint Kitts and Nevis23 సెప్టెంబరు 1983
Saint Lucia18 సెప్టెంబరు 1979
Saint Vincent and the Grenadines16 సెప్టెంబరు 1980
Samoa[20]15 డిసెంబరు 1976
San Marino2 మార్చి 1992
Sao Tome and Principe16 సెప్టెంబరు 1975
Saudi Arabia24 అక్టోబరు 1945
Senegal28 సెప్టెంబరు 1960
Serbia1 నవంబరు 2000 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Seychelles21 సెప్టెంబరు 1976
Sierra Leone27 సెప్టెంబరు 1961
Singapore21 సెప్టెంబరు 1965
Slovakia19 జనవరి 1993 - "పాత చెకొస్లవేకియా" భాగస్వామి
Slovenia22 మే 1992 - "పాత యుగొస్లావియా" భాగస్వామి
Solomon Islands19 సెప్టెంబరు 1978
Somalia20 సెప్టెంబరు 1960
South Africa[21]7 నవంబరు 1945
Spain14 డిసెంబరు 1955
Sri Lanka[22]14 డిసెంబరు 1955
Sudan12 నవంబరు 1956
Suriname4 డిసెంబరు 1975
Swaziland24 సెప్టెంబరు 1968
Sweden19 నవంబరు 1946
 Switzerland10 సెప్టెంబరు 2002
Syria[23]24 అక్టోబరు 1945 పాత "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్"కు చెందినది
Tajikistan2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Tanzania[24]14 డిసెంబరు 1961 పాత "టాంగన్యీకా & జాంజిబార్"కు చెందినది
Thailand[25]16 డిసెంబరు 1946
Timor-Leste27 సెప్టెంబరు 2002
Togo20 సెప్టెంబరు 1960
Tonga14 సెప్టెంబరు 1999
Trinidad and Tobago18 సెప్టెంబరు 1962
Tunisia12 నవంబరు 1956
Turkey24 అక్టోబరు 1945
Turkmenistan2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Tuvalu5 సెప్టెంబరు 2000
Uganda25 అక్టోబరు 1962
Ukraine[26]24 అక్టోబరు 1945 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
United Arab Emirates9 డిసెంబరు 1971
United Kingdom[27]24 అక్టోబరు 1945
United States[28]24 అక్టోబరు 1945
Uruguay18 డిసెంబరు 1945
Uzbekistan2 మార్చి 1992 - "పాత సోవియట్ యూనియన్" భాగస్వామి
Vanuatu15 సెప్టెంబరు 1981
Venezuela[29]15 నవంబరు 1945
Vietnam[30]20 సెప్టెంబరు 1977
Yemen30 సెప్టెంబరు 1947 - ఇంతకు ముందు "ఉత్తర యెమెన్", "దక్షిణ యెమెన్"లుగా ఉండేది
Zambia1 డిసెంబరు 1964
Zimbabwe25 ఆగస్టు 1980

      Indicates original member

పాత సభ్యులు

చెకొస్లవేకియా

Czechoslovakia చెకొస్లవాకియా 24 అక్టోబరు 1945లో ఐ.రా.స.లో చేరింది. 10 డిసెంబరు 1992న చెకొస్లవేకియా ఐ.రా.స. సెక్రటరీ జనరల్కు తమ దేశం 31 డిసెంబరు 1992నుండి విడిపోతున్నదని, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా దేశాలు విడివిడిగా సభ్యత్వం కోసం దరఖాస్తు పెట్టుకుంటాయని తెలిపింది. 19 జనవరి 1993లో అవి ఐ.రా.స.లో చేరాయి.

తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ

తూర్పు జర్మనీ జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ (తూర్పు జర్మనీ), పశ్చిమ జర్మనీ Federal Republic of Germany (పశ్చిమ జర్మనీ)లు 18 సెప్టెంబరు 1973లో ఐ.రా.స.లో చేరాయి. 3 అక్టోబరు 1990న ఇవి రెండూ ఐక్యమయ్యాయి. అప్పటినుండి ఆ దేశం పేరు జర్మనీ.

టాంగన్యీకా, జాంజిబార్

మూస:Country data Tanganyika టాంగన్యీకా 14 డిసెంబరు 1961న ఐ.రా.స.లో చేరింది. మూస:Country data Zanzibar జాంజిబార్ 16 డిసెంబరు 1963న ఐ.రా.స.లో చేరింది. ఈ రెండు దేశాలూ United Republic of Tanganyika and Zanzibar గా 26 ఏప్రిల్ 1964న ఐక్యమయ్యాయి. తరువాత ఈ ఐక్యదేశంటాంజానియా (United Republic of Tanzania)గా 1 నవంబరు 1964న పేరు మార్చుకొంది.

యునైటెడ్ అరబ్ రిపబ్లిక్

24 అక్టోబరు 1945న ఈజిప్ట్, సిరియాలు ఐ.రా.స.లో ఆరంభ సభ్యులుగా చేరాయి. ఈ రెండు దేశాలూ United Arab Republic సంయుక్త అరబ్ రిపబ్లిక్ (United Arab Republic) అన్న పేరుతో 21 పిబ్రవరి 1958న ఐక్యమై ఒకే సభ్యదేశంగా 13 అక్టోబరు 1961వరకు కొనసాగాయి. తరువాత సిరియా మళ్ళీ స్వతంత్ర దేశంగా తన ప్రత్యేక స్థానాన్ని తిరిగి తీసుకొంది. ఈజిప్ట్ మాత్రం United Arab Republic గా 2 సెప్టెంబరు 1971వరకు కొనసాగింది. తరువాత "ఈజిప్ట్" అన్న పాతపేరును పునరుద్ధరించుకొంది.

సోవియట్ యూనియ్

Soviet Union సోవియట్ యూనియన్ (USSR), 1945లో ఐ.రా.స.ని ప్రారంభించిన ఐదు దేశాలలో ఒకటి. 24 అక్టోబరు 1945నుండి ఆరంభ సభ్యదేశంగా ఉంది. 24 డిసెంబరు 1991న సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం నిశ్చయమని తెలిశాక, సోవియట్ యూనియన్ సీటు రష్యాకు సంక్రమిస్తున్నదని రష్యా ప్రెసిడెంట్ బోరిస్ యెల్త్సిన్, ఐ.రా.స. సెక్రటరీ జనరల్కు తెలియజేశాడు. Commonwealth of Independent States లోని 11 సభ్య దేశాల ఆమోదంతో భద్రతా సభలోని సోవియట్ యీనియన్ సీటు కూడా రష్యాకు వచ్చింది .

మిగిలిన సోవియట్ యూనియన్ వారసత్వ దేశాలు:

ఉత్తర యెమెన్, దక్షిణ యెమెన్

మూస:Country data North Yemen యెమెన్ (ఉత్తర యెమెన్)30 సెప్టెంబరు 1947 నుండి "ముతవాక్కిలిత్ యెమెన్ రాజ్యం" (Mutawakkilite Kingdom of Yemen) అన్న పేరుతో సభ్యత్వం కలిగి ఉంది. తరువాత "యెమెన్ అరబ్ రిపబ్లిక్" (Yemen Arab Republic)గా పేరు మార్చారు. . మూస:Country data South Yemen ప్రజాస్వామ్య యెమెన్ (దక్షిణ యెమెన్) "Southern Yemen" లేదా "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ యెమెన్"గా 14 డిసెంబరు 1967న చేరింది. 22 మే 1990న ఈ రెండు దేశాలు యెమెన్ లేదా "యెమెన్ రిపబ్లిక్"గా విలీనం అయ్యాయి.

యుగొస్లావియా

Socialist Federal Republic of Yugoslavia యుగొస్లావియా 24 అక్టోబరు 1945న ఆరంభ సభ్య దేశంగా ఐ.రా.స.లో చేరింది. అప్పుడు దాని పేరు "డెమొక్రాటిక్ ఫెడరల్ యుగొస్లావియా". తరువాత "సోషలిస్ట్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా"గా పేరు మార్చుకుంది. 1992లో ఈ దేశం విచ్చిన్నం అయ్యింది. అందులో భాగాలైన "సెర్బియా", "మాంటినిగ్రో" రిపబ్లిక్‌లు "ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ యుగొస్లావియా"గా 28 ఏప్రిల్ 1992న అవతరించాయి. సాధారణ సభ తీర్మానం A/RES/47/1 ప్రకారం 22 సెప్టెంబరు 1992న ఈ క్రొత్త దేశం పాత యుగొస్లావియా సభ్యత్వాన్ని వారసత్వంగా తీసుకోవడం ఆమోదయోగ్యం కాదు. కనుక Federal Republic of Yugoslavia (Serbia and Montenegro) వేరే సభ్యత్వానికి దరఖాస్తు చేసుకోవలసి వచ్చింది.

యుగొస్లావియా విచ్ఛిన్నం అయినందువలన ఏర్పడిన దేశాలన్నీ ప్రస్తుతం ఐ.రా.స. సభ్యులు:

చైనా, తైవాన్‌ల సీటు

చైనా - Taiwan చైనా రిపబ్లిక్ (తైవాన్) (ROC) - 24 అక్టోబరు 1945 నుండి ఐ.రా.స. ప్రారంభించిన సభ్యదేశాలలో ఒకటి. అయితే చైనా అంతర్యుద్ధం కారణంగా "కూమింటాంగ్" అధీనంలో ఉన్న ప్రభుత్వం 1949లో తైవాన్‌కు వలసపోయింది. "కమ్యూనిస్టు" పాలన చైనా ప్రధాన భూభాగంలో నెలకొన్నది. China పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC), 1 అక్టోబరు 1949న తమదే సంపూర్ణ చైనా అని ప్రకటించారు. కూమింటాంగ్ చైనా చాలా చిన్న దీవులలో పాలన సాగిస్తున్నా గాని, మొత్తం చైనాకు ప్రతినిధిగా ఐ.రా.స.లో 1971 వరరకు కొనసాగింది. చైనా ప్రధాన భూభాగం పై అధిపత్యం కలిగిన కమ్యూనిస్టు ప్రభుత్వానికి మాత్రం ఐ.రా.స.లో ప్రాతినిధ్యం లేదు. 25 అక్టోబరు 1971న జరిగిన తీర్మానం (UN General Assembly Resolution 2758) "రిపబ్లిక్ ఆఫ్ చైనా (తైవాన్)కు ఉన్న ప్రాతినిధ్యాన్ని తొలగించి "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా"కు చైనా ఏకైక ప్రతినిధిగా గుర్తింపు లభించింది. దీనితో "తైవాన్"కు ఐ.రా.స.లో స్థానం తొలగిపోయినట్లే.

1990 తరువాత తమకు సభ్యత్వం (లేదా కనీసం పరిశీలక హోదా) కావాలని తైవాన్ ఎంతో ప్రయత్నించింది కాని వీటో హోదా ఉన్న చైనా అందుకు వ్యతిరేకంగా ఉన్నందున ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కనీసం పాలస్తీనా, వేటికన్‌లకు ఉన్న పరిశీలక హోదా కూడా తైవాన్‌కు లభించలేదు.

పరిశీలకులు

ఈ క్రింది వాటికి అబ్సర్వర్ (పరిశీలకులు) హోదా ఉన్నది.

The sovereignty status of పశ్చిమ సహారా is in dispute between మొరాకో and the Polisario Front. Most of the territory is administered by Morocco, the remainder (the Free Zone) by the Sahrawi Arab Democratic Republic (SADR), proclaimed by the Polisario Front. The SADR is a full member of the African Union, but is neither a member nor observer of the UN.

The associated states of న్యూజిలాండ్, the కుక్ దీవులు and నియూ, while self-governing in their domestic affairs, have their foreign affairs represented by New Zealand, and are not UN members.

Many international organizations, non-governmental organizations, and entities whose statehood or sovereignty are not precisely defined, such as the యూరోపియన్ యూనియన్, the International Committee of the Red Cross, and the Sovereign Military Order of Malta, are invited to become observers at the General Assembly.

వివిధ పేర్లు, గమనికలు

  1. బెలారస్ అనేది మొదట "బైలో రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్"గా ఐ.రా.స.లో చేరింది. ఐతే 1991లో ఈ దేశం సోవియట్ యూనియన్ నుండి స్వతంత్రం ప్రకటించుకున్నది. తరువాత ఆ దేశం పేరు "బైలోరష్యా" నుండి "బెలారస్"గా 19 సెప్టెంబరు 1991 నుండి మార్చుకున్నది.
  2. బెనిన్ ముందు పేరు "డాహొమీ". 1975లో పేరు మార్చుకున్నది.
  3. బ్రూనే ప్రస్తుత నామం "బ్రూనే దారుస్సలామ్".
  4. బుర్కీనా ఫాసో క్రితం పేరు "ఎగువ వోల్టా", 1984లో పేరు మార్చుకొన్నది.
  5. Cameroon పాత పేరు "Cameroun". ఐతే 1961లో Southern Cameroonsతో విలీనం అయినాక Cameroon నామం స్థిరపడింది.
  6. The కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ పూర్వనామం "కాంగో (లెపోల్డ్విల్లి)". తరువాత 1964లో "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్" గా పేరు మార్చుకొంది. 1971లో "జైర్"గా పేరు మార్చుకుంది. మళ్ళీ 17 మే 1997లో ఇప్పటి "కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్"గా పేరు మార్చికుంది.
  7. The కాంగో రిపబ్లిక్ సభ్య నామం "కాంగో". ముందుగా చేరినప్పుడు దీనిపేరు "కాంగో (బ్రజ్జావిల్లి)".
  8. Côte d'Ivoire అని పేరు మార్పు 1985లో జరిగింది. అంతకు మందు సభ్యత్వం తీసుకొన్నప్పటి పేరు "Ivory Coast".
  9. ఇండొనీషియా 20 జనవరి 1965న మలేషియతో విభేదాల కారణంగా, మలేషియాని భద్రతా సభలో అశాశ్వత సభ్య దేశంగా ఎన్నకొన్నందకు నిరసనగా, తాత్కాలికంగా ఈ.రా.స. నుండి నిష్క్రమించింది. మరలా ఐ.రా.స.లో పాల్గొనడానికి 19 సెప్టెంబరు 1966లో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. (to resume full cooperation with the United Nations and to resume participation in its activities) - మరలా సభ్యునిగా చేరమని ఐ.రా.స. ఆహ్వానించగా 28 సెప్టెంబరు 1966న సభ్యునిగా చేరింది.
  10. ఇరాన్ ప్రస్తుత సభ్యనామం "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్".
  11. ఉత్తర కొరియా: జనవరి 1, 2007 నుండి సస్పెండ్ చేయబడింది.
  12. లావోస్ సభ్యనామం "లావోస్ పీపుల్స్ డెమొక్రాటిక్ రిపబ్లిక్".
  13. లిబ్యా సభ్యనామం "లిబ్యన్ అరబ్ జమాహ్రియా".
  14. The రిపబ్లిక్ ఆఫ్ మేసిడోనియా సభ్యనామం "గత యుగొస్లావియా మేసిడోనియా రిపబ్లిక్" (The former Yugoslav Republic of Macedonia) - గ్రీస్తో ఈ విషయమై వివాదం ఉన్నది.
  15. మలేషియా చేరినప్పటి పేరు "ఫెడరేషన్ ఆఫ్ మలేషియా". తరువాత 16 సెప్టెంబరు 1963న, సింగపూర్, సబాహ్, సరావాక్లు మలేషియా ఫెడరేషన్లో చేరిన తరువాత, దేశం పేరు "మలేషియా" అని మార్చబడింది. 9 ఆగస్టు 1965న సింగపూర్ స్వతంత్ర దేశం అయ్యింది.
  16. మైక్రొనీషియా సభ్యనామం "ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రొనీషియా" (Micronesia, Federated States of).
  17. మయన్మార్ పూర్వనామం "బర్మా". 1989లో పేరు మార్పిడి జరిగింది.
  18. ఫిలిప్పిన్స్ ఐ.రా.స.లో చేరినప్పటి పేరు "కామన్వెల్త్ ఆఫ్ ఫిలిప్పీన్స్" (Commonwealth of the Philippines)". 1946లో పూర్తి స్వాతంత్ర్యం పొందింది.
  19. రష్యా సభ్యనామం "రష్యన్ ఫెడరేషన్" (Russian Federation).
  20. సమోవా పాతపేరు "పశ్చిమ సమోవా" (Western Samoa). 1997లో పేరు మార్పిడి జరిగింది.
  21. దక్షిణ ఆఫ్రికా పాత పేరు "యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా" 1961లో పేరు మార్పిడి జరిగింది.
  22. శ్రీలంక పాతపేరు "సిలన్" (Ceylon). 1972లో పేరు మార్పిడి జరిగింది.
  23. సిరియా సభ్యనామం "సిరియన్ అరబ్ రిపబ్లిక్" (Syrian Arab Republic).
  24. టాంజానియా సభ్యనామం "టాంజానియా యునైటెడ్ రిపబ్లిక్" (United Republic of Tanzania).
  25. థాయిలాండ్ మొదటిపేరు "సయామ్". 1949లో పేరు మార్పిడి జరిగింది.
  26. ఉక్రెయిన్ మొదటిపేరు "ఉక్రెయినియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్". 1991లో పేరు మార్పిడి జరిగింది.
  27. యునైటెడ్ కింగ్డమ్ సభ్యనామం "యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్బ్రిటన్ మరియు ఉత్తర ఐర్లాండ్" (United Kingdom of Great Britain and Northern Ireland).
  28. సభ్యనామం "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" (United States of America).
  29. వెనిజ్వెలా సభ్యనామం "బొలీవియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజ్వెలా" (Venezuela, Bolivarian Republic of).
  30. వియత్నాం సభ్యనామం "వియత్ నామ్" (Viet Nam).

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూస:United Nations