దైనిక్ జాగరణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox newspaper

Coordinates: 26°28′50″N 80°18′07″E / 26.48050°N 80.30200°E / 26.48050; 80.30200 దైనిక్ జాగరణ్ (హిందీ: दैनिक जागरण) అనేది భారతదేశంలో ఒక హిందీ భాషా దిన పత్రిక. వార్తా దినపత్రికల్లో సర్క్యులేషన్ (అమ్ముడయ్యే పత్రికల సంఖ్య)పరంగా ఇది భారతదేశంలో 3వ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా 17వ స్థానంలో ఉంది.[ఉల్లేఖన అవసరం]

అవలోకనం[మార్చు]

పురాణ్‌చంద్ర గుప్తా ఝాన్సీలో 1942లో దైనిక్ జాగరణ్ పత్రికను స్థాపించారు. 1947లో దైనిక్ జాగరణ్ ప్రధానకార్యాలయం కాన్పూర్‌కు మార్చబడింది, ఇక్కడ సెప్టెంబరు 21, 1947లో ఈ పత్రిక రెండో ఎడిషన్ ప్రారంభమైంది. రెవా మరియు భోపాల్ ఎడిషన్‌లను 1953 మరియు 1956లో ప్రారంభించారు. 1975లో, గోరఖ్‌పూర్ ఎడిషన్ ప్రచురణ ప్రారంభమైంది, తరువాత 1979లో వారణాసి, అలహాబాద్, లక్నో ఎడిషన్‌లు ప్రారంభమయ్యాయి. 1984లో, మీరట్ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఆపై, 1986లో ఆగ్రా, 1989లో బరేలీ, 1990లో ఢిల్లీ ఎడిషన్‌లను ప్రారంభించారు. 1997 మరియు 2006 మధ్యకాలంలో పద్దెనిమిది, 2007-08లో ఆరు కొత్త ఎడిషన్‌లు ప్రారంభమయ్యాయి.[1]

దైనిక్ జాగరణ్ పత్రికను 55.7 మిలియన్‌ల మందికిపైగా పౌరులు చదువుతున్నారు, తద్వారా ఇది భారతదేశంలో అత్యధిక పాఠకులు ఉన్న పత్రికగా గుర్తింపు పొందింది.Empty citation (help) ప్రస్తుతం దైనిక్ జాగరణ్ యొక్క 37 ఎడిషన్‌లు భారతదేశంలోని 11 రాష్ట్రాల్లో ప్రచురించబడుతున్నాయి. ఈ కింది ప్రాంతాల నుంచి దీని ఎడిషన్‌లు ప్రచురించబడుతున్నాయి:

ఈ పత్రిక వెబ్‌సైట్ Jagran.com, ఇది యువకులు, వంటమనుషులు, ఆధునిక మహిళలు, విద్య, బాలీవుడ్‌లకు సంబంధించిన అంశాలు మరియు స్థానిక వార్తలను అందిస్తుంది.

చెల్లింపులపై వార్తల ప్రచురణ వివాదం[మార్చు]

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దైనిక్ జాగరణ్ ప్రకటనలను వార్తలరూపంలో ప్రచురించినట్లు ఏప్రిల్ 2010లో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ధారించింది, ఈ వివాదం డబ్బు తీసుకొని వార్తల ప్రచురణ (పెయిడ్ న్యూస్)గా ప్రాచుర్యం పొందింది. రాష్ట్రీయ పరివర్తన్ దళ్‌కు చెందిన ఒక ప్రతిపక్ష అభ్యర్థికి అనుకూలంగా, పూర్తిగా ఏకపక్షంగా ఒక వార్తను ప్రకటన రూపంలో ప్రచురించిందని కౌన్సిల్ పేర్కొంది. ప్రెస్ కౌన్సిల్ ఒక ప్రకటనలో, ఎన్నికలు ఒక రోజులో జరగాల్సి ఉన్న తరుణంలో ఓటర్లను గందరగోళపరిచేవిధంగా ఈ వార్తను ప్రచురించినట్లు స్పష్టీకరించింది, పాత్రికేయ విలువలకు ఈ చర్య పూర్తిగా అనైతికమని, అంతేకాకుండా దీని ద్వారా ఈ పత్రిక ఎన్నికల చట్టాలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది.[2]

సూచనలు[మార్చు]

  1. "Corporate Profile". Jagran Prakashan Ltd. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)
  2. "Notice". Election Commission of India. 2010-06-22. Retrieved 2010-07-16. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]

మూస:Newspapers in India