దొంగాట (2015 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగాట
Manchu Lakshmi Dongaata Poster.jpg
దర్శకత్వము వంశీకృష్ణ
నిర్మాత మంచు లక్ష్మి
తారాగణం మంచు లక్ష్మీ
అడివి శేష్
సినిమెటోగ్రఫీ సామల భాస్కర్
కూర్పు ఎస్.ఆర్. శేఖర్
స్టుడియో మంచు ఎంటర్‌టైన్‌మెంట్
డిస్ట్రిబ్యూటరు Five Elements (Andhra & Ceded)
విడుదలైన తేదీలు 8 మే 2015
దేశము భారతదేశం
భాష తెలుగు

దొంగాట 2015 లో విడుదలైన క్రైం తెలుగు హాస్య చలన చిత్రం. దీనికి వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర కథను మోహన్ భరధ్వాజ మరియు వంశీకృష్ణ రాసారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాశాడు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి స్వయంగా మంచు ఎంటర్‌టైన్‌మెంటు బ్యానర్ పై నిర్మించింది.[1][2]

సాంకేతిక వర్గం[మార్చు]

  1. బ్యానర్‌: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
  2. తారాగణం: లక్ష్మీ మంచు, అడివి శేష్‌, మధునందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, పృధ్వీ, పవిత్ర తదితరులు
  3. మాటలు: బుర్రా సాయిమాధవ్
  4. సంగీతం: సత్య మహావీర్‌, సాయి కార్తీక్‌, రఘు కుంచె (యాందిరో)
  5. కూర్పు: యస్‌.ఆర్‌. శేఖర్‌
  6. ఛాయాగ్రహణం: సామల భాస్కర్‌
  7. నిర్మాత: లక్ష్మీ మంచు
  8. రచన, దర్శకత్వం: వంశీకృష్ణ
  9. విడుదల తేదీ: మే 8, 2015

కథ[మార్చు]

జీవితంలో ఏదైనా చెడ్డ పని చేసి అయినా సెటిల్‌ అయిపోవాలని చూసే వెంకట్‌ (శేష్‌), విజ్జు (మధు), కాటంరాజు (ప్రభాకర్‌) కలిసి శృతి (లక్ష్మీ) అనే ఓ సినిమా హీరోయిన్‌ని కిడ్నాప్‌ చేస్తారు. ఆమె తల్లి (పవిత్ర) దగ్గర్నుంచి పది కోట్లు డిమాండ్‌ చేస్తారు. మరి వారు ప్లాన్‌ చేసినట్టుగానే ఆ పది కోట్లు వారి చేతికి వస్తాయా, రావా అనేది పాత సినిమాలవలె సెటప్‌ పాతదే అయినా కానీ ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తదనం అందించారు. ఎక్కడికక్కడ ట్విస్టులతో ఈ క్రైమ్‌ కామెడీని ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. మధ్యలో సెంటిమెంటల్‌ టచ్‌ ఇవ్వడం కూడా జరిగింది. [3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]