దొడ్డనగౌడ జి. పాటిల్
| దొడ్డనగౌడ జి. పాటిల్ | |||
| పదవీ కాలం 2018 – 2023 | |||
| ముందు | విజయానంద్ కాశప్పనవర్ | ||
|---|---|---|---|
| తరువాత | విజయానంద్ కాశప్పనవర్ | ||
| నియోజకవర్గం | హంగుండ్ | ||
| పదవీ కాలం 2004 – 2013 | |||
| ముందు | గౌరమ్మ కాశప్పనవర్ | ||
| తరువాత | విజయానంద్ కాశప్పనవర్ | ||
| నియోజకవర్గం | హంగుండ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | హంగుండ్, కర్ణాటక | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దొడ్డనగౌడ గుండన గౌడ పాటిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హంగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]దొడ్డనగౌడ పాటిల్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో హంగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి కాశప్పనవర్ గౌరమ్మ శివశంకరప్పపై 18424 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి విజయానంద్ కాశప్పనవర్పై 5,069 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
దొడ్డనగౌడ పాటిల్ 2013 శాసనసభ ఎన్నికలలో హంగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి విజయానంద్ కాశప్పనవర్ చేతిలో 15,797 ఓట్లతేడాతో ఓడిపోయాడు.[2] ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి విజయానంద్ కాశప్పనవర్పై 5227 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
దొడ్డనగౌడ జి. పాటిల్ 2023 శాసనసభ ఎన్నికలలో హంగుండ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్సీ అభ్యర్థి విజయానంద్ కాశప్పనవర్ చేతిలో 30,007 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Hungund Constituency Election Results". 13 May 2023. Retrieved 19 January 2025.
- ↑ "Karnataka Election Results 2013, Karnataka Assembly Elections Results 2013". 2013. Archived from the original on 19 January 2025. Retrieved 19 January 2025.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ The Times of India (14 May 2023). "List of winning candidates and their constituencies in Karnataka assembly elections". Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.