దొప్పలపూడి సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దొప్పలపూడి సుబ్బారావు ప్రముఖ రంగస్థల నటుడు.

జననం[మార్చు]

వీరు వేమూరు మండలం పెనుమర్రు గ్రామంలో 1934లో శ్రీ వియ్యన్న, వెంకటరామమ్మ దంపతులకులకు జన్మించారు.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

వీరు 1952 లో రంగస్థల ప్రవేశం చేసారు. తొలి గురువు శ్రీ ముక్కామల రాఘవయ్య. 1955లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చేరి, 1992లో పదవీ విరమణ పొందే వరకూ, బాలయ్య మాష్టారుగా మంచి గుర్తింపు పొందినారు. తొలిగా ఈయన రాణీ సంయుక్త, పన్నా, మల్లమాంబ తదితర ష్త్రీ పాత్రలు పోషించి ప్రేక్షకులనలరించారు. తరువాత షణ్మిఖి, పీసపాటి, ధూళిపాళ్ళ, ఈలపాట రఘురామయ్య, తదితర మహామహులైన రంగస్థల నటుల సరసన నటించి ఔరా అనిపించుకున్నారు.

స్త్రీ పాత్రలెన్నో:- తొలి దశలో శ్రీ వేమూరి రామయ్య నాటక కంపెనీ ద్వారా ప్రదర్శనలిచ్చారు. మహారథిలో కుంతి, పరశురాముడు, నర్తనశాలలో బృహన్నల, భూకైలాస్ లో కైకసి పాత్రలు పోషించారు. మధ్యలో మూడు సంవత్సరాలు మినహా, 1965 నుండి 1985 వరకు ఈ సమాజంలో నటించారు. ఆ తరువాత వల్లూరు వెంకటరావు నాటక సమాజంలో కట్టబ్రహ్మన్న లో మంత్రి, భక్త శబరిలో మాతంగ మహర్షి పాత్రలు పోషించారు. 2006 నుండి, సాయి కళా స్రవంతి అను నాటక సమాజంలో పనిచేసారు. 2007 నుండి ఈ సమాజానికి అధ్యక్షులుగా కొనసాగుచున్నారు. ఈ సమాజం నుండి 'బుద్ధం-అశోకం', 'బుద్ధం-శరణం-గచ్ఛామీ నాటకాలలో చెన్నుడు పాత్రను, రాగవాశిష్టం లో ప్రాచీనుడు పాత్రలు పోషించారు.

60 ఏళ్ళపాటు నాటకరంగంలో విస్తృతసేవలు అందించి, మూడు తరాల కళకారులతో నటించి, అందరి ఆదరాభిమానాలను పొందినారు. ఇటీవల ఆయనను మాజీ మంత్రి శ్రీ బుద్ధప్రసాద్, మాజీ ఎం.ఎల్.ఏ.శ్రీ దేవినేని మల్లిఖార్జునరావు గార్లు ఘనంగా సన్మానించారు.

మరణం[మార్చు]

వీరు 2013లో, ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూసినారు. [ఈనాడు గుంటూరు రూరల్;]

మూలాలు[మార్చు]