దోటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మలు, కాయలు కోయడానికి ఉపయోగించే పొడవైన ఆయుధాన్ని లేదా పరికరాన్ని దోటి అంటారు. సాధారణంగా దోటికి పొడవైన బరువు తక్కువగా గట్టిగా ఉండే వెదురు కర్రలు ఉపయోగిస్తారు.

మామిడి చెట్లకు కాయలు కోసేటప్పుడు కాయలు కింద పడి పగిలి పోకుండా ఉండేందుకు దోటికి వలను ఏర్పాటు చేస్తారు. అందువలన దోటి కున్న హుక్ సహాయంతో కాయ తొడిమకు హుక్ ను తగిలించి లాగినపుడు తొడిమ తెగిన కాయ వలలో పడుతుంది.

తాటి గెలల వంటి బలమైన గట్టి కాడ ఉన్న గెలలు కోయడానికి పదునైన కొడవలి వంటి ఆయుధాన్ని కట్టిన దోటిని ఉపయోగిస్తారు.

జాగ్రత్తలు[మార్చు]

దోటితో గెలలు కోసేటప్పుడు దానికి కట్టిన కొడవలి ఊడి పైన పడే అవకాశం ఉన్నందున కొడవలిని గట్టిగా కట్టడం మరియు కోసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం.

గెలలు కోసేటప్పుడు గెలలు, కాయలు పైన పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దోటి&oldid=2112090" నుండి వెలికితీశారు