దౌలత్ సింగ్ కొఠారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దౌలత్ సింగ్ కొఠారి

దౌలత్ సింగ్ కొఠారి ( జూలై 6, 1906 - ఫిబ్రవరి 4, 1993) ఈయన భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈయన 1906, జులై 6 న రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జన్మించాడు. ఈయన తన ప్రాథమిక విద్యను ఉదయపూర్, ఇండోర్ నగరాలలో పూర్తిచేసాడు. ఈయన 1928 లో అలహాబాద్ విశ్వవిద్యాలయం నుంచి భౌతిక శాస్త్రం విభాగంలో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసాడు. ఈయన తన పీహెచ్‌డీ కోసం కోతారీ ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ పర్యవేక్షణలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని కావెండిష్ ప్రయోగశాలలో పూర్తిచేసాడు.

పదవులు[మార్చు]

ఈయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా, ఫిజిక్స్ విభాగాధిపతిగా పలు విభాగాల్లో పనిచేశాడు. ఈయన 1948 నుండి 1961 వరకు రక్షణ మంత్రిత్వ శాఖకు శాస్త్రీయ సలహాదారుగా పనిచేశాడు. ఈయన1961 నుంచి 1973 వరకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశాడు.

పురస్కారాలు, గుర్తింపులు[మార్చు]

ఈయన 1963 లో స్వర్ణోత్సవ సమావేశంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన 1973 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈయన గణాంక థర్మోడైనమిక్స్, థియరీ ఆఫ్ వైట్ డ్వార్ఫ్ స్టార్స్ పై ఆయన చేసిన పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. ఈయనకు 1962 లో పద్మ భూషణ్, 1973 లో పద్మ విభూషణ్ 1973 లో ప్రదానం చేశారు.

మూలాలు[మార్చు]