ద్యావనపల్లి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ద్యావనపల్లి సత్యనారాయణ ప్రముఖ చరిత్రకారుడు[1] మరియు ఏపీ గిరిజన సంగ్రహాలయ సంరక్షకులు.[2] ఆయన పరిశోధనా విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు.[3]

రచనలు[మార్చు]

  • భువనైక సౌందర్యం [4]
  • ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర.[5]
  • ఎనిమిది సంవత్సరాల రామప్ప.[5] (సంపాదకులు)
  • తెలంగాణలో కొత్త పర్యాటక స్థలాలు [5]
  • తెలంగాణ చరిత్రసంస్కృతి [6]

పరిశోధనలు[మార్చు]

  • వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న రెండు పెద్ద గుండ్లపై బుద్ధుడు, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడి శిల్పముద్రలు లభించాయి. క్రీ.శ. 435వ సంవత్సరంలో గోవిందరాజు వర్మ అనే రాజు తన 37వ రాజ్యసంవత్సరంలో రూపొందించిన రాగిశాసనాల ఆధారంగా ఆయన ఆధారాలను వెలికితీశారు. ఈ శాసనాల ఆధారంగా ఇంద్రపాలనగరం, బౌద్ధ విగ్రహాల కోసం ఆయన పరిశోధన చేశారు. ఆయన పరిశోధనలో అక్కడ బౌద్ధవిగ్రహాలు ఉన్న మాట నిజమేనని, దాదాపు 1580 ఏళ్ల క్రితమే అక్కడ బుద్ధ పూర్ణిమ నిర్వహించారని తేలింది. [7]
  • పాలమూరు జిల్లాలోని వంగూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పరిధిలోనున్న చెన్నయవొలం గుట్టల్లో నెలకొన్న ఒక కోవెలలో 17వ శతాబ్దంనాటి శాసనాన్ని ద్యావనపల్లి గుర్తించారు. ఈ శాసనానికి సమీపంలోని తిమ్మినోని చెరువుంది. శాసనంలోనూ నరహరి పేరిట ఒక చెరువు నిర్మించినట్లు ఉంది. ఆ గుట్టపై అనేక గుహల్లో నవీన శిలాయుగం నాటి పురావస్తు ఆధారాలు లభించాయి.[8]
  • కొన్ని కుండ ముక్కలు మరియు రాతి ముక్కలు మహబూబ్ నగర్ నుండి 20 కి.మీ దూరంలో గల మన్నెంకొడ వద్ద గల రాతి గుహలలో గల చిత్రాలనుండి కనుగొనబడినవి. తెలంగాణ యొక్క చరిత్ర 10,000 సంవత్సరాల ముందుగా యున్నట్లు ఆధారాలు లభించాయి.[9]
  • అమ్రాబాద్‌ మండలం, మెడిమల్కల సమీపాన పురాతన ఆలయం వద్ద కాకతీయులకు సంబంధించిన శాసనాలు, చిత్రాలు లభ్యమయ్యాయి. వీరవనిత రుద్రమదేవి క్రీ.శ.1296లో మరణించలేదనీ... నల్గొండ జిల్లా చందుపట్లలో వెలుగుచూసిన శిలాశాసనం ప్రకారం క్రీ.శ.1289 నవంబరు చివరివారంలో మృతి చెందిందన్న అంశాన్నే ఈ శిలాశాసనమూ ధ్రువీకరిస్తున్నట్లు సత్యనారాయణ చెప్పారు. మేడిమల్కల (మేడిమ లంకలు) ప్రసిద్ధ మల్లికార్జున దేవాలయం, దానికి అనుబంధంగా కలు మఠం ఉండేవని క్రీ.శ.1290 ఫిబ్రవరి 20 తేదీతోఉన్న శాసనం చెబుతోంది.[10]

మూలాలు[మార్చు]

  1. Ancient Rock Art Found In The Indian 'Valley Of Letters'
  2. తెలంగాణ చరిత్ర పితామహుడు- డా. ద్యావనపల్లి సత్యనారాయణ
  3. 36 మందికి కీర్తి పురస్కారాలు
  4. పర్యాటక కేంద్రంగా భువనగిరి అభివృద్ధి
  5. 5.0 5.1 5.2 ద్యావనపల్లి సత్యనారాయణ పుస్తక పరిచయాలు
  6. తెలంగాణ చరిత్ర ఇంకా గుప్తనిధే
  7. 580 ఏళ్ల కిందటే బుద్ధపూర్ణిమ! Sakshi | Updated: May 04, 2015
  8. పాలమూరులో నవీన శిలాయుగం జాడలు
  9. "Blast from the past". SURESH KRISHNAMOORTHY. The Hindu. 29 July 2015. Retrieved 22 May 2016. Cite news requires |newspaper= (help)
  10. నల్లమలలో రుద్రమదేవి మరణ శాసనం

ఇతర లింకులు[మార్చు]