ద్రవ్యరాశి, భారం
ద్రవ్యరాశి
[మార్చు]ఒక పదార్థంలో గల ద్రవ్య పరిమాణము (ద్రవ్య సంచయము) ను దాని ద్రవ్యరాశి అంటారు. ఇది అదిశరాశి. ఇది ప్రదేశమును బట్టి మారదు. ఇది వస్తువుల యొక్క ప్రాథమిక లక్షణం. ఇది విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా యుంటుంది. దీనిని సాధారణ త్రాసుతో కొలుస్తారు. దీనిని "" అనే అక్షరంతో సూచిస్తారు. దీని ప్రమాణములు C.G.S పద్ధతిలో "గ్రాము", F.P.S పద్ధతిలో "పౌండు" S.I పద్ధతిలో "కిలో గ్రాము".
- ఉదాహరణకు భూమిపై ఒక వ్యక్తి ద్రవ్యరాశి 60 కి.గ్రా. అయితే చంద్రునిపైకి పోయినా సరే 60 కి.గ్రా. ఉంటుంది. దీనిని బట్టి ద్రవ్యరాశి ప్రదేశం బట్టి మారదని తెలుస్తుంది.
భారము
[మార్చు]వస్తువుపై గల భూమ్యాకర్షణ బలాన్ని భారం అంటారు. దీనికి దిశ పరిమాణం ఉంటుంది కనుక ఇది సదిశరాశి. ఇది దాని ద్రవ్యరాశి, గురుత్వ త్వరణాల లబ్ధానికి సమానం.ఇది ప్రదేశం బట్టి మారుతుంది. ఎందువలనంటే భారం గురుత్వ త్వరణం పై ఆధారపడి యుంటుంది. గుతుత్వ త్వరణం ప్రదేశాన్ని బట్టి మారుతుంది. దీనిని స్ప్రింగ్ త్రాసుతో కొలుస్తారు.దీనిని ""తో సూచిస్తారు.
- వస్తుభారం, దాని మీద పని చేసే గురుత్వాకర్షణ వలన ఏర్పడుతుంది, కనుక బలం, భారాల ప్రమాణాలు ఒకటే.
S.I. పద్ధతిలో భారం ప్రమాణం న్యూటన్ (N) లేదా కిలోగ్రాం భారం లేదా kg wt లేదా kgf
C.G.S. ప్రమాణాలు. లో డైను లేదాgmwt లేదా gmf .
1 కి.గ్రా ద్రవ్యరాశి గల వస్తువు బరువు = 9.8 న్యూటన్లు
- వస్తుభారం, దాని మీద పని చేసే గురుత్వాకర్షణ వలన ఏర్పడుతుంది, కనుక బలం, భారాల ప్రమాణాలు ఒకటే.
భారమునకు సూత్రము
[మార్చు]'m' ద్రవ్యరాశి గాను, 'g' గురుత్వ త్వరణం గాను ఉన్న ఒక వస్తువుకు కలిగే భారం
భారం మారే అంశాలు
[మార్చు]- కాని g విలువ ప్రదేశాన్ని బట్టి మారడం వలన వస్తుభారం కూడ ప్రదేశాన్ని బట్టి మారుతుంటుంది. ఉదాహరణకు చంద్రుని మీద వస్తుభారం, అది భూమి మీద ఉన్న భారంలో 1/6 వ వంతుంటుంది. దీనికి కారణం చంద్రుని గురుత్వ త్వరణం, భూ గురుత్వ త్వరణంలో 1/6 వ వంతుండడమే. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినపుడు g తగ్గడం వలన దాని భారం కూడ తగ్గుతుంది. భూమి వ్యాసార్థమునకు సగం పొడవు(సుమారు 3200 కి.మీ) గల దూరం ఎత్తునకు పోయినపుడు వస్తువు భారం శూన్యమవుతుంది. ధృవాల వద్ద భూ వ్యాసార్థం తక్కువ కావున గురుత్వ త్వరణం ఎక్కువ. అందువలన వస్తువు భారం ధృవాల వద్ద గరిష్టంగా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద భూ వ్యాసార్థం ఎక్కువ కావున గురుత్వ త్వరణం తక్కువ. అందువలన భూమధ్య రేఖ వద్ద వస్తువు భారం కనిష్టం గా ఉంటుంది.
భారానికి ప్రమాణాలు
[మార్చు]వస్తుభారం, దాని మీద పని చేసే గురుత్వాకర్షణ వలన ఏర్పడుతుంది, కనుక బలం, భారాల ప్రమాణాలు ఒకటే. S.I. పద్ధతిలో భారం ప్రమాణం న్యూటన్ (N). మరొక ప్రమాణం కూడా ఉంది. అది కిలోగ్రాం భారం లేదా kg wt లేదా kgf లేదా gmwt లేదా gmf లు వరుసగా S.I. C.G.S. ప్రమాణాలు.
1 కి.గ్రాం ద్రవ్యారాశి కల వస్తువు మీద పని చేసే గురుత్వాకర్షణ బలం 1 కి.గ్రా. భారం
g = 9.8 మీ.సె−2, అనుకుంటే,
1 కి.గ్రా. భారం = 1 Kgf = 9.8 న్యూటన్ అనగా 1 కి.గ్రా. ద్రవ్యరాశి భారం 9.8 న్యూటన్. g విలువ ఎత్తు, లోతు, ప్రదేశాలను బట్టి మారడం వలన భారం కూడా అదే విధంగా మారుతుంది. కాని ద్రవ్యరాశి మాత్రం మారదు.