Jump to content

ద్రవ జీవాణు పరీక్ష

వికీపీడియా నుండి
ద్రవ జీవాణు పరీక్ష
Purposeకొన్ని వారాల వ్యవధిలో బహుళ నమూనాలను
తీసుకోవడం ద్వారా క్యాన్సర్ చికిత్స,
మందు సామర్థ్యాన్ని ధృవీకరించడానికి
చికిత్స తర్వాత క్యాన్సర్ పునరావృతాన్ని
పర్యవేక్షించడానికి
Test ofరక్తం నమూనా విశ్లేషణ

ద్రవ జీవాణు పరీక్ష లేదా ద్రవ బయాప్సీ అనేది ఘనం-కాని జీవ కణజాలం, ప్రధానంగా రక్తం నమూనా విశ్లేషణ. దీని ఆంగ్ల పదం లిక్విడ్ బయాప్సీ లేదా ఫ్లూయిడ్ బయాప్సీ.[1][2] సాంప్రదాయ బయాప్సీ మాదిరిగానే, ఈ సాంకేతికత ప్రధానంగా క్యాన్సర్ వంటి వ్యాధులకు రోగనిర్ధారణ, పర్యవేక్షణకు సాధనంగా ఉపయోగించుతారు. దీని వలన అదనపు ప్రయోజనం ఏమంటే శరీరం లో చర్మంద్వారా కానీ , గ్రుచ్చి కానీ, కోసి కానీ పరికరాలను చొప్పించకుండా (నాన్ -ఇన్వాసివ్ ప్రక్రియ). కొన్ని వారాల వ్యవధిలో ఎక్కువ నమూనాలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్ చికిత్స, మందు సామర్థ్యాన్ని ధృవీకరించడానికి లిక్విడ్ బయాప్సీలను ఉపయోగించవచ్చు. చికిత్స తర్వాత రోగులకు క్యాన్సర్ పునరావృతాన్ని పర్యవేక్షించడానికి కూడా ఈ సాంకేతికత చాల ప్రయోజనకరంగా ఉంటుంది.[3] ద్రవ జీవాణుపరీక్షల క్లినికల్ అమలు ఇంకా విస్తృతంగా లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో సంరక్షణ ప్రమాణంగా మారుతోంది.[4]

లిక్విడ్ బయాప్సీ అనేది న్యూక్లియిక్ ఆమ్లాలు, ఉపకణ నిర్మాణాలు, ముఖ్యంగా ఎక్సోసోమ్లు, క్యాన్సర్ సందర్భంలో, కణితి కణాలను ప్రసరింపజేసే జీవ ద్రవాలలో పరమాణు విశ్లేషణను సూచిస్తుంది.[5]

రకాలు

[మార్చు]

అనేక రకాల లిక్విడ్ బయాప్సీ పద్ధతులు ఉన్నాయి. అయితే ఏ పద్ధతి అనేది అధ్యయనం జరుగుతున్న పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

వ్యాధి కణజాల నమూనా నమూనా విధానం శరీరంలో చొప్పించడం వేరు చేయబడిన పదార్ధం గుర్తించే పధ్ధతి విశ్లేషణ
కాన్సర్

(వివిధ రకాలు) [6][7][8][9]

రక్తం ఫ్లెబాటమీ*

ప్రయోగశాలలో పరీక్ష కోసం సిర నుండి రక్తాన్ని తీసుకోవడానికి సూదిని ఉపయోగించే ప్రక్రియ.

కొంచెం Circulating tumor cells (CTCs) Various (e.g. CellSearch, RosetteStep, Dynabeads) Flow cytometry, nucleic acid extraction, immunocytochemistry, functional assays
Cancer (various) రక్తం ఫ్లెబాటమీ కొంచెం Circulating tumor DNA (ctDNA) DNA extraction Next-generation sequencing
Urothelial carcinoma మూత్రం మూత్రం సేకరణ లేదు Urinary tumor DNA (utDNA) DNA extraction Next-generation sequencing
Non-urological cancers మూత్రం మూత్రం సేకరణ లేదు Urine proteins, metabolites HPLC-MS Proteomics, metabolomics
Bladder and prostate cancer మూత్రం మూత్రం సేకరణ లేదు Exfoliated cancer cells Urinalysis Fluorescence in situ hybridization
Heart attack రక్తం ఫ్లెబాటమీ కొంచెం Circulating endothelial cells (CECs) Various (e.g. CellSearch, HD-CEC) Flow cytometry
Neurological diseases సెరిబ్రో స్పైనల్

ద్రవం

కటి భాగంలో సూది Invasive CSF proteins, nucleic acids Various ELISA, multiplex assay, next-generation sequencing
Prenatal diagnosis రక్తం

(maternal)

ఫ్లెబాటమీ కొంచెం Cell-free fetal DNA (cffDNA) DNA extraction Karyotyping, fluorescent in situ hybridization
Prenatal diagnosis రక్తం

(maternal)

ఫ్లెబాటమీ కొంచెం Fetal cells in maternal blood (FCMB) Flow cytometry Karyotyping, fluorescent in situ hybridization
Prenatal diagnosis రక్తం

(బొడ్డుతాడు)

Cordocentesis Invasive Umbilical blood cells and molecules Various Karyotyping, blood typing, blood tests, Kleihauer–Betke test, flow cytometry
Prenatal diagnosis అమ్నియోటిక్

ద్రవం (ఉమ్మనీరు)

Amniocentesis Invasive Amniotic fluid cells and molecules Various Karyotyping, blood typing, L/S ratio, S/A ratio

వ్యాధులను గుర్తించడానికి లేదా పర్యవేక్షించడానికి అనేక రకాల బయోమార్కర్లను అధ్యయనం చేస్తారు. ఉదాహరణకు, రక్త నమూనాల నుండి ప్రోటోపోర్ఫిరిన్ IX వేరుచేయడం అథెరోస్క్లెరోసిస్కు రోగనిర్ధారణ కు సాధనంగా ఉపయోగించవచ్చు.[10] రక్తంలో క్యాన్సర్ బయోమార్కర్లలో PSA (ప్రోస్టేట్ క్యాన్సర్) (ప్యాంక్రియాటిక్ క్యాన్సర్), CA-125 (అండాశయ క్యాన్సర్) లను పేర్కోవచ్చు.

కాన్సర్ చికిత్సలో లిక్విడ్ బయాప్సీ

[మార్చు]

క్యాన్సర్, ద్రవ బయాప్సీని బహుళ-క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకు ఉపయోగించవచ్చు, సాధారణ కణితి బయాప్సీలు తరచు సాధ్యం కానప్పుడు, క్లినికల్ ట్రయల్స్లో భాగంగా వివిధ చికిత్సలను పోల్చడానికి, వైద్యులు/రోగులకు ఏ ఖచ్చితమైన ఔషధ చికిత్సను ఎంచుకోవాలో నిర్ణయాలను తెలియజేయడానికి, మరియు కనీస అవశేష వ్యాధి గుర్తింపు కోసం (వ్యాధి పర్యవేక్షణ).[11] EGFR-ఉత్పరివర్తన ఊపిరితిత్తుల క్యాన్సర్ కోసం కణితి DNA ప్రసరణ యొక్క ద్రవ బయాప్సీ FDA చే ఆమోదించబడింది.[12]

మెటాస్టాటిక్ రొమ్ము, పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లలో ప్రసరణ కణితి కణాల గణన కోసం సెల్ సెర్చ్ పద్ధతిని ఉపయోగకరమైన రోగనిర్ధారణ పద్ధతిగా అమెరికా కు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ధృవీకరించింది, ఆమోదించింది.[10]

ద్రవ జీవాణుపరీక్షలు సంప్రదాయ ఇమేజింగ్ పరీక్షలకు నెలలు లేదా సంవత్సరాల ముందే కణితిలో మార్పులను గుర్తించగలవు, ఇవి ప్రారంభ కణితి గుర్తింపు, పర్యవేక్షణ ప్రతిఘటన ఉత్పరివర్తనాలను గుర్తించడానికి వీలవుతుంది.[10][13][14] వివిధ పరిశోధనా రంగాలలో NGS (Next Generation Sequencing) స్వీకరణ పెరుగుదల, పురోగతి, ఔషధం స్వీకరణ మొదలగునవి ఈ ప్రక్రియను మరింత వినియోగంలోకి వస్తుందని భావిస్తున్నారు.[15]

మూలాలు

[మార్చు]
  1. (January 2013). "Circulating tumor cells: liquid biopsy of cancer".
  2. (9 July 2013). "Liquid biopsy: monitoring cancer-genetics in the blood".
  3. "Understanding cancer's unruly origins helps early diagnosis". The Economist. September 14, 2017. Retrieved 2017-09-29.
  4. (November 2015). "Liquid biopsy: will it be the 'magic tool' for monitoring response of solid tumors to anticancer therapies?".
  5. "Liquid Biopsy - an overview | ScienceDirect Topics". www.sciencedirect.com. Retrieved 2023-11-08.
  6. Peeters, D J E; De Laere, B; Van den Eynden, G G; Van Laere, S J; Rothé, F; Ignatiadis, M; Sieuwerts, A M; Lambrechts, D; Rutten, A; van Dam, P A; Pauwels, P; Peeters, M; Vermeulen, P B; Dirix, L Y (April 2013). "Semiautomated isolation and molecular characterisation of single or highly purified tumour cells from CellSearch enriched blood samples using dielectrophoretic cell sorting". British Journal of Cancer. 108 (6): 1358–1367. doi:10.1038/bjc.2013.92. PMC 3619252. PMID 23470469.
  7. Nakazawa, M.; Lu, C.; Chen, Y.; Paller, C. J.; Carducci, M. A.; Eisenberger, M. A.; Luo, J.; Antonarakis, E. S. (2015-09-01). "Serial blood-based analysis of AR-V7 in men with advanced prostate cancer". Annals of Oncology. 26 (9): 1859–1865. doi:10.1093/annonc/mdv282. ISSN 0923-7534. PMC 4551160. PMID 26117829.
  8. Agerbæk, Mette Ø.; Bang-Christensen, Sara R.; Yang, Ming-Hsin; Clausen, Thomas M.; Pereira, Marina A.; Sharma, Shreya; Ditlev, Sisse B.; Nielsen, Morten A.; Choudhary, Swati; Gustavsson, Tobias; Sorensen, Poul H.; Meyer, Tim; Propper, David; Shamash, Jonathan; Theander, Thor G.; Aicher, Alexandra; Daugaard, Mads; Heeschen, Christopher; Salanti, Ali (December 2018). "The VAR2CSA malaria protein efficiently retrieves circulating tumor cells in an EpCAM-independent manner". Nature Communications. 9 (1): 3279. Bibcode:2018NatCo...9.3279A. doi:10.1038/s41467-018-05793-2. PMC 6095877. PMID 30115931.
  9. Thiele, Jana- A.; Pitule, Pavel; Hicks, James; Kuhn, Peter (2019). "Single-Cell Analysis of Circulating Tumor Cells". Tumor Profiling. Methods in Molecular Biology. Vol. 1908. pp. 243–264. doi:10.1007/978-1-4939-9004-7_17. ISBN 978-1-4939-9002-3. PMC 7679177. PMID 30649733.
  10. 10.0 10.1 10.2 Error on call to Template:cite paper: Parameter title must be specified
  11. . "Shifting the Cancer Screening Paradigm: The Rising Potential of Blood-Based Multi-Cancer Early Detection Tests".
  12. . "The first liquid biopsy test approved. Is it a new era of mutation testing for non-small cell lung cancer?".
  13. McDowell, Sandy."Liquid Biopsies: Past, Present, and Future". American Cancer Society. 12 February 2018. Retrieved 12 March 2019.
  14. "Liquid Biopsy: Using DNA in Blood to Detect, Track, and Treat Cancer". National Cancer Institute. 8 November 2017. Retrieved 12 March 2019.
  15. "Liquid Biopsy Market - A Global and Regional Analysis: Focus on Offering, Usage, Workflow, Circulating Biomarker, Sample, Technology, Clinical Application, End User, and Region - Analysis and Forecast, 2022-2032". bisresearch.com (in ఇంగ్లీష్). Retrieved 2022-09-19.