ద్రష్టి దామీ
Appearance
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఏప్రిల్ 2017) |
ద్రష్టి దామి (జననం 10 జనవరి 1985),[1] భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి. ఆమె నటించిన దిల్ మిల్ గయే, గీత్-హుయీ సబ్సే పరాయీ, మధుబాలా-ఏక్ ఇష్క్ ఏక్ జనూన్, ఏక్ థా రాజా ఏక్ థా రాణీ వంటి ధారావాహికల్లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి.[2] ప్రస్తుతం ఆమె స్టార్ ప్లస్ లో ప్రసారమవుతున్న పరదేశ్ మై హై మేరా దిల్ అనే ధారావాహికలో అర్జున్ బిజ్లానీ సరసన నైనా పాత్రలోనూ, జీ టీవీలో ప్రసారమవుతున్న ఏక్ థా రాజా ఏక్ థా రాణీ ధారావాహికలో సిద్ధార్ధ్ కర్నిక్ సరసన గాయత్రి పాత్రలోనూ నటిస్తోంది.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]జనవరి 10, 1985న ముంబైలోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది దామీ. ముంబైలోని మేరీ ఇమ్మెక్యులేట్ గర్ల్స్ హైస్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసింది ఆమె. ఆ తరువాత ముంబై మితిబాయ్ కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చదివింది.[3] ఆమె తోటికోడలు సుహసీ ధామి కూడా టెలివిజన్ నటి.
మూలాలు
[మార్చు]- ↑ "Birthday girl Drashti Dhamis fans make her trend on Twitter". India Today. 10 January 2014. Retrieved 24 July 2016.
- ↑ "I didn't think I could be lead: Drashti Dhami". Times of India. 7 June 2012. Archived from the original on 20 ఆగస్టు 2013. Retrieved 29 June 2012.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Drashti Dhami: Lesser known facts". The Times of India. 21 April 2015. Retrieved 15 August 2016.