Jump to content

ద్రోణంరాజు శ్రీనివాస్

వికీపీడియా నుండి
ద్రోణంరాజు శ్రీనివాస్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 నుండి 2014
ముందు కంభంపాటి హరిబాబు
తరువాత వాసుపల్లి గణేష్‌ కుమార్‌
నియోజకవర్గం దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 ఫిబ్రవరి 1961
యలమంచిలి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 04 అక్టోబర్ 2020
విశాఖపట్నం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ద్రోణంరాజు సత్యనారాయణ
జీవిత భాగస్వామి శశి
సంతానం శ్రీవత్సవ, శ్వేత
నివాసం పెదవాల్తేర్‌ డాక్టర్స్‌ కాలనీ
వృత్తి రాజకీయ నాయకుడు
14, డిసెంబర్ 2021నాటికి

ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ద్రోణంరాజు శ్రీనివాస్ 1 ఫిబ్రవరి 1961లో విశాఖపట్నంలో జన్మించాడు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుండి 1984లో బి.కామ్, బరంపురం యూనివర్సిటీ నుండి 1997లో బీఎల్‌ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ద్రోణంరాజు శ్రీనివాస్ కళాశాలలో చదివేరోజుల్లోనే రాజకీయాల పట్ల అకర్షితుడై ఎన్ఎస్ యూఐ నేతగా పని చేశాడు. ఆయన తన తండ్రి అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో విశాఖ జిల్లా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, విశాఖ జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ద్రోణంరాజు శ్రీనివాస్ 2006లో తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ మరణాననంతరం 2006లో జరిగిన ఉప ఎన్నికలో దక్షిణ విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ద్రోణంరాజు శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ తరపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9 ఫిబ్రవరి 2012న ప్రభుత్వ విప్‌గా నియమితుడై, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా కూడా పని చేశాడు. ఆయన 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓటమిపాలై, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తర్వాత నూతనంగా ఏర్పాటైన విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎండీఆర్‌ఏ) తొలి చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3]

మరణం

[మార్చు]

శ్రీనివాస్‌కు 2020లో కరోనాబారిన పడి కోలుకున్న తరువాత ఇతర ఆరోగ్య సమస్యలతో శ్రీనివాస్‌ హెల్త్‌సిటీలోని పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 4 అక్టోబర్ 2020న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (4 October 2020). "యూత్ లీడర్ గా మొదలై ఎమ్మెల్యేగా ఎదిగిన ద్రోణంరాజు". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  3. Sakshi (5 October 2020). "విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే'". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
  4. Eenadu (4 October 2020). "వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు కన్నుమూత". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.
  5. Sakshi (5 October 2020). "ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత". Archived from the original on 14 December 2021. Retrieved 14 December 2021.