ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు వనమాడి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం కాకినాడ పట్టణ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 8 జులై 1967
కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ద్వారంపూడి భాస్కరరెడ్డి
జీవిత భాగస్వామి మహాలక్ష్మి
సంతానం ఇద్దరు కుమార్తెలు

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జన్మించాడు. ఆయన బీకాం వరకు చదువుకున్నాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988లో రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ సంయుక్త కార్యదర్శిగా, 2000–2009 పీసీసీ సభ్యుడిగా, 2000 నుంచి 2006 వరకూ కాకినాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, 2005లో హౌసింగ్‌ బోర్డు డైరెక్టర్‌గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి బందన హరి పై 9279 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.


ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు పై 14111 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  3. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.