ద్విపత్ర కవాట భ్రంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mitral valve prolapses
Classification and external resources
Heart mitral prolapse.svg
In mitral valve prolapse, the leaflets of the mitral valve prolapse back into the left atrium.
ICD-10I34.1
ICD-9394.0, 424.0
OMIM157700
DiseasesDB8303
MedlinePlus000180
eMedicineemerg/316
MeSHD008945

ద్విపత్ర కవాట భ్రంశం (Mitral valve prolapse) (MVP ) అనేది గుండె కవాటాలకు సంబంధించిన ఒక వ్యాధి, హృదయ సంకోచం సమయంలో అసాధారణ స్థాయిలో మందంగా మారిన మిట్రాల్ కవాట (ద్విపత్ర కవాట) రెక్క ఎడమ కర్ణికలోకి స్థానభ్రంశం చెందటాన్ని ద్విపత్ర కవాట భ్రంశంగా పరిగణిస్తారు.[1] వివిధ రకాల MVPలు ఉన్నాయి, ఎక్కువగా వీటిని ప్రామాణిక మరియు ప్రామాణికేతర రకాలుగా వర్గీకరిస్తారు. ప్రామాణికేతర రూపంలో MVP తక్కువ నష్టంతో కూడిన సమస్యలకు కారణమవుతుంది. ప్రామాణిక MVP యొక్క తీవ్రమైన సందర్భాల్లో, ద్విపత్ర కవాటంలో రక్తం వెనక్కు పంపబడటం (మిట్రాల్ రెగుర్జిటేషన్), ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్, రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం (కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్), అరుదైన పరిస్థితుల్లో -గుండె పోటు వలన హఠాన్మరణం తదితర సంక్లిష్టతలు ఏర్పడతాయి.

MVPకి చికిత్స ఎకోకార్డియోగ్రఫీపై ఆధారపడివుంటుంది, ద్విపత్ర కవాటాన్ని (మిట్రాల్ కవాటం) చూసేందుకు ఈ పరీక్షలో ఆల్ట్రాసౌండ్‌ను ఉపయోగిస్తారు. ప్రారంభ అధ్యయనాలు ఆరోగ్యవంతులైన 38% మంది యుక్త వయస్కుల్లో ఈ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి; ఎకోకార్డియోగ్రఫిక్ పద్ధతులు మరియు స్పష్టమైన రోగనిర్ధారణ ప్రమాణాలు మెరుగుపడటంతో, MVP యొక్క వాస్తవ ప్రాబల్యం జనాభాలో 2-3% ఉంటుందని అంచనా.[1]

ఈ పరిస్థితిని మొట్టమొదటిసారి 1966లో జాన్ బ్రెరెటన్ బార్లో వివరించారు, [2] తరువాత దీనికి జే. మైకెల్ క్రిలే మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ అనే పేరు పెట్టారు.[3]

అవలోకనం[మార్చు]

ఒక మిట్రే ధరించిన సెయింట్ జీనాన్ ఆఫ్ వెరోనా

బిషప్ యొక్క మిట్రేను పోలివుండటం వలన ఈ ద్విపత్ర కవాటానికి మిట్రాల్ కవాటం అనే పేరు వచ్చింది. గుండెలో ఎడుమ జఠరిక నుంచి ఎడమ కర్ణికలోకి రక్తం వెనక్కు రాకుండా అడ్డుకునే హృదయ కవటాన్ని మిట్రాల్ కవాటంగా గుర్తిస్తారు. దీనిలో రెండు రెక్కలు ఉంటాయి, ఒకటి ముందువైపుకు మరియు మరొకటి వెనుకవైపుకు పని చేస్తాయి, ఎడమ జఠరిక సంకోచించినప్పుడు ఇవి మూసుకుపోతాయి.

ప్రతి రెక్కలో మూడు కణజాల పొరలు ఉంటాయి, అవి: ఆర్టియాలిస్, ఫైబ్రోసా, మరియు స్పాన్‌జియోసా . ప్రామాణిక ద్విపత్ర కవాట భ్రంశంతో బాధపడుతున్న రోగుల్లో అదనపు సంధాయక కణజాలం ఉంటుంది, ఇది స్పాన్‌జియోసాను మందంగా తయారు చేయడంతోపాటు, ఫైబ్రోసాలో కొల్లాజెన్ కట్టలను వేరు చేస్తుంది. ఒక గ్లైకోసామినోగ్లైకాన్ అయిన డెర్మటాన్ సల్ఫేట్ అధికంగా చేరడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రెక్కలను మరియు పక్కన ఉన్న కణజాలాన్ని ఈ పరిస్థితి బలహీనపరుస్తుంది, తత్ఫలితంగా రెక్క విస్తీర్ణం పెరుగుతుంది మరియు చోర్డీ టెండినీ సాగుతుంది. చోర్డే టెండినీ సాగడం తరచుగా చిట్లడానికి దారితీస్తుంది, సాధారణ పరిస్థితుల్లో చోర్డీ వెనుక రెక్కకు జతగా ఉంటుంది. వృద్ధి చెందిన గాయాలు-సాధారణంగా వెనుకవైపు రెక్కకు సంబంధించిన గాయాలు-రెక్క ముడుచుకుపోవడానికి, తిరగబడటానికి మరియు ఎడమ కర్ణికవైపు భ్రంశానికి కారణమవతాయి.[4]

ఉప రకాలు[మార్చు]

భ్రంశం చెందిన ద్విపత్ర కవాటాలను అనేక ఉప రకాలుగా విభజించవచ్చు, రెక్క యొక్క మందం ఆధారంగా, పుటాకార ప్రదేశం, మరియు ద్విపత్ర వృత్తాకార నిర్మాణంతో సంబంధం ఆధారంగా వీటిని వర్గీకరించవచ్చు. ఉప రకాలను ప్రామాణిక, ప్రామాణికేతర, సౌష్ఠవ మరియు అసౌష్ఠవ, అసంకల్పిత లేదా అసంకల్పితేతర రకాలుగా వర్ణించవచ్చు.[4]

దిగువ ఇచ్చిన అన్ని ప్రమాణాలను యుక్త వయస్సులో ఉన్న రోగులకు సంబంధించినవి; వీటిని బాలలకు వర్తింపజేయడం తప్పుడు అంచనాలకు దారితీస్తుంది.

ప్రామాణిక - ప్రామాణికేతర రకాల మధ్య తేడాలు[మార్చు]

మిట్రాల్ వృత్తాకార భాగం ఎగువ ప్రదేశాలపై ద్విపత్ర కవాట రెక్కలు 2 మి.మీ కంటే ఎక్కువ స్థానమార్పు చెందినప్పుడు భ్రంశం జరుగుతుంది. ఈ పరిస్థితిని తరువాత మిట్రాల్ కవాట రెక్కల మందం ఆధారంగా ప్రామాణిక మరియు ప్రామాణికేతర ఉపరకాలుగా విభజించవచ్చు: 5 మి.మీ వరకు ప్రామాణికేతర భ్రంశంగా గుర్తిస్తారు, 5 మి.మీ కంటే ఎక్కువ స్థానభ్రంశాన్ని ప్రామాణిక MVPగా పరిగణిస్తారు.[4]

సౌష్ఠవ మరియు అసౌష్ఠవ రకాల మధ్య తేడాలు[మార్చు]

ప్రామాణిక భ్రంశాన్ని సౌష్ఠవ మరియు అసౌష్ఠవ భ్రంశాలుగా ఉప విభజన చేయవచ్చు, మిట్రాల్ వృత్తాకార ప్రదేశాన్ని కలిసే రెక్కల అంచుల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు. రెక్క అంచులు యాన్యులస్ (వృత్తాకార నిర్మాణం) పై సాధారణ ప్రదేశాన్ని తాకుతున్నట్లయితే దానిని సౌష్ఠవ రకంగా గుర్తిస్తారు. ఒక రెక్క మరొదానితో పోల్చినప్పుడు కర్ణికవైపు స్థానభ్రంశం చెందినట్లయితే దానిని అసౌష్ఠవ రకంగా పరిగణిస్తారు. అసౌష్ఠవ రకపు భ్రంశం ఉన్న రోగుల్లో మిట్రాల్ కవాటం ఇంకా స్థానభ్రంశం చెందే అవకాశం ఉంటుంది, చోర్డీ టెండినీ పగలడం మరియు ఒక అసంకల్పిత రెక్క అభివృద్ధి కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.[4]

అసంకల్పిత - అసంకల్పితేతర రకాలు[మార్చు]

అసౌష్ఠవ భ్రంశాన్ని అసంకల్పిత మరియు అసంకల్పితేతర రకాలుగా ఉప విభజన చేస్తారు. రెక్క అంచు బయటివైపుకు మరలినప్పుడు అసంకల్పిత భ్రంశం సంభవిస్తుంది, ఎడమ కర్ణికవైపు పుటాకారంలోకి మారుతుంది, తద్వారా మిట్రాల్ కవాటం చెడిపోవడానికి కారణమవుతుంది. అంచు తిరగబడటం నుంచి చాపకర్ణం పగలడం వరకు అసంకల్పిత రెక్క భ్రంశం యొక్క తీవ్రత ఉంటుంది. రెక్క విడిపోవడం మరియు చోర్డీ టెండినీ రెక్క అనియంత్రిత కదలికలకు దోహదపడుతుంది (అందువలన "అసంకల్పితంగా రెక్క కొట్టుకుంటూ ఉంటుంది"). అందువలన అసంకల్పితంగా రెక్కలు కొట్టుకుంటున్న రోగుల్లో మిట్రాల్ కవాటం నుంచి రక్తం వెనక్కు పంపబడటం జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది, అసంకల్పితేతర ఉపవిభాగంలో ఇందుకు తక్కువ అవకాశం ఉంటుంది.[4]

రోగ నిర్ధారణ[మార్చు]

మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ యొక్క ట్రాసెసోఫాజియల్ ఎకోకార్డియోగ్రామ్.

మిట్రాల్ కవాట భ్రంశాన్ని నిర్ధారించేందుకు అత్యంత ఉపయోగకరమైన పద్ధతిగా ఎకోకార్డియోగ్రఫీ గుర్తించబడుతుంది. మిట్రాల్ యాన్యులస్‌కు సంబంధించిన మిట్రాల్ కవాట రెక్కలను చూసేందుకు వీలు కల్పించడంలో రెండు-మరియు మూడు-కోణాల్లో నిర్వహించే ఎకోకార్డియోగ్రఫీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రెక్కల మందాన్ని మరియు యాన్యులస్‌కు సంబంధించి వాటి భ్రంశాన్ని కొలిచేందుకు ఇది వీలు కల్పిస్తుంది. మిట్రాల్ రెక్కల మందం >5 మి.మీ మరియు రెక్కల భ్రంశం >2 మి.మీ ఉంటే దానిని ప్రామాణిక ద్విపత్ర కవాట భ్రంశంగా గుర్తిస్తారు.[4]

సాంక్రమిక రోగ విజ్ఞానం[మార్చు]

ద్విపత్ర కవాట భ్రంశాన్ని నిర్ధారించేందుకు స్పష్టమైన ప్రమాణాలు అందుబాటులోకి రాకముందు, సాధారణ జనాభాలో ద్విపత్ర కవాట భ్రంశం యొక్క సంభవనీయతలో బాగా మారుతుండేది.[4] కొన్ని అధ్యయనాలు ద్విపత్ర కవాట భ్రంశం సంభవనీయతను 5 నుంచి 15 శాతం వరకు మరియు ఇంకా ఎక్కువ స్థాయిని సూచించాయి.[5] మరో అధ్యయనం ఆరోగ్యవంతులైన యుక్త వయస్కుల్లో MVP సంభవనీయతను 38%గా అంచనా వేసింది.[6]

ద్విపత్ర కవాట అంతర్నిర్మాణంపై ఇటీవల వెలుగుచూసిన వివరాలు, త్రికోణీయ ఎకోకార్డియోగ్రఫీ అభివృద్ధి చెందడం వలన రోగనిర్ధారణ ప్రమాణాలు మెరుగుపడ్డాయి, ఈ ప్రమాణాలు ఆధారంగా MVP యొక్క వాస్తవ సంభవనీయత 2-3% మాత్రమే ఉంటుందని అంచనా వేశారు.[1] ఉదాహరణకు ఫ్రామింగామ్ హృదయ అధ్యయనంలో భాగంగా ద్విపత్ర కవాట భ్రంశం యొక్క సంభవనీయతను ఫ్రామింగామ్ ఎంఏలో 2.4%గా అంచనా వేశారు. ఎటువంటి గణనీయమైన వయస్సు మరియు లింగ భేదం లేకుండా ప్రామాణిక మరియు ప్రామాణికేతర MVP మధ్య దాదాపుగా సమానమైన విభజన ఉంటుంది.[7] అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 7% శవపరీక్షల్లో MVPని గుర్తించారు.[8]

ప్రమాద కారకాలు[మార్చు]

ఎలెర్స్-డాన్లోస్ సిండ్రోమ్, మార్ఫాన్ సిండ్రోమ్ [9] లేదా పాలిసైస్టిక్ మూత్రపిండ వ్యాధితో బాధపడే రోగులకు MVP ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.[10] మిగిలిన నష్ట కారకాల్లో గ్రేవ్స్ వ్యాధి కూడా ఉంది.[11] ఫెక్టస్ ఎక్స్‌కావాటమ్ వంటి ఛాతీ గోడ వైకల్యం కూడా దీనికి కారణమవుతుంది [12]

సంకేతాలు మరియు లక్షణాలు[మార్చు]

MVPతో బాధపడుతున్న కొందరు రోగుల్లో గుండె దడ, కర్ణిక దడ లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి, సాధారణ జనాభాలో కూడా కనిపించే ఈ లక్షణాల సంభవనీయతలో గణనీయమైన వ్యత్యాసం ఏమీ ఉండదు. 11 - 15% మధ్య రోగులు పాక్షిక ఛాతీ నొప్పి మరియు కొద్దిస్థాయిలో శ్వాసతీసుకోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అయితే ఈ లక్షణాలకు ప్రత్యక్షంగా దిపత్ర కవాట భ్రంశం కారణం కాదు, అయితే మిట్రాల్ కవాటం నుంచి రక్తం నెట్టివేయబయటం వలన ఈ పరిస్థితి ఏర్పడతుంది, ఈ పరిస్థితి తరచుగా భ్రంశం వలన సంభవిస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గాబరా మరియు భయానక దాడి లోపాలకు మిట్రాల్ కవాట భ్రంశంతో సంబంధం ఉందని సూచించింది.[ఉల్లేఖన అవసరం] ద్విధ్రువ లోపం మరియు మిట్రాల్ కవాట భ్రంశం మధ్య ఒక సహసంబంధాన్ని గుర్తించారు.[13]

గుర్తుతెలియని కారణాలతో, MVP రోగులు తక్కువ శరీర ద్రవ్యరాశి సూచి (BMI) కలిగివుంటున్నారు, MVP లేని వ్యక్తుల కంటే వీరు సన్నగా ఉంటారు.[4][7]

అపక్రమ శబ్దం[మార్చు]

ద్విపత్ర కవాట భ్రంశం ఉన్న ఒక వ్యక్తి గుండె శబ్దాన్ని విన్నప్పుడు ఒక మధ్య-రక్తపీడన శబ్దం, తరువాత ఒక ఆలస్యమైన రక్తపీడన అపక్రమ శబ్దం వినిపిస్తుంది.

మిగిలిన హృదయ అపక్రమ శబ్దాలకు భిన్నంగా, ద్విపత్ర కవాట భ్రంశం యొక్క గొణుగుడును నిలబడటం మరియు వాల్సాల్వా మన్యూవర్ (ముందుగానే సిస్టోలిక్ శబ్దం మరియు దీర్ఘమైన గొణుగుడు) ద్వారా స్పష్టంగా వినవచ్చు, వ్యాయామం చేయడం ద్వారా ఇది పూర్తిగా మారిపోతుంది (తరువాతి సిస్టోలిక్ శబ్దం మరియు తక్కువ గొణుగుడు). ఈ క్రమాన్ని పాటించే మరో ఇతర హృదయ గొణుగుడు హైపర్‌ట్రోఫిక్ కార్డియోమైయోపతీ, దీనికి కూడా ఈ అపక్రమ శబ్దం వినిపిస్తుంది. MVP అపక్రమ శబ్దాన్ని హైపర్‌ట్రోఫిక్ కార్డియోమైయోపతీ శబ్దం నుంచి వేరు చేయవచ్చు, 1) మధ్య-సిస్టోలిక్ క్లక్ ఉండటం, ఇది MVPలో మాత్రమే కనిపిస్తుంది మరియు 2) చేతితో పట్టుకొని చూసే రక్తపోటుతో MVP అపక్రమ శబ్దాన్ని పెంచుతుంది[ఉల్లేఖన అవసరం] మరియు హైపర్‌ట్రోఫిక్ కార్డియోమైయోపతీ యొక్క అపక్రమ శబ్దం ఇలా చేస్తే తగ్గుతుంది. చేతితో పట్టుకునే ఉపాయం అపక్రమ శబ్దం వచ్చే నిడివిని కూడా తగ్గిస్తుంది, మధ్య-సిస్టోలిక్ క్లిక్‌ను జాప్యం చేస్తుంది.[14]

వాల్సాల్వా ఉపాయం మరియు గుండెకు వెళ్లే సిరనాడి ఎడమ జఠరికలో డయాస్టోలిక్‌తో రక్తం నింపడాన్ని (ప్రీలోడ్) తగ్గిస్తుంది, దీని వలన చోర్డీ టెండినీపై మరింత భారం పడుతుంది. సిస్టోల్ సమయంలో ద్విపత్ర కవాటం సాగేందుకు ఇది వీలు కల్పిస్తుంది, తద్వారా ముందుగానే సిస్టోలిక్ క్లిక్ (అంటే S1కు సమీపంలో) మరియు దీర్ఘమైన శబ్దం ఏర్పడుతుంది. చేతి పట్టు ఉపాయం మొత్తం పరిధీయ నిరోధకత (తరువాతి భారం) ను పెంచుతుంది, అందవలన ద్విపత్ర కవాటంలో వెనుక పీడనాన్ని పెంచుతుంది, తద్వారా సిస్టోలిక్ క్లక్ యొక్క సమయంలో ఎటువంటి మార్పు లేకుండా మరింత తీవ్రమైన అపక్రమ శబ్దం ఏర్పడుతుంది.

ద్విపత్ర కవాట భ్రంశం యొక్క లక్షణాలు[మార్చు]

చారిత్రాత్మకంగా, మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ సిండ్రోమ్ అనే పదాన్ని MVP సంబంధ దడలు, ఛాతీ నొప్పి, పనిచేసినప్పుడు ఆయాసం, తక్కువ శరీర ద్రవ్యరాశి సూచీ తదితర సమస్యలకు సూచిస్తున్నారు, ఆరాటం, మూర్ఛ, తక్కువ రక్తపోటు మరియు ఇతర లక్షణాల వంటి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అసాధారణతలు స్వతంత్ర నాడీ వ్యవస్థ సరిగా పని చేయకపోవడం వలన సంభవిస్తాయని సూచిస్తున్నారు.[1] అయితే ఆధునిక అధ్యయనాలు MVP ఉన్న రోగుల్లో ఈ లక్షణాలు సంభవిస్తాయనేందుకు సరైన ఆధారాలు చూపించలేకపోయాయి.[1]

అప్పుడప్పుడు, సూప్రావెంట్రిక్యులర్ ఆర్‌హైథ్‌మియాస్‌ను MVP రోగుల్లో గుర్తిస్తారు, ఇది పరానుభూత శబ్దాన్ని పెంచుతుంది.[15]

సమస్యలు[మార్చు]

ద్వపత్ర కవాటంలో రక్తం వెనుక్కు నెట్టివేయబడటం (మిట్రాల్ రెగర్జిటేషన్)[మార్చు]

ఇక్కడ చూపించిన విధంగా ద్విపత్ర కవాట భ్రంశం మిట్రాల్ రెగర్జిటేషన్‌కు కారణం కావొచ్చు, ఈ సమస్య ఏర్పడినట్లయితే ఎడమ జఠరిక నుంచి ఎడమ కర్ణిక వ్యతిరేక దిశలో రక్త ప్రసరణ జరుగుతుంది.

ద్విపత్ర కవాట భ్రంశం వలన తరచుగా పాక్షిక మిట్రాల్ రెగర్జిటేషన్ సంభవిస్తుంది, [16] ఈ పరిస్థితిలో సిస్టోల్ సమయంలో అసాధారణంగా ఎడమ జఠరిక నుంచి ఎడమ కర్ణికకు రక్త ప్రసరణ జరుగుతుంది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో MVP తీవ్రమైన, నాన్-ఐషెమిక్ మిట్రాల్ రెగర్జిటేషన్‌కు అత్యంత సాధారణ కారణంగా ఉంది.[1] ద్విపత్ర కవాటానికి మద్దతు ఇచ్చే చోర్డీ టెండినీ పగలడం వలన ఇది అప్పుడప్పుడు జరుగుతుంది. [14]

హఠాన్మరణం[మార్చు]

MVP ఉపద్రవాలైన మిట్రాల్ రెగర్జిటేషన్ మరియు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం) అరిథ్మియా మరియు ధమని దడలకు దారితీసే అవకాశం ఉంది, ఈ ఉపద్రవాలు చివరకు హఠాన్మరణానికి కారణం కావొచ్చు. అయితే, స్థానభ్రంశం చెందిన కవాటం ఇటువంటి అరిథ్మియాలకు కారణమవుతుందనేందుకు ఎటువంటి ఆధారం లేదు.[17]

రోగ నిరూపణ[మార్చు]

సాధారణంగా MVP ఒక నిరపాయమైన ఆరోగ్య సమస్య. అయితే కేవలం విడిగా వచ్చే క్లిక్ మాత్రమే కాకుండా, అపక్రమ శబ్దాలు ఉన్న MVP రోగుల్లో సాధారణ మరణాల రేటు 15-20% పెరుగుతుంది.[8] మరణానికి ప్రధాన సూచికలు మిట్రాల్ రెగర్జిటేషన్ యొక్క తీవ్రత మరియు ఎజెక్షన్ ఫ్రాక్షన్.[18]

చికిత్స[మార్చు]

పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామం మరియు మద్దతు ఇచ్చే పర్యావరణం వలన ఎక్కువ మంది రోగులు లబ్ధి పొందుతారు.[19] ద్విపత్ర కవాట భ్రంశం మరిుయ డైఆటోనోమియా (దడలు, ఛాతీ నొప్పి) ఉన్న రోగులు బేటా-బ్లాకర్స్ (ఉదాహరణకు ప్రోప్రానోలోల్) నుంచి తరచుగా లబ్ధి పొందుతారు. ముందుగా గుండె పోటు ఉన్న రోగులు మరియు/లేదా ధమని గడ ఉన్న వారికి ఆస్పిరిన్ లేదా వార్ఫరిన్ వంటి రక్తాన్ని చిక్కబరిచే సాధనాలు అవసరమవతాయి, అయితే బేటా బ్లాకర్‌లు సాధారణంగా సూచిస్తున్నప్పటికీ, వాటి నుంచి పరిమితి స్థాయిలోనే లబ్ధి చేకూరుతుంది.[20] చికిత్సను పొందాల్సిన అవసరం లేని అనేక మంది వ్యక్తులు MVPSతో లబ్ధి పొందుతారు, ఔషధాలేవీ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా, ద్రవ మరియు సోడియం తీసుకోవడం పెంచడం, అనేక ఔషధాల్లో కనిపించే ఆడ్రెనాలిన్-వంటి పదార్థాలకు దూరంగా ఉండటం, కెఫిన్‌కు దూరంగా ఉండటం మరియు క్రమబద్ధమైన హృదయ కండర వ్యాయామం చేయడం ద్వారా వీరు కోలుకోవచ్చు.[21]

తీవ్రమైన రెగర్జిటేషన్‌తో ద్విపత్ర కవాట భ్రంశం ఉన్నవారికి సంబంధిత కవాటానికి మరమత్తు చేయడం లేదా ద్విపత్ర కవాటం స్థానంలో శస్త్రచికిత్స ద్వారా ప్రత్యామ్నాయ కవాటాన్ని ఏర్పాటు చేస్తారు. ద్విపత్ర కవాటానికి మరమత్తు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, ప్రత్యామ్నాయాన్ని అమర్చడానికి తక్కువగా మొగ్గు చూపుతారు, ఈ ప్రక్రియలో నిపుణత ఉన్న వైద్యులే ఈ శస్త్రచికిత్స చేస్తారు. ప్రస్తుత ACC/AHA మార్గదర్శకాలు ద్విపత్ర కవాటం యొక్క మరమత్తును శస్త్రచికిత్సా నైపుణ్యం ఉన్న కేంద్రాల్లో నిర్వహించాలని సూచిస్తున్నాయి, గుండె విఫలమయ్యే లక్షణాలు లేని రోగుల్లో కూడా దీనిని పరిగణలోకి తీసుకోవాలి. ఎడమ జఠరిక పనితీరు తగ్గడం లేదా ఎడమ జఠరిక నెమ్మదిగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించే రోగులను వెంటనే వైద్య పర్యవేక్షణలోకి తీసుకోవాలి.

మెగ్నిషియం అందే ఔషధాలతో చేసే చికిత్స ద్వారా కూడా MVP యొక్క లక్షణాలను తగ్గించవచ్చు.[22]

ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ నిరోధం[మార్చు]

MVPతో బాధపడుతున్న వ్యక్తుల గుండెపై బ్యాక్టీరియా ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దీనిని ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‌గా పిలుస్తారు. సాధారణ జనాభాలో ఈ నష్టభయం సమారుగా మూడు నుంచి ఎనిమిది రెట్లు ఉంటుంది.[1] 2007 వరకు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ దంత శస్త్రచికిత్సలో ఉపయోగించే పద్ధతులతోపాటు, ఇన్వాసివ్ ప్రక్రియను ఉపయోగించడానికి ముందు చికిత్స కోసం క్రిమినాశక పదార్థాలు సూచించేది. ఆ తరువాత, దంత వైద్యానికి ఉపయోగించే ప్రోఫిలాక్సిస్ ప్రక్రియను ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్ సంభవించేందుకు బాగా ఎక్కువ అవకాశం ఉన్న హృదయ పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని తీర్మానించింది.[23]

చరిత్ర[మార్చు]

మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ అనే పదాన్ని జే. మైకెల్ క్రిలే 1966లో పరిచయం చేశారు, జాన్ బ్రెరెటన్ బార్లో సూచించిన విధంగా ద్విపత్ర కవాటం యొక్క సమస్యలను సూచించేందుకు ఈ పదం మిగిలినవారి ఆమోదాన్ని కూడా పొందింది.[24]

అనేక సంవత్సరాలపాటు, ద్విపత్ర కవాట భ్రంశానికి సంబంధించి పెద్దగా సమాచారమేమీ తెలియలేదు, చూసేందుకు ఒకదానితో ఒకటి సంబంధంలేని సంకేతాలు మరియు లక్షణాలను గుర్తించేందుకు చాలాకాలం పట్టింది, అవి సిస్టోలిక్ అపక్రమ శబ్దాలు, భరించలేని భయానక పోట్లు మరియు పాలిథెలియా (అదనపు నిపుల్‌లు). ఇటీవలి అధ్యయనాలు ఈ లక్షణాలకు MVPతో సంబంధం లేదని సూచించాయి, ఎందుకంటే ఆ సమయంలో ఈ సమస్యకు మితిమీరిన నిర్ధారణలు చేయడం జరిగిందని తెలియజేశారు. ఎకోకార్డియోగ్రఫీతో MVP రోగనిర్ధారణకు ప్రమాణాలు నిరంతరం వృద్ధి చెందుతూ వచ్చాయి, దీనితో సరైన రోగ నిర్ధారణ సాధ్యపడింది, అందువలన MVPతో సంబంధం లేని అనేక అంశాలను వ్యాధి మరియు దాని యొక్క సంభవనీయత అధ్యయనాల్లో చేర్చారు. వాస్తవానికి, కొన్ని ఆధునిక అధ్యయనాలు ఎం-మోడ్ ఎకోకార్డియోగ్రఫీ వంటి పాత రోగ నిర్ధారణ పద్ధతులను ఇప్పుడు ఉపయోగించినట్లయితే జనాభాలో 55% మందిని MVPతో గుర్తించవచ్చని సూచించాయి.

మరింత ఆధారపడదగిన టు మరియు త్రీ-డైమెన్షనల్ ఎకోకార్డియోగ్రఫీని ఉపయోగించి MVP యొక్క రోగ నిర్ధారణ కోసం ఒక వాస్తవిక ప్రమాణంగా ఇటీవలి సంవత్సరాల్లో నూతన ప్రమాణాలు ప్రతిపాదించారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సమస్యను అనేక ఉపవిభాగాలుగా విభజించారు.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 Hayek E, Gring CN, Griffin BP (2005). "Mitral valve prolapse". Lancet. 365 (9458): 507–18. doi:10.1016/S0140-6736(05)17869-6. PMID 15705461.CS1 maint: multiple names: authors list (link)
 2. Barlow JB, Bosman CK (1966). "Aneurysmal protrusion of the posterior leaflet of the mitral valve. An auscultatory-electrocardiographic syndrome". Am. Heart J. 71 (2): 166–78. doi:10.1016/0002-8703(66)90179-7. PMID 4159172. Unknown parameter |month= ignored (help)
 3. Criley JM, Lewis KB, Humphries JO, Ross RS (1966). "Prolapse of the mitral valve: clinical and cine-angiocardiographic findings". Br Heart J. 28 (4): 488–96. doi:10.1136/hrt.28.4.488. PMC 459076. PMID 5942469. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Playford, David; Weyman, Arthur (2001). "Mitral valve prolapse: time for a fresh look". Reviews in Cardiovascular Medicine. 2 (2): 73–81. PMID 12439384. మూలం నుండి 2014-09-03 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-01-25.
 5. Levy D, Savage D. (1987). "Prevalence and clinical features of mitral valve prolapse". Am Heart J. 113 (5): 1281–90. doi:10.1016/0002-8703(87)90956-2. PMID 3554946.
 6. Warth DC, King ME, Cohen JM, Tesoriero VL, Marcus E, Weyman AE (1985). "Prevalence of mitral valve prolapse in normal children". Journal of the American College of Cardiology. 5 (5): 1173–7. doi:10.1016/S0735-1097(85)80021-8. PMID 3989128. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 7. 7.0 7.1 Freed LA, Levy D, Levine RA, Larson MG, Evans JC, Fuller DL, Lehman B, Benjamin EJ. (1999). "Prevalence and clinical outcome of mitral-valve prolapse". N Engl J Med. 341 (1): 1–7. doi:10.1056/NEJM199907013410101. PMID 10387935.CS1 maint: multiple names: authors list (link)
 8. 8.0 8.1 మూస:EMedicine
 9. "Related Disorders: Mitral Valve Prolapse". మూలం నుండి 2007-02-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-07-11. Cite web requires |website= (help)
 10. Lumiaho, A; Ikäheimo, R; Miettinen, R; Niemitukia, L; Laitinen, T; Rantala, A; Lampainen, E; Laakso, M; Hartikainen, J (2001). "Mitral valve prolapse and mitral regurgitation are common in patients with polycystic kidney disease type 1". American journal of kidney diseases. 38 (6): 1208–16. doi:10.1053/ajkd.2001.29216. PMID 11728952.
 11. "Mount Sinai - Disease". మూలం నుండి 2008-12-22 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 12. "Pectus Excavatum". Cite web requires |website= (help)
 13. Giannini AJ, Price WA, Loiselle RH. (1984). "Prevalence of mitral valve prolapse in bipolar affective disorder". Am J Psychiatry. 141 (8): 991–2. PMID 6465378. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)
 14. 14.0 14.1 టాన్సెర్, పాల్ హెచ్. (రివ్యూడ్ మార్చి 2007). "మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్", ది మెర్క్ మాన్యువల్స్ ఆన్‌లైన్ మెడికల్ లైబ్రరీ , సేకరణ తేదీ 2011-01-08.
 15. Terechtchenko L, Doronina SA, Pochinok EM, Riftine A. (2003). "Autonomic tone in patients with supraventricular arrhythmia associated with mitral valve prolapse in young men". Pacing Clin Electrophysiol. 26 (1 Pt 2): 444–6. doi:10.1046/j.1460-9592.2003.00067.x. PMID 12687863.CS1 maint: multiple names: authors list (link)
 16. Kolibash AJ (1988). "Progression of mitral regurgitation in patients with mitral valve prolapse". Herz. 13 (5): 309–17. PMID 3053383.
 17. Fogoros, Richard N. "Mitral Valve Prolapse (MVP)". Heart Disease. About.com. మూలం నుండి 2008-07-19 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-07-11.
 18. Rodgers, Ellie (May 11, 2004). "Mitral Valve Regurgitation". Healthwise, on Yahoo. Retrieved 2007-07-11. Cite web requires |website= (help)[permanent dead link]
 19. [స్కోర్డో, కే. (2007)టేకింగ్ కంట్రోల్: లివింగ్ విత్ ది మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ సిండ్రోమ్.(3వ ఎడిషన్.)]http://www.wright.edu/nursing/practice/mvp/mvppage.htm Archived 2011-01-13 at the Wayback Machine. సిన్సినాటీ, ఓహెచ్: కార్డినల్ పబ్లిషింగ్.
 20. స్కోర్డో, కే. (2007). మెడికేషన్ యూజ్ అండ్ సింప్టమ్స్ ఇన్ ఇండివిడ్యువల్స్ విత్ మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ సిండ్రోమ్.క్లినికల్ నర్సింగ్ రీసెర్చ్, 16, 58-71.
 21. [స్కోర్డో, కే. (2007)టేకింగ్ కంట్రోల్: లివింగ్ విత్ ది మిట్రాల్ వాల్వ్ ప్రొలాప్స్ సిండ్రోమ్.(3rd ed.)]http://www.wright.edu/nursing/practice/mvp/mvppage.htm Archived 2011-01-13 at the Wayback Machine. సిన్సినాటీ, ఓహెచ్: కార్డినల్ పబ్లిషింగ్.
 22. Lichodziejewska, B; Kłoś, J; Rezler, J; Grudzka, K; Dłuzniewska, M; Budaj, A; Ceremuzyński, L (1997). "Clinical symptoms of mitral valve prolapse are related to hypomagnesemia and attenuated by magnesium supplementation". The American journal of cardiology. 79 (6): 768–72. doi:10.1016/S0002-9149(96)00865-X. PMID 9070556.
 23. Wilson W, Taubert KA, Gewitz M; et al. (2007). "Prevention of infective endocarditis: guidelines from the American Heart Association" (PDF). Journal of the American Dental Association (1939). 138 (6): 739–45, 747–60. PMID 17545263. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
 24. Barlow JB, Bosman CK. (1966). "Aneurysmal protrusion of the posterior leaflet of the mitral valve. An auscultatory-electrocardiographic syndrome". Am Heart J. 71 (2): 166–78. doi:10.1016/0002-8703(66)90179-7. PMID 4159172.

బాహ్య లింకులు[మార్చు]