ద్విభాష్యం రాజేశ్వరరావు
| ద్విభాష్యం రాజేశ్వరరావు | |
|---|---|
ద్విభాష్యం రాజేశ్వరరావు | |
| జననం | ద్విభాష్యం రాజేశ్వరరావు 1945 యలమంచిలి |
| నివాస ప్రాంతం | విశాఖపట్నం |
| సంస్థ | కోరమాండల్ ఫర్టిలైజర్స్ |
| ప్రసిద్ధి | తెలుగు కథా రచయిత, నవలా రచయిత |
| పదవి పేరు | డిప్యుటీ మేనేజర్ |
ద్విభాష్యం రాజేశ్వరరావు కథా, నవలా రచయిత.[1]
జననం
[మార్చు]ఇతడు విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో 1945లో జన్మించాడు.
విద్యాభ్యాసం
[మార్చు]ఇతడు హైస్కూలు చదువు వరకు యలమంచిలిలోను, ప్రి యూనివర్సిటి అనకాపల్లిలోను చదివాడు. విశాఖపట్నంలో మెకానికల్ ఇంజనీరింగులో డిప్లొమా చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో బి.ఎ. పట్టా పొందాడు. ఎన్విరాల్‌మెంటల్ స్టడీస్‌లో పి.జి.డిప్లొమా చదివాడు.
ఉద్యోగం
[మార్చు]ఇతడు మొదట హైదరాబాద్ లోని ఆల్విన్ మెటల్ వర్క్స్‌లో అప్రెంటీస్‌గా చేరాడు. తర్వాత నాగార్జునసాగర్ కెనాల్స్‌లో ఓవర్‌సీర్‌గా పనిచేశాడు. కొంతకాలం విజయవాడలో ఆంధ్రప్రభ విలేఖరిగా ఉన్నాడు. 1967లో కోరమాండల్ ఫర్టిలైజర్స్‌లో ట్రైనీగా చేరి అదే సంస్థలో 2003లో డెప్యుటీ మేనేజర్‌గా పదవీ విరమణ చేశాడు.
రచనలు
[మార్చు]ఇతడు 400కు పైగా కథలు, 14 నవలలు, కొన్ని నాటికలు, నాటకాలు రచించాడు. ఆకాశవాణి ద్వారా 125కు పైగా ప్రసంగాలు, రూపకాలు, నాటికలు, నాటకాలు, కథలు ప్రసారం చేశాడు. ఇతని రచనలు బాల, కథాంజలి, రూపవాణి, చిత్రగుప్త, జాగృతి, ప్రజామత, ఆంధ్రజనత, కృష్ణాపత్రిక, కానుక, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, పల్లకి, స్వాతి, విజయ, చిత్ర, నవ్య, నీలిమ విజేత,ప్రభవ, ఆనంద జ్యోతి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు కన్నడ, తమిళ, మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషలలోకి అనువదించబడ్డాయి.
రచనల జాబితా
[మార్చు]నవలలు
[మార్చు]- ఏవెలుగులకీ ప్రస్ధానం
- జీవనయాత్ర
- గతి తప్పిన కోరిక
- రష్యాలో రెండో కృష్ణుడు
- దేవుడే రక్షించాలి
- బ్లాక్ మెయిల్
- దిక్చక్రంలో గులాబీ తోట
- రావణకాష్టం
- కౌగిట్లో పెద్ద పులి
- పడగల నీడలు
కథాసంపుటలు
[మార్చు]- నీలిమంట
- శిథిల శిల్పం
- చిన్నారి రాయబారి
- మేడ్ ఫర్ ఈచ్ అదుర్స్
- బొమ్మా బొరుసా
- చెట్టంత మనిషి
- తెల్లవారిన రాత్రి
- మనోరథం
- పారిశ్రామిక భద్రత-పర్యావరణ బాధ్యత
కథలు
[మార్చు]ఇతడు వ్రాసిన కథలలో కొన్ని:[2] {{Div col|colwidth=15em|content=
- అంతరాలు
- అందరూ బతకాలి
- అద్దం
- అపస్వరాలు
- అప్రణిహితాం
- అమృతహస్తం
- అమ్మ
- అమ్మకానికో ఇల్లు
- అవసరానికో ఆప్తుడు
- అవినీతి కథ
- అసలు సమస్య
- ఆకాశపల్లకి
- ఆడచీమ
- ఆస్తి
- ఈ దేశంలో ఓ సగటుకథ
- ఉద్గ్రంథం
- ఉన్నత శిఖరం
- ఎన్నిక
- ఓ సగటు కథ
- కిటికీ
- కెటలిస్ట్
- క్షమయాదరిత్రీ
- గజం నిజం-పలాయనం మిధ్య
- గడువు
- గడ్డిపూలు...
- గాజుముక్కలు
- గిల్టీ
- గెలుపు
- చరమగీతం
- చిన్నతల్లి కాకా హోటేలు లేక హోటల్ మేనక
- చిలకగోరింక
- చివరకు మిగిలింది
- చెట్టంత మనిషి
- జ్వాల
- తాచెడ్డకోతి
- తీరని సమస్య
- తెలిసినవాళ్లు
- తెల్లవారిన రాత్రి
- తొందరపాటు
- దేవుడికోపం లేక విధినిర్ణయం అను ఒకేఒకసూదిమందుకథ
- దొంగ
- నాపేరేమిటి?
- నివురు-నిప్పు
- నిశాకన్య
- నీకు తెలియని నిజం
- నీలిమంట
- నోరియాక్షన్
- పగలు కురిసిన వెన్నెల
- పదిరూపాయలు
- పుట్టలోని చెదలు
- ప్రకృతి కిరణం
- ప్రాణిహితం
- ప్రారబ్ధం భోగతోనశ్యేత్
- బొమ్మ
- భిన్నత్వంలో ఏకత్వం
- భూతం
- మగ మహారాజులు
- మనసులోని మరోమనిషి
- మనసులోని ముల్లు
- మనోరథం
- మరణించిన...
- మహాపురుష లక్షణం
- మానవత వికసించాలి!
- యెలిమెంటు
- రైలువెళ్లిపోయింది
- లాభం
- వర్షం
- వాన కురిసిన రాత్రి
- వాళ్లకీఉన్నాయి కష్టాలు
- విద్యా వివాహనాశాయ?
- విధి
- వినేనాధుడు
- విన్నపాలు
- విముక్తి
- వీనస్
- వెర్రి గొర్రెలు
- వ్యథ
- శిల
- శ్రమయేవ జయతే
- సంస్కారం
- సత్యాసత్యాలమద్య
- సీతాపతి కథ
- సృష్టి నిజం
- స్థానభ్రంశం
- స్నేహంకన్నా తీయనిది
- హద్దుల్లేని అనుభవం
- మహాత్ముని సాక్షిగా
- చుండ్రు
- కామెడీ వర్క్ షాప్
- కంప్యూటర్ -కాత్యాయని
- ట్వంటీ ట్వంటీ కార్పొరేట్ హాస్పిటల్స్
- సిసలయిన సాహసం
- కోర్టు పక్షి
- సంతానం బుల్లి
- తాకట్టు కొంపలోనే తనువు చాలించారు ?
- ఈ దేశంలో ఒక సగటు కథ
- మానవత వికసించాయి
- చివరకు మిగిలింది
- అమ్మ
- నొప్పుల నూకాల్తల్లి
- రుబ్బురాయి-ఐశ్వర్యారాయి
- బ్రహ్మానందం లెవెల్లో...
- బతుకు తోపుడు బండి
- అన్ సేఫ్ సత్తిబాబు
- ఖాళీ మంచాలు
- మరక కూడా మంచిదే.
- మహాపురుష లక్షణం
- అమ్మకానికి ఓ ఇల్లు
- ప్రీ వెడ్డింగ్ షూట్
- వాట్సాప్ వైద్యం
- ముర్రా గేదె- మొండి బాకీ
# హెచ్ ఆర్ మొగుడు
- పిల్లుల తగవు పిట్ట తీర్చింది
- జీవికాపరీక్ష
- కొంప ముంచిన కొండ రాజు
- బరువొక్కింతయు పెరిగె...
- నాకీ భోగం ఎన్నాళ్ళో...
- పాశుపతాస్త్రం
- అన్నిటా చుక్కెదురే
- కుర్చీ
- తొందర పాటు
- పేపర్ పులి
- బతక నేర్చిన భారతీయుడు
- మద్దెల గారి మొగుడు
- '...ఇదం జగత్ 'అను పెటాకుల పత్రం కథ
- భార్యామణి! యూ ఆర్ రాంగ్!
- కుక్క పాట్లు
- పిడికిట్లో ప్రపంచం
- కనిష్ఠంలో గరిష్ఠం
- దోపిడీ.
నాటకాలు/నాటికలు
[మార్చు]- పులిస్వారి
- సావిత్రి సవాల్
- దీర్ఘాయుష్మాన్ భవ
- కలుపుమొక్కలు
- వట్టిమాటలు కట్టిపెట్టోయ్
పురస్కారాలు
[మార్చు]ఇతని కథలు వివిధ పత్రికలు నిర్వహించిన పోటీలలో 40 వరకు బహుమతులను గెలుచుకున్నాయి. ఇతడు వ్రాసిన కథ "నీలిమంట"కు 1969 దీపావళి కథలపోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇతని నవల "ఏ వెలుగులకీ ప్రస్థానం"కు యువ పత్రిక నిర్వహించిన చక్రపాణి నవలికల పోటీలో బహుమతి వచ్చింది. ఇంకా ఇతడు వ్రాసిన నాటకాలు, నాటికలు అనేక బహుమతులను గెలుచుకున్నాయి.
2015 నుండి 2024 వరకు స్వాతి సచిత్ర వారపత్రికలో ఎనిమిది సార్లు కామెడీ కథలకు ,ఐదుసార్లు సాహస కథలకు, ఒకసారి సరస కథకు మొత్తం 14 బహుమతులు (ఒక్కొక్కటి పదివేల రూపాయలు చొప్పున) గెలుచుకోవడం జరిగింది.
వీరు రచించిన 60 కి పైగా కథలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. హిందీలో 16 అనువాద కథలతో శ్రమయేవ జయతే పేరుతో కదా సంపుటి, 30 అనువాద కథలతో హాస్య కహానియా సంపుటి వెలువడ్డాయి.
వీరి కథల మీద నవలల మీద సమగ్ర సాహిత్యం మీద ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిగి, మూడు పరిశోధనాంతర సిద్ధాంత గ్రంథాలు వెలువడ్డాయి.
ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని:
- శ్రీ పానుగంటి లక్ష్మీనరసింహారావు పురస్కారం - కిన్నెర సంస్థ, హైదరాబాద్ వారిచే
- శ్రీ గురజాడ అవార్డు - వేదగిరి కమ్యూనికేషన్స్ , హైదరాబాద్ వారిచే
- శ్రీ రాయనిపాటి లక్ష్మీకాంతారావు ఉత్తమ కథాపురస్కారం
- శ్రీ గణపతిరాజు అచ్యుతరామరాజు స్మారక జీవన సాఫల్య పురస్కారం
- శ్రీ కూరెళ్ల సోమేశ్వరరావు సాహితీ పురస్కారం
- శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి సాహితీ పురస్కారం
- శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు సాహితీ పురస్కారం
- శ్రీ బలివాడ కాంతారావు సాహితీ పురస్కారం
- శ్రీమతి తటవర్తి భారతి సాహితీ పురస్కారం
- విశాఖపట్నం సాంస్కృతిక కళాకారుల సమాఖ్య అవార్డు
- దండెం రాజు ఫౌండేషన్ (బెంగుళూరు) వారిచే 'కథా భీష్మ' పురస్కారం
- రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ఉగాది పురస్కారం
- జిల్లా కలెక్టర్ వారిచే 'బెస్ట్ ఇండస్ట్రియల్ మేనేజర్' గా గణతంత్రదిన పురస్కారం
- 1989 కేంద్ర సాహిత్య అకాడమీ నుండి ట్రావెల్ గ్రాంట్ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ అడపా, రామకృష్ణ (1 May 2017). "రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావుతో సంభాషణ". సాహితీకిరణం మాసపత్రిక. 9 (3): 10–12.
- ↑ కాళీపట్నం, రామారావు. "కథానిలయంలో ద్విభాష్యం రాజేశ్వరరావు పేజీ". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 25 October 2017.