ద బిగ్ బాస్
| ద బిగ్ బాస్ | |||||
|---|---|---|---|---|---|
| దస్త్రం:TheBigBossposter.JPG హాంగ్ కాంగ్ చిత్ర పోస్టరు | |||||
| Traditional Chinese | 唐山大兄 | ||||
| Simplified Chinese | 唐山大兄 | ||||
| Literal meaning | Chinese Elder Brother | ||||
| |||||
| దర్శకత్వం | లో వెయ్ వు చియా-సియాంగ్ | ||||
| రచన | లో వెయ్ | ||||
| నిర్మాత | రేమండ్ చౌ | ||||
| తారాగణం | బ్రూస్ లీ మరియా యీ, జేమ్స్ టియెన్, హాన్ యింగ్ చే | ||||
| ఛాయాగ్రహణం | చెన్ చింగ్-చు | ||||
| కూర్పు | సుంగ్ మింగ్ | ||||
| సంగీతం | వాంగ్ ఫు-లింగ్ పీటర్ థామస్ (alternative score) | ||||
నిర్మాణ సంస్థ | గోల్డెన్ హార్వెస్ట్ | ||||
| పంపిణీదార్లు | గోల్డెన్ హార్వెస్ట్ | ||||
విడుదల తేదీ | 1971 అక్టోబరు 23 (హాంగ్ కాంగ్) | ||||
సినిమా నిడివి | 100 ని | ||||
| దేశం | హాంగ్ కాంగ్ | ||||
| భాషలు | కాంటోనీస్ మాండరిన్, థాయ్ | ||||
| బడ్జెట్ | US$100,000[1] | ||||
| బాక్సాఫీసు | US$50 million[2] | ||||
ద బిగ్ బాస్ 1971 లో విడుదలైన హాంగ్‌కాంగ్ మార్షల్ ఆర్ట్స్ చిత్రం. దీనికి లో వెయ్, వు చియాసియాంగ్ దర్శకత్వం వహించారు. 1960 తర్వాత బ్రూస్ లీ ప్రధాన పాత్రలో నటించిన ప్రముఖ చిత్రం ఇది. మరియా యీ, జేమ్స్ టియెన్, టోనీ లియూ, నోరా మియావో ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తొలుత టియెన్ ని ప్రధాన పాత్రకు అనుకోగా, లో వెయ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టగానే బ్రూస్ లీ కి ఈ పాత్ర దక్కింది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది.[3] బ్రూస్ లీ చూపిన బలమైన నటన అప్పటికే హాంగ్‌కాంగ్ లో స్టార్‌గా పేరు పొందిన టియెన్ ప్రతిభను మించిపోయింది. తర్వాత బ్రూస్ లీ పేరు ఆగ్నేయాసియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మిలియన్ డాలర్లు (ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే సుమారు 400 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. దీని బడ్జెట్ సుమారు లక్ష డాలర్లు మాత్రమే. 1972 లో బ్రూస్ లీ నటించిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ విడుదలయ్యే దాకా అత్యధిక వసూళ్ళు సాధించిన హాంగ్‌కాంగ్ చిత్రం ఇదే.
మూలాలు
[మార్చు]- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "Polly2018" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "Polly2019" అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Ewins, Michael (4 July 2012). "In Review: The Big Boss on JVJ". New Empress Magazine. Archived from the original on 8 December 2015.