ధనందుడు
ధనందుడు | |
---|---|
![]() Dhana Nanda's empire | |
Last Nanda Emperor | |
Reign | సుమారు 329 – 321BCE[citation needed] |
Predecessor | Kaivarta |
Successor | Empire abolished (Chandragupta Maurya as Mauryan emperor) |
Died | c. 321 BC |
Issue | Pabbata |
Dynasty | Nanda |
బౌద్ధ గ్రంథం మహాబోధివంశం ఆధారంగా ధననందుడు (క్రీ.పూ. 321 లో మరణించాడు) నందరాజవంశం చివరి పాలకుడు. ఆయన రాజవంశం స్థాపకుడు ఉగ్రసేనుడి ఎనిమిది మంది సోదరులలో చిన్నవాడు. ధననందుడి చేత అవమానించిన చాణక్యుడు అనే బ్రాహ్మణుడు ఆయనను పడగొడతామని శపథం చేసి నందరాజధాని పాటలీపుత్ర మీద దాడి చేసి చంపడానికి సైన్యాన్ని అభివృద్ధిచేసాడు. చాణుక్యుడు తన రాజకీయ శిష్యుడైన చంద్రగుప్త మౌర్యుడిని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేశాడు.
జైన సంప్రదాయం చివరి నందచక్రవర్తి గురించి ఇలాంటి పురాణకథనాన్ని వివరిస్తుంది. అయినప్పటికీ ఇది చక్రవర్తిని "నందా" అని ప్రభోధిస్తుంది. ఓడిపోయిన తరువాత చక్రవర్తి తన రాజధానిని క్రియాశీలకంగానూ, సురక్షితంగానూ ఉంచడానికి అనుమతించాడని పేర్కొంది. పురాణాలు కథనాలు వేరే వృత్తాంతాన్ని అందించాయి. చివరి నందచక్రవర్తి రాజవంశం స్థాపకుడి ఎనిమిది మంది కుమారులలో ఒకరు. నందవంశ స్థాపకుడిని వారు మహాపద్మ అని పిలుస్తారు. గ్రీకో-రోమను భారతదేశంలో అలెగ్జాండరు సమకాలీన పాలకుడిని అగ్రామసు ( క్జాండ్రేమ్సు) అని పిలుస్తారు. వీరిని ఆధునిక చరిత్రకారులు చివరి నందచక్రవర్తిగా గుర్తించారు. ఈ వృత్తాంతాల ఆధారంగా ఈ చక్రవర్తి శక్తివంతమైన సైన్యంతో యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు అలెగ్జాండరు సైనికులు తిరుగుబాటు చేశారు.
బుద్ధ సంప్రదాయంలో[మార్చు]
నంద రాజులు అందరూ సోదరులు మొత్తం 22 సంవత్సరాలు వరుసగా పాలించారు. ఈ రాజులలో మొదటివాడు ఉగ్రసేనుడు. చివరివాడు ధన నందుడు:[1][2]
- ఉగ్రా-సేన (పాలిలో ఉగ్గసేన)
- పందుక
- పందుగటి
- భూత-పాల
- రాష్ట్ర-పాల
- గోవిషణక
- దశ-సిద్ధక
- కైవరత
- ధనా
పుప్పపుర (పుష్పుపుర) లో భిక్ష ఇచ్చే కార్యక్రమంలో ధననందుడు బ్రాహ్మణుడైన చాణక్యుడిని అసహ్యంగా కనిపించినందుకు అవమానించాడని బౌద్ధ సంప్రదాయం చెబుతోంది. ఖైదుచేయమని ఆదేశించిన రాజును చాణక్యుడు శపించాడు. చాణక్యుడు తప్పించుకుని రాజు కుమారుడు పబ్బటతో స్నేహం చేశాడు. సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలని యువరాజును ప్రేరేపించాడు. యువరాజు ఇచ్చిన రాజముద్రిక సహాయంతో చాణక్యుడు నందరాజభవనం నుండి పారిపోయాడు. ధననందుడిని పడగొట్టాలని నిశ్చయించుకున్న ఆయన 1 నాణెంను 8 నాణేలుగా మార్చడానికి అనుమతించే రహస్య పద్ధతిని ఉపయోగించి సైన్యాన్ని పెంచడానికి సంపదను సంపాదించాడు.[3]
ధననందుని స్థానంలో చాణక్యుడు ఇద్దరు అభ్యర్థులను తగ్గించారు: పబ్బటా, మాజీ రాజకుటుంబానికి చెందిన చంద్రగుప్తుడు. వారిని పరీక్షించడానికి, ఆయన ఇద్దరికి ఉన్ని దారంతో చేసిన మెడలో ధరించే తాయెత్తు ఇచ్చాడు. ఒక రోజు చంద్రగుప్తుడు నిద్రిస్తున్నప్పుడు, చంద్రగుప్తుడి ఉన్ని దారాన్ని విడదీయకుండా, చంద్రగుప్తుడు మేల్కొనకుండా తొలగించమని పబ్బటాను కోరాడు. ఈ పనిని చేయడంలో పబ్బటా విఫలమైయ్యాడు. కొంతకాలం తరువాత పబ్బటా నిద్రపోతున్నప్పుడు అదే పనిని పూర్తి చేయమని చాణుక్యుడు చంద్రగుప్తుడితో సవాలు చేశాడు. చంద్రగుప్తుడు పబ్బట తల కత్తిరించి ఉన్ని దారాన్ని తిరిగి పొందాడు. తరువాతి ఏడు సంవత్సరాలలో చాణక్యుడు చంద్రగుప్తుడికి శిక్షణ ఇచ్చాడు. చంద్రగుప్తుడు పెద్దవాడైనప్పుడు చాణక్యుడు తన సంపదను ఉపయోగించి సైన్యాన్ని సమీకరించాడు.[4]
సైన్యం ధననంద రాజధాని మీద దాడి చేసింది. కాని నిర్ణయాత్మకంగా ఓడిపోయి రద్దు చేయబడింది. తదనంతరం చంద్రగుప్తుడు చాణుక్యుడు కొత్త సైన్యాన్ని అభివృద్ధిచేసి సరిహద్దు గ్రామాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. క్రమంగా వారు నందా రాజధాని పాటలీపుత్ర (పటాలిపుత్ర) కు చేరుకుని, ధననందుడిని చంపారు. చాణక్య ఒక మత్స్యకారుని ద్వారా ధననందుడి నిధిని కనుగొని చంద్రగుప్తుడిని కొత్త రాజుగా నియమించాడు.[5]
చివరి నందరాజు గురించిన ఇతర కథనాలు[మార్చు]
జైనసంప్రదాయం[మార్చు]
జైన సంప్రదాయంలో బౌద్ధ పురాణంతో అనేక సారూప్యతలు ఉన్న ఒక పురాణం ఉంది. కానీ "ధన నందుడు" అనే పేరును ప్రస్తావించలేదు: జైన గ్రంథాలు కేవలం చాణక్యుడు ప్రత్యర్థి రాజు "నందా" అని పేర్కొన్నాయి. జైన సంప్రదాయం ఆధారంగా చాణక్యుడు రాజు నుండి విరాళాలు కోరడానికి నందరాజధాని పాటలీపుత్రను సందర్శించాడు. కాని రాజు సేవకుడు ఆయనను అవమానించాడు. తరువాత ఆయన నందరాజవంశాన్ని పడగొట్టాలని శపథం చేశాడు.[6] ఆయన చంద్రగుప్తుడిని కనుగొని సలహా ఇచ్చాడు. ప్రారంభ పరాజయం తరువాత నంద దళాలను ఓడించడానికి సైన్యాన్ని అధికరించాడు. అయినప్పటికీ బౌద్ధ సంప్రదాయానికి భిన్నంగా, జై సంప్రదాయం ప్రకారం నందరాజు ఓడిపోయిన తరువాత తన రాజధానిని విడిచివెళ్ళడానికి అనుమతించబడ్డాడు. రాజు కుమార్తె చంద్రగుప్తుడితో ప్రేమలో పడి అతనిని వివాహం చేసుకుంది.[7] ఈ కుమార్తె పేరు తెలియలేదు. అయినప్పటికీ చంద్రగుప్తుని కుమారుడు బిందుసార తల్లికి దుర్ధర అని పేరు పెట్టారు.[8]
పురాణాలు[మార్చు]
బౌద్ధ సంప్రదాయం వలె, పురాణాలు కూడా 9 నందా రాజులు ఉన్నాయని చెబుతున్నాయి.[9] అయినప్పటికీ వారు ఈ రాజులలో మొదటివారికి మహాపద్ముడు అని పేరు పెట్టారు. తరువాతి 8 మంది రాజులు ఆయన కుమారులు అని పేర్కొన్నారు. పురాణాలు ఈ కుమారులలో ఒకరు మాత్రమే: సుకల్ప.[10] విష్ణు పురాణం మీద వ్యాఖ్యాత అయిన దుండిరాజా, చంద్రగుప్త మౌర్యుడు సర్వత-సిద్ధి అనే నంద రాజు మనవడు అని పేర్కొన్నాడు.[1] ఈ వాదన పురాణాలలోనే లేదు.[11]
గ్రీకో - రోమను కథనాలు[మార్చు]
గ్రీకు వృత్తాంతాలు భారతదేశంలో అలెగ్జాండరు సమకాలీన పాలకుడిని అగ్రాంసు (క్జాండ్రేమ్సు) అని పేర్కొన్నాయి. వీరిని ఆధునిక చరిత్రకారులు చివరి నందరాజుగా గుర్తించారు. "అగ్రాంసు" అనే సంస్కృత పదం "ఆగ్రసైన్య" గ్రీకు అనువాదం కావచ్చు (అక్షరాలా "ఉగ్రసేనుడి కుమారుడు లేదా వారసుడు", ఉగ్రసేన బౌద్ధ సంప్రదాయం ప్రకారం రాజవంశం స్థాపకుడి పేరు).[2][12] గ్రీకో-రోమను సాంప్రదాయం ఈ రాజవంశానికి ఇద్దరు రాజులు మాత్రమే ఉన్నారని సూచిస్తుంది: రోమను చరిత్రకారుడు కర్టియసు (సా.శ.1 వ శతాబ్దం ) అభిప్రాయం ఆధారంగా రాజవంశం స్థాపకుడు మంగలి జాతికి చెందిన రాజు; ఆయన కుమారుడిని చంద్రగుప్తుడు పడగొట్టాడు.[13]
గ్రీకు వృత్తాంతాలు అగ్రమేసును గంగారిడై (గంగా లోయ), ప్రసీ (బహుశా ప్రాచ్యసు అనే సంస్కృత పదం అనువాదం, వాచ్యంగా "తూర్పువాసులు") అని వివరిస్తాయి.[2] ఈ పాలకుడి శక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కొనే అవకాశాన్ని ఎదుర్కొన్నసమయంలో అలెగ్జాండరు సైనికులు తిరుగుబాటు చేసి, భారతదేశం నుండి వెనక్కి వెళ్ళమని బలవంతం చేశారు.[14]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Upinder Singh 2008, p. 273.
- ↑ 2.0 2.1 2.2 Irfan Habib & Vivekanand Jha 2004, p. 13.
- ↑ Thomas Trautmann 1971, p. 13.
- ↑ Thomas Trautmann 1971, p. 14.
- ↑ Thomas Trautmann 1971, p. 15.
- ↑ Thomas Trautmann 1971, p. 22.
- ↑ Thomas Trautmann 1971, p. 23.
- ↑ R. K. Mookerji 1966, p. 234.
- ↑ Upinder Singh 2008, p. 272.
- ↑ Dilip Kumar Ganguly 1984, p. 20.
- ↑ H. C. Raychaudhuri 1988, p. 140.
- ↑ H. C. Raychaudhuri 1988, p. 14.
- ↑ R. K. Mookerji 1966, p. 5.
- ↑ Ian Worthington 2014, pp. 251-253.
జీవితచరిత్రలు[మార్చు]
- Dilip Kumar Ganguly (1984). History and Historians in Ancient India. Abhinav Publications. ISBN 978-0-391-03250-7.
{{cite book}}
: Invalid|ref=harv
(help) - H. C. Raychaudhuri (1988) [1967]. "India in the Age of the Nandas". In K. A. Nilakanta Sastri (ed.). Age of the Nandas and Mauryas (Second ed.). Delhi: Motilal Banarsidass. ISBN 978-81-208-0466-1.
{{cite book}}
: Invalid|ref=harv
(help) - Ian Worthington (2014). By the Spear: Philip II, Alexander the Great, and the Rise and Fall of the Macedonian Empire. Oxford University Press. ISBN 978-0-19-992986-3.
{{cite book}}
: Invalid|ref=harv
(help) - Irfan Habib; Vivekanand Jha (2004). Mauryan India. A People's History of India. Aligarh Historians Society / Tulika Books. ISBN 978-81-85229-92-8.
{{cite book}}
: Invalid|ref=harv
(help) - R. K. Mookerji (1966). Chandragupta Maurya and His Times. Motilal Banarsidass. ISBN 978-81-208-0405-0.
{{cite book}}
: Invalid|ref=harv
(help) - Thomas Trautmann (1971). Kauṭilya and the Arthaśāstra: a statistical investigation of the authorship and evolution of the text. Brill.
- Upinder Singh (2008). A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century. Pearson Education India. ISBN 978-81-317-1677-9.
{{cite book}}
: Invalid|ref=harv
(help)
- December 2015 from Use dmy dates
- December 2015 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- Articles with short description
- Short description matches Wikidata
- All articles with unsourced statements
- Articles with unsourced statements from March 2018
- CS1 errors: invalid parameter value
- 4th-century BC Indian monarchs
- Nanda Empire
- 4వ శతాబ్ద భారతీయ చక్రవర్తులు