ధర్మపురి జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dharmapuri district
தருமபுரி(தர்மபுரி) மாவட்டம்
Tharumapuri district
District
Hogenakkal Waterfalls on the Kaveri river
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
Country India
రాష్ట్రంతమిళనాడు
ప్రధాన కార్యాలయంDharmapuri
BoroughsDharmapuri, Harur, Palakcode, Pappireddipatti, Pennagaram.
Government
 • CollectorThiru K. Vivekanandan , IAS
 • Superintendent of PoliceAsra Garg, IPS
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
636 705
టెలిఫోన్ కోడ్04342
ISO 3166 code[[ISO 3166-2:IN|]]
Vehicle registrationTN-29[1]
Largest cityDharmapuri
Largest metroDharmapuri
Central location:12°7′N 78°9′E / 12.117°N 78.150°E / 12.117; 78.150

దక్షిణభారతదేశం, తమిళనాడులోని జిల్లాలలో ధర్మపురి జిల్లా ఒకటి. 1965 అక్టోబరు 2న ధర్మపురి ప్రధాననగరంగా ధర్మపురి జిల్లా రూపుదిద్దుకుంది. చారిత్రకంగా ధర్మపురి " తకదూర్ " అని పిలువబడుతూ ఉండేది.

చరిత్ర

[మార్చు]

ప్రస్తుత ధర్మపురిని సంగకాలంలో అదిగమాన్ నెడుమారన్ అంజి పాలించాడని ప్రతీతి. అదిగమాన్‌కు ప్రఖ్యాత తమిళ కవయిత్రి అవ్వయారు అంటే హద్దులులేని గౌరవ మర్యాదలు ఉండేవి. 18వ శతాబ్దంలో ఈ భూభాగం పల్లవ సామ్రాజ్యంలో భాగంగా ఉండేదని భావించబడుతుంది.

9వ శతాబ్దంలో ఈ భూభాగాన్ని ఆక్రమించుకున్న రాష్ట్రకూటులు 2 శతాబ్ధాల కాలం దీని మీద ఆదిపత్యం వహించారని చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రకూటులు చోళసామ్రాజ్యం చేతిలో ఓటమి చవిచూసారు. ఫలితంగా ఈ భూభాగం చోళసామ్రాజ్యంలో భాగం అయింది.

ప్రస్తుత ధర్మపురి జిల్లా సేలం జిల్లాలో ఒక భాగంగా ఉండేది. 1965 అక్టోబరు 2 న ధర్మపురి జిల్లాగా అవతరించింది. ధర్మపురి జిల్లాకు మొదటి కలెక్టరుగా జి.తిరుమాల్ ఐ.ఎ.ఎస్ నియమించబడ్డాడు. 2004 ఫిబ్రవరి 9న ధర్మపురి తిరిగి ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలుగా విభజించబడింది..[2]

గణాంకాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19013,28,897—    
19113,44,203+0.46%
19213,28,877−0.45%
19313,83,902+1.56%
19414,43,969+1.46%
19514,99,582+1.19%
19616,15,809+2.11%
19717,96,404+2.61%
19819,40,175+1.67%
199111,23,583+1.80%
200112,95,182+1.43%
201115,06,843+1.53%
source:[3]

2011 భారత జనాభా గణాంకాలను అనుసరించి ధర్మపురి జిల్లా జనసంఖ్య 1,502,900,[4] ఇది సుమారుగా గార్బన్ దేశజనసంఖ్యకు సమానం [5] ఇది యు.ఎస్ రాష్ట్రం హవాయి జనసంఖ్యకు సమానం. .[6] 640 భారతదేశ రాష్ట్రాలలో ధర్మపురి జనసంఖ్యాపరంగా 334వ స్థానంలో ఉంది.[4] జిల్లాజనసాంధ్రత పరంగా ధర్మపురి దేశంలో 332వ స్థానంలో ఉంది. ఒక చదరపు కిలోమీటరుకు 860 మంది నివసిస్తున్నారు.[4] ధర్మపురి కుటుంబనియంత్రణ శాతం దేశీయంగా 16.04% [4] ధర్మపురి జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి 996:1000.[4], అక్షరాస్యతా శాతం 64.71%.[4]

భౌగోళికం

[మార్చు]

ధర్మపురి జిల్లా ఉత్తర 11 47’, 12 33’, రేఖాంశం తూర్పు 77 02’, 78 40’. వద్ద ఉంది. జిల్లా వైశాల్యం 4497.77 (తమిళనాడు వైశాల్యంలో. 3.46% ). అలాగే జనసంఖ్య 2,856,300 (2001 గణాంకాలు). జిల్లా ఉత్తర దిశలో క్రిష్ణగిరి, తూర్పున తిరువణ్ణామలై, విళుపురం జిల్లాలు, దక్షిణ దిశలో సేలం జిల్లా, పడమర దిశలో కర్నాటక రాష్ట్రానికి చెందిన చామరాజనగర్ జిల్లా ఉన్నాయి. జిల్లా మొత్తం కొండలు, వనాలతో నిండి ఉంది.

వాతావరణం

[మార్చు]

ధర్మపురి జిల్లా వాతావరణం సాధారణంగా వెచ్చగా ఉంటుంది. మార్చి, మే మాసాలలో వాతావరణం మరింత వేడిగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో ఉష్ణోగ్రత 38 సెంటీగ్రేడ్ డిగ్రీల వరకు ఉంటుంది. డిసెంబరు మాసంలో చల్లబడే వాతావరణం ఫిబ్రవరి మాసం వరకు కొనసాగుతుంది. శీతాకాల వాతావరణం 17 డిగ్రీల సెంటీగ్రేడును చేరుకుంటుంది. జిల్లాలో సుమారుగా 895.56 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది.

వ్యవసాయం, ఉద్యాన కృషి

[మార్చు]
పాపిరెట్టి వద్ద వరిపొలాలు

ధర్మపురి ఆర్థికంగా ప్రధానంగా ప్రకృతి మీద ఆదారపడి ఉంది. సుమారుగా 70% పనులు వ్యవసాయాన్ని ఆధారం చేసుకున్నవన్నది గమనార్హం. ఆర్థికంగా వెనుకబడి కరువుకాటకాలతో బాధపడుతున్న జిల్లాలలో ధర్మపురి జిల్లా ఒకటి. హార్టికల్చర్ వ్యవసాయం కూడా ధర్మపురిలో ప్రాధాన్యత వహిస్తున్నది. మామిడి పంట హార్టికల్చర్ పంటలలో ప్రధానమైనది. పండ్లపెంపకంలో మామిడిది మొదటి స్థానం. జిల్లాలో మూడింట ఒక వంతు భూమిలో మామిడి పండించబడుతుంది. రాష్ట్రంలో పండిస్తున్న మామిడి పంటలో సగభాగం ధర్మపురి జిల్లాలో పండించబడుతుంది. పాలక్కాడులో టమేటాలు విస్తారంగా పండించబడుతుంది. అలాగే పొన్నగరంలో మిరపకాయల పంట విస్తారంగా పండించబడుతుంది.

పంట పండిస్తున్న వైశాల్యం (హెక్టార్లలో) శాతం%
వడ్లు 9,465 5.60%
చిరుధాన్యం (రాగి) 18,243 10.80%
ఇతర చిరు ధాన్యాలు 69,162 40.90%
పప్పులు 40,441 23.90%
చెరుకు 11,971 07.10%
మామిడి 6,506 03.80%
కొబ్బరి 7,037 04.20%
చింతపండు 1,197 00.70%0
ఇతర పంటలు 5,067 03.00%
మొత్తం 1,69,089

మత్స్యపరిశ్రమ

[మార్చు]

ధర్మపురి భూ అంతర్గత జిల్లా. అందువలన జిల్లాలో చేపలవేటకు నిషిద్ధం. అయినప్పటికీ జిల్లాలో కట్ల, మిర్గల్, రోగు, క్రాప్ రక చేపలు లభ్యమౌతాయి.

మినరల్ వనరులు

[మార్చు]

ధర్మపురి జిల్లాలో గుర్తించతనంత గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. పొన్నగరంలో అత్యుత్తమ నాణ్యతకలిగిన నల్లని గ్రానైట్ పెన్నగరం, హారర్, పాలకోడ్ వద్ద లభ్యం ఔతుంది. పొన్నగరం లోని కందిగానపల్లి గ్రామం హారర్ తాలూకాలోని ఎ.వేలంపట్టి, పాపిరెడ్డి తాలూకాలోని పెదాంపట్టి లలో క్వార్త్జ్ తరహా గ్రానైట్ లభ్యం ఔతుంది. ఇతర అత్యున్నత స్థాయి ఖనిజం మలిబ్‌దొనం వద్ద లభ్యం ఔతుంది. హారర్‌లో లభ్యమౌతున్న ఖనిజం దీనిని " మంచి కండక్టర్"గా గుర్తించబడింది.

పాలన

[మార్చు]

ధర్మపురి కేంద్రంగా ఉంది. జిల్లా అవి ధర్మపురి, హారర్ 5 తాలూకాలు ఇద్దరు ఆదాయ విభాగాలు విభజింపబడింది.

పరిపాలనా విభాగాలు

[మార్చు]

ఆదాయ విభాగాలు: ధర్మపురి, హారర్.

  • రెవెన్యూ తాలూకాలు: ధర్మపురి, హారర్, పాలక్కాడు, పొన్నగరం, పాపిరెడ్డిపాలెం.
  • టౌన్ పంచాయతీలు: హారర్, మరందహళ్ళి, బొమ్మిడి, పాలక్కాడు, పొన్నగరం, కతిమంగలం, కంబైనల్లూరు, పాపిరెడ్డిపట్టి, ధర్మపురి, కడత్తూరు, పాపిరెడ్డిపట్టి.
  • పంచాయతీ సంఘాలు: ధర్మపురి, హారర్, నల్లంపల్లి, పాలక్కాడు, పెన్నగరం, కరియమంగలం, మొరప్పూర్, పాపిరెడ్డిపట్టి.

పర్యాటకం

[మార్చు]
వైయ్యారు ఆనకట్ట దృశ్యం

ధర్మపురిలో త్వరితగతిలో విస్తరిస్తున్న పరిశ్రమలలో పర్యాటకం ప్రధానమైనది. కావేరీ పరీవాహక ప్రాంతాలలో ధర్మపురి జిల్లా ఒకటి. కావేరీ జలాలు సుందరంగా జాలువారుతున్న ప్రదేశం హొగానక్కల్ ధర్మపురికి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రాష్ట్రంలో ప్రాముఖ్యత కలిగిన గిరి ఆలయాలలో ఒకటైన తీర్ధమలై ధర్మపురి జిల్లాలోనే ఉంది. హిందువులకు ఇది పవిత్ర ప్రదేశం. ఇది చోళ, విజయనగర చక్రవర్తుల కాలం నుండి ఉనికిలో ఉంది.[7] గంగా సామ్రాజ్యపు కాలంలో ధర్మపురిలో అదియమాన్‌కోట్టై నిర్మితమైంది. అదియమాన్ కోటలో మల్లికార్జునాలయం, అష్టదిక్పాలకులు, భైరవుడు, మొదలైనవి ఉన్నాయి.

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. www.tn.gov.in
  2. "History of Dharmapuri District". Dharmapuri District Official TN Website. Archived from the original on 17 ఫిబ్రవరి 2014. Retrieved 1 March 2014. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. Decadal Variation In Population Since 1901
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gabon 1,576,665 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301
  7. "Dharmapuri". tamilnadutourism.org. Archived from the original on 1 ఫిబ్రవరి 2013. Retrieved 1 March 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]