Jump to content

ధర్మరాజు తిరునాళ్ళు

వికీపీడియా నుండి

ధర్మరాజు తిరునాళ్ళు చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో పాండవులలో మొదటి వాడైన ధర్మరాజు పేరుతో ఉన్న ఆలయాల్లో ప్రతి సంవత్సరం జరిపే ఉత్సవాలు. ఈ ఉత్సవాలు వారం నుంచి 18 రోజుల దాకా జరుగుతాయి. ధ్వజారోహణం, మహాభారత పురాణ శ్రవణం, తపస్సుమాను, అగ్నిగుండ ప్రవేశం (నిప్పుల మీద నడక) లాంటివి ఇందులో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు.

ముఖ్యమైన ఆలయాలు

[మార్చు]

యామిగాని పల్లె

[మార్చు]

కుప్పం తాలూకా యామిగాని పల్లెలో ధర్మరాజు దేవాలయం పురాతన దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ ప్రతి సంవత్సరం ధర్మరాజుల తిరునాళ్ళు జరుగుతాయి.[1]

శ్రీకాళహస్తి ధర్మరాజుల గుడి

[మార్చు]

పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయం శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "ద్రౌపది ఆలయం – యామిగాని పల్లె (Draupadi Devalayam – Yamiganipalle)". TeluguOne Devotional. Retrieved 2025-01-27.
  2. Rangarajan, A. D. (2022-07-03). "Andhra Pradesh: Taking the Mahabharata to the unlettered". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2025-01-27.