హిందూధర్మశాస్త్రాలు
ఈ article లో మూలాలేమీ లేవు. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ధారావాహిక లోని భాగంగా |
![]() ![]() |
---|
![]() |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
![]() | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము |
హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతంతో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.
ప్రధాన విభాగాలు[మార్చు]
శ్రుతులు[మార్చు]
"శ్రుతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". చతుర్వేదాలు - అనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణవేదము - ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
ఒక్కొక్క వేదంలో భాగాలైన సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు కూడా శ్రుతులేఅగును.
ఉపవేదములు[మార్చు]
నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:
- ఆయురవేదం, (వైద్య సంబంధ మైనది)
- గాంధర్వవేదం (సంగీత సంబంధ మైనది)
- ధనురవేదం (యుద్ధ సంబంధమైనది),
- స్థాపత్యవేదం ( శిల్ప విద్యకు సంబంధించినది)
వేదాంగములు[మార్చు]
వేదాంగములు ఆరు. అవి:
- శిక్ష, ఛందస్సు, నిరుక్తము, వ్యాకరణము, జ్యోతిషము, కల్పము.
- ఇంకా ఇతిహాసము అయిన మహాభారతము "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది.
స్మృతులు[మార్చు]
"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంథాలు. విధి, నిషేధాల (మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.
- స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి మను, అత్రి, విష్ణు, హరిత, యాజ్ఞవల్క్య, ఉశాన, ఆంగీరస, యమ, ఆపస్తంబ, సమ్వర్త, కాత్యాయన, బృహస్పతి, పరాశర, వ్యాస, శంఖ, లిఖితా,దక్ష, గౌతమ, శాతాతప, వసిష్ట స్మృతులు (ధర్మశాస్త్రాలు).
- 20 ధర్మశాస్త్రాలు
- ఇతిహాసములు - రామాయణము, మహాభారతము
- 18 పురాణాలు
- ఆగమములు - దేవాలయముల నిర్మాణము, విగ్రహములను చేయుట, ఆలయ ప్రతిష్ఠ, పూజా విధానములు వంటి విషయములు ఆగమములలో ప్రస్తావించబడినవి. ఇవి రెండు ప్రధాన వర్గములు
- శైవాగమములు - 28 కలవందురు.
- వైష్ణవాగమములు - పాంచరాత్రము, వైఖానసము
- దర్శనములు: దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరము శరీరమునుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరములకు వెళ్ళు మార్గం ఏమిటి? ఇలా జీవితము, ధర్మము, మోక్షము వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనములు. వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనాలు అంటారు. అవి
మతంతో సంబంధంలేని విభాగాలు[మార్చు]
వనరులు[మార్చు]
- "హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ