ధర నిర్ణయ వ్యూహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక ఉత్పత్తి యొక్క ధరను నిర్ణయించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వ్యాపారాలు ఎక్కువగా ఉపయోగించేందుకు అవకాశం ఉన్న సర్వశ్రేష్టమైన వ్యూహాలు ఇక్కడ ఉన్నాయి.

పోటీ-ఆధారిత ధర నిర్ణయ విధానం[మార్చు]

సారూప్య పోటీదారు ఉత్పత్తుల యొక్క ధరల ఆధారంగా ధరను నిర్ణయించడం.

పోటీతత్వ ధర నిర్ణయ విధానం మూడు రకాల పోటీతత్వ ఉత్పత్తిపై ఆధారపడివుంటుంది:

 • పోటీదారు యొక్క ఉత్పత్తితో పోలిస్తే శాశ్వత ప్రత్యేకత ఉన్న ఉత్పత్తులు. దీని నుంచి మనం ఈ కిందివాటిని గ్రహించవచ్చు
  • ఉత్పత్తికి తక్కువ ధర స్థితి స్థాపకత ఉంది.
  • ఉత్పత్తికి తక్కువ అడ్డ స్థితిస్థాపకత (క్రాస్ ఎలాస్టిసిటీ) ఉంది.
  • ఉత్పత్తికి గిరాకీ పెరుగుతుంది.
 • ఉత్పత్తి లక్షణాలను మధ్యతరహా ప్రత్యేకతగా భావించినట్లయితే, అటువంటి ఉత్పత్తులకు పోటీదారు యొక్క ఉత్పత్తితో పోలిస్తే క్షీణించే ప్రత్యేకత ఉంటుంది.
 • పోటీదారు యొక్క ఉత్పత్తితో పోలిస్తే తక్కువ ప్రత్యేకత కలిగివున్న ఉత్పత్తులు. ఇక్కడ మనం ఈ కిందివాటిని గ్రహించవచ్చు:
  • అధిక ధర స్థితి స్థాపకత ఉన్న ఉత్పత్తి.
  • కొంత అడ్డ స్థితిస్థాపకత ఉన్న ఉత్పత్తి.
  • ఉత్పత్తికి గిరాకీ పెరుగుతుందనేందుకు ఎటువంటి అంచనా ఉండదు.

కాస్ట్-ప్లస్ ధర నిర్ణయ విధానం[మార్చు]

కాస్ట్-ఫ్లస్ ధర నిర్ణయ విధానం (అసలు ఉత్పాదక వ్యయానికి లాభాన్ని జోడించే ధర నిర్ణయ విధానం) అనేది ఒక సాధారణ ధర నిర్ణయ పద్ధతి. ఉత్పత్తిని తయారు చేసేందుకు అయిన వ్యయాన్ని లెక్కించి, ఈ ధరకు ఒక శతాంశాన్ని (లాభం) జోడించి సంస్థ విక్రయ ధరను నిర్ణయిస్తుంది. ఈ పద్ధతి సులభమైన విధానంగా కనిపిస్తున్నప్పటి, రెండు ప్రతికూలతలు ఉన్నాయి; ఇది గిరాకీని పూర్తిగా విస్మరిస్తుంది, అంతేకాకుండా గణించిన ధర వద్ద ఉత్పత్తిని సంభావ్య వినియోగదారులు కొనుగోలు చేస్తారా లేదా అనేది గుర్తించేందుకు ఎటువంటి మార్గం లేదు.

ఇది రెండు రూపాల్లో కనిపిస్తుంది, వీటిలో ఒకటి పూర్తి వ్యయ ధర నిర్ణయ విధానం, ఇది చర మరియు స్థిర వ్యయాలు రెండింటినీ పరిగణలోకి తీసుకొని ఒక %ను (శతాంశాన్ని) జోడిస్తుంది. మరో పద్ధతి ఏమిటంటే ప్రత్యక్ష ధర నిర్ణయ విధానం, దీనిలో చర వ్యయాలకు ఒక %ను (శతాంశాన్ని) జోడిస్తారు, సుదీర్ఘకాలంలో నష్టాలు ఏర్పడతాయి కాబట్టి, ఈ రెండో విధానాన్ని సాధారణంగా అధిక పోటీ ఉన్న సమయాల్లో మాత్రమే ఉపయోగిస్తారు.

క్రీమింగ్ లేదా స్కిమ్మింగ్[మార్చు]

ఒక అధిక ధర వద్ద ఒక ఉత్పత్తిని విక్రయించడం ద్వారా అధిక లాభాన్ని పొందేందుకు అధిక విక్రయాలను త్యాగం చేస్తారు, తద్వారా మార్కెట్‌లో పైలాభాలను తీసుకోవడం (స్కిమ్మింగ్) జరుగుతుంది. ఉత్పత్తి తయారీ కోసం చేపట్టిన అసలు పరిశోధనపై పెట్టుబడి వ్యయాన్ని తిరిగి పొందేందుకు సాధారణంగా దీనిని ఉపయోగిస్తారు - సాధారణంగా ఇటువంటి విధానాన్ని ఎలక్ట్రానిక్ మార్కెట్‌లలో DVD ప్లేయర్‌ల వంటి కొత్త శ్రేణిని ప్రవేశపెట్టినప్పుడు ఉపయోగిస్తారు, ఈ ఉత్పత్తులను మార్కెట్‌లో మొదట అధిక ధరతో విడుదల చేస్తారు. ఒక ఉత్పత్తి లేదా సేవ యొక్క "ప్రారంభ కొనుగోలుదారులను" లక్ష్యంగా చేసుకొని ఈ వ్యూహాన్ని తరచుగా ఉపయోగిస్తారు. ఈ ప్రారంభ కొనుగోలుదారులకు బాగా తక్కువ ధర-పట్టింపు ఉంటుంది, అందువలన ఇతరుల కంటే వీరికి ఉత్పత్తి అవసరం ఎక్కువగా ఉంటుంది లేదా ఇతరుల కంటే ఉత్పత్తి యొక్క విలువను వీరు బాగా అర్థం చేసుకుంటారు. ఉత్పత్తిని తయారు చేసేందుకు పెట్టిన పెట్టుబడిలో ఎక్కువ భాగాన్ని తిరిగి పొందేందుకు ఈ వ్యూహాన్ని కొద్ది కాలం మాత్రమే అమలు చేస్తారు. మరింత మార్కెట్ వాటాను పొందేందుకు, విక్రేత తప్పనిసరిగా ఎకానమి (మితవ్యయ) లేదా పెనట్రేషన్ (వ్యాప్తి) వంటి ఇతర ధర నిర్ణయ వ్యూహాలు ఉపయోగించాలి. ఈ పద్ధతి వలన కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, ఇది పోటీదారుల కంటే అధిక ధర వద్ద ఉత్పత్తిని ఉంచుతుంది.[1]

పరిమిత ధర నిర్ణయ విధానం[మార్చు]

ఒక మార్కెట్‌లో ప్రవేశించిన మితవ్యయ పోటీదారును నిరుత్సాహపరిచేందుకు ఒక గుత్తేదారు నిర్ణయించే ధరను పరిమిత ధర అంటారు, ఇది అనేక దేశాల్లో చట్టవిరుద్ధ వ్యాపార విధానంగా ఉంది. అప్పటికే ఉన్న సంస్థ ఉత్పత్తిని తగ్గించనంత కాలం మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన సంస్థ ఎదుర్కొనే ధరను పరిమిత ధర అంటారు. పరిమిత ధర అనేది తరచుగా సగటు ఉత్పాదక వ్యయం కంటే తక్కువగా లేదా కొత్తగా ప్రవేశించిన సంస్థలు లాభపడకుండా చేసేంత తక్కువగా ఉంటుంది. కొత్తగా ప్రవేశించిన సంస్థకు ప్రతిబంధకంగా పనిచేసేందుకు మార్కెట్‌లో స్థిరపడిన సంస్థ ఉత్పత్తి చేసే పరిమాణం ఒక గుత్తేదారు వాంఛనీయత కంటే సాధారణంగా ఎక్కువగా ఉంటుంది, అయితే సంపూర్ణ పోటీ వాతావరణంలో కంటే ఈ పరిస్థితిలో కూడా అధిక ఆర్థిక లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. వ్యూహాత్మక ప్రవర్తనగా పరిమిత ధర నిర్ణయ విధానంతో ఉన్న సమస్య ఏమిటంటే మార్కెట్‌లోకి కొత్త సంస్థ అడుగుపెట్టిన తరువాత, ప్రవేశానికి ప్రతిబంధకంగా ఉండేందుకు ఒక ముప్పుగా ఉపయోగించిన ఈ పరిమాణం ఇప్పటికే స్థిరపడిన సంస్థ యొక్క ఉత్తమ స్పందనగా ఉండదు. దీనర్థం ఏమిటంటే, పరిమిత ధర నిర్ణయ విధానం కొత్తగా ప్రవేశించే సంస్థకు ఒక సమర్థవంతమైన ప్రతిబంధకంగా ఉండటానికి ముప్పు తప్పనిసరిగా ఏదో ఒక విశ్వసనీయ మార్గంలో ఉండాలి. కొత్త ప్రవేశించిన సంస్థ విషయంలో దీనిని సాధించేందుకు ప్రవేశం జరిగినా లేదా కాకపోయినా ఒక నిర్దిష్ట పరిమాణాన్ని మాత్రమే ఈ సంస్థ ఉత్పత్తి చేసేలా చేయాలి. ఉదాహరణకు, ఒక సుదీర్ఘ కాలంపాటు ఒక నిర్దిష్ట (అధిక) స్థాయిలో కార్మికులకు ఉద్యోగాలు ఇస్తామని ఒక యూనియన్ ఒప్పందంపై కొత్తగా ప్రవేశించిన కంపెనీ సంతకం చేసినట్లయితే ఈ విధానాన్ని అమలు చేయవచ్చు.

లాస్ లీడర్[మార్చు]

లాస్ లీడర్: ప్రాథమిక భావన ఎక్కువ సందర్భాల్లో, ఈ ధర నిర్ణయ వ్యూహం EU మరియు US పోటీతత్వ నిబంధనల పరిధిలో చట్టవిరుద్ధంగా ఉంది. మార్కెట్‌పై ఆధిపత్యం కలిగివున్న ఎటువంటి సంస్థ అయినా తక్కువ ధర విక్రయాలు జరపాలని కోరుకోదు, ఈ సంస్థ యొక్క మొత్తం వ్యూహంలో ఇది భాగంగా ఉన్నట్లయితే మాత్రం ఇటువంటి విక్రయాలు జరుపుతుంది. నష్టానికి విక్రయాలు జరిపే ఆలోచన ప్రజా ప్రయోజనం కోసం ఉద్దేశించబడినదిగా కనిపిస్తుంది, అందువలన ఈ విషయంలో తరచుగా అభ్యంతరాలు వ్యక్తం కావు. ఆధిపత్య సంస్థ ధరలను పెంచుతున్నప్పుడు మాత్రం, ఇది అనుమానాస్పదమవుతుంది. కొల్లగొట్టే ధర నిర్ణయ విధానం లేదా అడ్డగోలు సబ్సిడీ వంటి విధానాల మాదిరిగానే నష్ట నాయకత్వం ఉంటుంది; ఈ రెండు విధానాలను పోటీతత్వ-నిరోధక పద్ధతులుగా పరిగణిస్తున్నారు.'

మార్కెట్-ఆధారిత ధర నిర్ణయ విధానం[మార్చు]

లక్షిత మార్కెట్‍‌లో విశ్లేషణ మరియు పరిశోధన ఫలితాలు ఆధారంగా ధరను నిర్ణయించడం.

ప్రవేశ ధర[మార్చు]

వినియోగదారులకు ఆసక్తి కల్పించేందుకు మరియు మార్కెట్‌లో తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఉద్దేశపూర్వకంగా తక్కువ స్థాయిలో ధరను నిర్ణయించడం.[2]

ధర వివక్ష[మార్చు]

విక్రయించేందుకు వివిధ భాగాల్లో ఒకే ఉత్పత్తికి వేర్వేరు ధరలను నిర్ణయించడం. ఉదాహరణకు, సినిమా టిక్కెట్ల విషయంలో వివిధ రకాల వయస్సు వారికి లేదా వివిధ ప్రదర్శనలకు ధరను ప్రత్యేకంగా నిర్ణయించడం.

అధిక ధర నిర్ణయ విధానం[మార్చు]

ధరను మాత్రమే పరిగణలోకి తీసుకొనే వినియోగదారుల మధ్య అనుకూలమైన అవగాహనలను ప్రోత్సహించేందుకు ఒక వస్తువు లేదా సేవకు కృత్రిమంగా ఎక్కువ ధరను నిర్ణయించే పద్ధతిని అధిక ధర నిర్ణయ విధానంగా గుర్తిస్తారు. కొనుగోలుదారులకు వ్యయభరితమైన వస్తువులు ఒక ప్రత్యేక గౌరవం లేదా ప్రత్యేక నాణ్యత మరియు విలక్షణతను కలిగివుంటాయనే భావన కల్పించడం ద్వారా ఈ పద్ధతి దోపిడీకి (సమర్థనీయమైనది కానవసరం లేదు) ఉద్దేశించబడింది.

దోపిడీ ధర నిర్ణయ విధానం[మార్చు]

దోపిడీ ధర నిర్ణయ విధానం అనేది మార్కెట్ నుంచి పోటీదారులను వెళ్లగొట్టేందుకు ఉద్దేశించబడింది. కొన్ని ప్రదేశాల్లో ఇది చట్టవిరుద్ధమైన పద్ధతిగా ఉంది.

సహాయ ఉపాంతం-ఆధారిత ధర నిర్ణయ విధానం[మార్చు]

సహాయ ఉపాంతం-ఆధారిత ధర నిర్ణయ విధానం, ఉత్పత్తి ధర మరియు చర వ్యయాలు (ప్రతి యూనిట్ ఉత్పత్తి యొక్క సహాయ ఉపాంతం) మధ్య వ్యత్యాసం మరియు ఉత్పత్తి యొక్క ధర మరియు ఈ ధర వద్ద విక్రయించబడే యూనిట్‌ల సంఖ్య మధ్య సంబంధంపై ఒకరి అంచనాలు ఆధారంగా ఒక ఉత్పత్తి నుంచి పొందే లాభాన్ని పెంచుతుంది. ఈ కిందిదానిని పెంచే ఒక ధరను ఎంచుకున్నప్పుడు సంస్థ మొత్తం లాభం (అంటే నిర్వహణ ఆదాయంలో) లో ఉత్పత్తి యొక్క వాటా పెరుగుతుంది: అవి (ప్రతి యూనిట్‌కు సహాయ ఉపాంతం) X (మొత్తం విక్రయించిన యూనిట్‌ల సంఖ్య).

మానసిక ధర నిర్ణయ విధానం[మార్చు]

ఒక సానుకూలమైన మానసిక ప్రభావాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ధర నిర్ణయ విధానం. ఉదాహరణకు, ఒక ఉత్పత్తిని $4కు బదులుగా $3.95 లేదా $3.99 ధర వద్ద విక్రయించడం.

ప్రభావవంతమైన ధర నిర్ణయ విధానం[మార్చు]

సమచార సాంకేతిక పరిజ్ఞానంలో పురోభివృద్ధి చోటుచేసుకోవడంతో ఒక వహనీయ ధర నిర్ణయ వ్యవస్థ సాధ్యపడింది, దీనిని ఎక్కువగా ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలు అమలు చేస్తున్నాయి. మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా వినియోగదారుల వద్ద నుంచి సేకరించిన భారీ పరిమాణాల్లోని సమాచారానికి స్పందించడం - అంటే వినియోగదారులు ఎక్కువ నివసిస్తున్నారనే వివరాల నుంచి వారు ఏ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు, గత కొనుగోళ్లపై వారు ఎంత ఖర్చు చేశారనే వివరాల వరకు మొత్తం సమాచారాన్ని సేకరించడం - ద్వారా ప్రభావవంతమైన ధర నిర్ణయ విధానం ఆన్‌లైన్ కంపెనీలు ఒక వినియోగదారు చెల్లించేందుకు సముఖంగా ఉండే ఒక ధరను సారూప్య వస్తువులకు సర్దుబాటు చేయడానికి వీలు కల్పిస్తుంది. విమానయాన పరిశ్రమ తరచుగా ఒక ప్రభావవంతమైన ధర నిర్ణయ విధానాన్ని ఉపయోగించడంలో విజయవంతమవుతుంది. వాస్తవానికి, ఒకే విమానంలో ప్రయాణించే ఎక్కువ మంది ప్రయాణికులు టిక్కెట్ల కోసం వివిధ ధరలు చెల్లించేలా చేయడం ద్వారా ఇది ఒక కళాత్మకమైన పద్ధతిని అమలు చేస్తుంది.

ధర నాయకత్వం[మార్చు]

ఓలిగోపిక్ వ్యాపార ప్రవర్తన గురించి జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, అనేక కంపెనీల్లో సాధారణంగా ఆధిపత్య పోటీదారుగా ఉన్న ఒక కంపెనీ ధరలు నిర్ణయించే మార్గాన్ని చూపుతుంది, ఇతర కంపెనీలు దీనిని అనుసరిస్తాయి.

లక్షిత ధర నిర్ణయ విధానం[మార్చు]

ఒక నిర్దిష్ట ఉత్పత్తి పరిమాణానికి పెట్టిన పెట్టుబడిలో కొంత భాగాన్ని తిరిగి పొందడం కోసం నిర్ణయించే ఒక ఉత్పత్తి యొక్క విక్రయ ధరను లక్షిత ధర నిర్ణయ విధానంగా గుర్తిస్తారు. విద్యుత్ మరియు గ్యాసు కంపెనీల వంటి ప్రభుత్వ సంస్థలు మరియు మూలధన పెట్టుబడి బాగా ఎక్కువగా ఉండే ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తరచుగా ఈ లక్షిత ధర నిర్ణయ విధానాన్ని ఉపయోగిస్తాయి.

మూలధన పెట్టుబడులు బాగా తక్కువ ఉన్న కంపెనీలకు లక్షిత ధర నిర్ణయ విధానం ఉపయోగకరంగా ఉండదు, ఎందుకంటే, ఈ సూత్రం ప్రకారం, విక్రయించే ధరను తక్కువగా నిర్ణయిస్తారు. అంతేకాకుండా లక్షిత ధర నిర్ణయ విధానం ఉత్పత్తికి గిరాకీతో సంబంధం కలిగివుండదు, మొత్తం ఉత్పత్తి విక్రయించబడనట్లయితే, దీని ద్వారా కంపెనీ ఉత్పత్తిపై చేసిన మొత్తం వ్యయంలో ఎంతోకొంత రాబట్టుకోగలుగుతుంది.

విలీన ధర నిర్ణయ విధానం[మార్చు]

ఈ ధర నిర్ణయ విధానంలో వ్యయాలన్నీ తిరిగి పొందడం జరుగుతుంది. ఉత్పత్తి యొక్క ధరలో ప్రతి వస్తువు యొక్క చర వ్యయంతోపాటు తగిన పరిమాణంలో నిర్దిష్ట వ్యయాలు జోడించబడతాయి. ఇది ఒక రకమైన కాస్ట్ ప్లస్ ధర నిర్ణయ విధానం.

ఎక్కువ-తక్కువ ధర నిర్ణయ విధానం[మార్చు]

ఈ ధర నిర్ణయ విధానంలో, ఒక సంస్థ అందించే సరుకులు లేదా సేవలకు పోటీదారుల కంటే ఎప్పటికప్పుడు ఎక్కువ స్థాయిలో ధరలు నిర్ణయించబడతాయి, అయితే ప్రోత్సాహక కార్యక్రమాలు, ప్రకటనలు మరియు లేదా కూపన్‌ల ద్వారా ప్రధాన వస్తువులపై తక్కువ ధరలు అందించబడతాయి. వినియోగదారులను సంస్థకు తీసుకొచ్చే లక్ష్యంతో తక్కువ ప్రోత్సాహక ధరలను నిర్ణయిస్తారు, ఈ పద్ధతిలో వినియోగదారులకు ప్రోత్సాహాక ఉత్పత్తితోపాటు, సాధారణ అధిక ధర ఉత్పత్తులను కూడా అందుబాటులో ఉంచుతారు.[3]

ఉపాంత-వ్యయ ధర నిర్ణయ విధానం[మార్చు]

వ్యాపారంలో, ఒక ఉత్పత్తి యొక్క ధరను ఉత్పత్తిలో ఒక అదనపు యూనిట్‌ను ఉత్పత్తి చేసేందుకు అయ్యే అదనపు వ్యయానికి సమానంగా ఉంచుతారు. ఈ విధానం ద్వారా, విక్రయించిన ప్రతి ఉత్పత్తి యూనిట్‌కు ఒక ఉత్పత్తిదారు పదార్థాలు మరియు ప్రత్యక్ష కార్మికులపై అయిన మొత్తం వ్యయం వాటాను జోడించి విక్రయిస్తాడు. విక్రయాలు అంతంతమాత్రంగా ఉన్న కాలంలో వ్యాపారాలు ధరలను తరచుగా ఉపాంత వ్యయానికి దగ్గరగా ఉంచుతాయి. ఉదాహరణకు, ఒక వస్తువు యొక్క ఉపాంత వ్యయం $1.00 ఉన్నట్లయితే, సాధారణ విక్రయ ధర $2.00 ఉంటుంది, గిరాకీ బాగా తగ్గిపోయినట్లయితే కంపెనీ ఈ వస్తువు ధరను $1.10కు తగ్గించవచ్చు. అసలు ఏమాత్రం విక్రయాలు లేకపోవడం కంటే ప్రతి లావాదేవీ నుంచి ప్రోత్సాహక లాభం కనీసం 10 సెట్‌లు ఉన్నా మెరుగైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వ్యాపారాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి.

సూచికలు[మార్చు]

 1. కెంట్ బి మన్రో, ది ప్రైసింగ్ స్ట్రాటజీ ఆడిట్ , 2003, కేంబ్రిడ్జ్ స్ట్రాటజీ పబ్లికేషన్స్, పేజి 40 ISBN 978-0-273-64938-0
 2. కెంట్ బి మన్రో, ది ప్రైసింగ్ స్ట్రాటజీ ఆడిట్ , 2003, కేంబ్రిడ్జ్ స్ట్రాటజీ పబ్లికేషన్స్, p.41 ISBN 978-0-273-64938-0
 3. ఫిలిప్ కోట్లెర్ & గ్యారీ ఆర్మ్‌స్ట్రాంగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ మార్కెటింగ్ 13E , 2010, పియర్సన్ ప్రెంటిస్ హాల్, p.293 ISBN 978-0-13-607941-5