Jump to content

ధరణికోట

అక్షాంశ రేఖాంశాలు: 16°34′44.2200″N 80°20′44.3760″E / 16.578950000°N 80.345660000°E / 16.578950000; 80.345660000
వికీపీడియా నుండి
(ధాన్యకటకం నుండి దారిమార్పు చెందింది)
ధరణికోట
రహదారి పక్కన గ్రామంలో ఇళ్లు, ధరణికోట
రహదారి పక్కన గ్రామంలో ఇళ్లు, ధరణికోట
పటం
ధరణికోట is located in ఆంధ్రప్రదేశ్
ధరణికోట
ధరణికోట
అక్షాంశ రేఖాంశాలు: 16°34′44.2200″N 80°20′44.3760″E / 16.578950000°N 80.345660000°E / 16.578950000; 80.345660000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు
మండలంఅమరావతి
విస్తీర్ణం
35.48 కి.మీ2 (13.70 చ. మై)
జనాభా
 (2011)
7,534
 • జనసాంద్రత210/కి.మీ2 (550/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,734
 • స్త్రీలు3,800
 • లింగ నిష్పత్తి1,018
 • నివాసాలు1,966
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522020
2011 జనగణన కోడ్589945
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళాశాల
రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు కళాశాల

ధరణికోట (ధాన్యకటకం), పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో కృష్ణా నది తీరంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణం. అమరావతి దీని జంట గ్రామం.ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 34 కి. మీ. దూరంలోనూ ఉంది.

చరిత్ర

[మార్చు]

సా.శ. 8 నుండి 12 మధ్య చంద్రవంశపు క్షత్రియులు ధరణికోటను రాజధానిగా చేసుకుని గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలను పాలించారు. (వీరు దుర్జయవంశీకులని, క్షత్రియులు కాదని మరొక వాదన) హరిసీమ కృష్ణ మహారాజు స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని కోట సామ్రాజ్యం లేదా ధరణికోట సామ్రాజ్యం అని అంటారు. కోట రాజులు జైన మతాన్ని అనుసరించినా తరువాతి కాలంలో చాళుక్యుల వలె హిందూతత్వాన్ని కూడా పాటించారు. వీరి కాలంలో బ్రాహ్మణులకు అత్యంత విలువ ఉండేది. వీరికి భూములను, నగదును, గోవులను దానంగా ఇచ్చేవారు. కొందరు చరిత్ర కారులు కోట రాజులు మధ్యదేశాన్ని పాలించిన ధనుంజయ మహారాజు యొక్క వంశస్థులని చెబుతున్నారు. అయితే ఈ ధనుంజయుడి గురించి వివరాలు చరిత్రకు అందలేదు. కోట రాజులు చాలా సంవత్సరాలు తమ సామ్రాజ్యాన్ని స్వయంగా పరిపాలించినప్పటికీ తరువాతి కాలంలో కాకతీయులకు సామంత రాజులైయ్యారు. కోట వంశ రాజులకు తూర్పు చాళుక్యులతోను, కాకతీయులతోను, పరిచ్చేదులతోను, ఛాగి, కలచురిలతోను వైవాహిక సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ రాజు గణపతి దేవుడి కుమార్తె అయిన గణపాంబను వివాహమాడాడు. 1268 లో కోట బెతరాజు ఆఖరి రాజుగా కోట సామ్రాజ్యం అంతమైపోయింది.[ఆధారం చూపాలి]

సమీప గ్రామాలు

[మార్చు]

ముతాయపాలె౦ 3కి.మీ, లింగాపురం 5 కి.మీ, అమరావతి 5 కి.మీ, బలుసుపాడు 6 కి.మీ, పెదమద్దూరు 7 కి.మీ.

జనగణన విషయాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1966 ఇళ్లతో, 7534 జనాభాతో 3548 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3734, ఆడవారి సంఖ్య 3800. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1438 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 540.[1]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,029.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,606, స్త్రీల సంఖ్య 3,423, గ్రామంలో నివాస గృహాలు 1,661 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 3,548 హెక్టారులు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ గుంటూరులో ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల అమరావతిలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు గుంటూరులోనూ ఉన్నాయి.

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళాశాల

[మార్చు]

ఈ కళాశాల పల్నాడు జిల్లాలో అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటి. ఇది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంకు అనుబంధం. కళాశాలకు విశాలమైన ఆట స్థలం, హాస్టల్ వసతి ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా, చెరువు ద్వారా కూడా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ధరణికోటలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ వుంది, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

భూమి వినియోగం

[మార్చు]

ధరణికోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1289 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 121 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 30 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 14 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 8 హెక్టార్లు
  • బంజరు భూమి: 1 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2082 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1505 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 586 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ధరణికోటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది

  • కాలువలు: 396 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 190 హెక్టార్లు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]
  1. ధరణికోట పడమటివీధిలో వేంచేసియున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని, తమ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం (పీఠం) పరిధిలోనికి తీసుకున్నట్లు, పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి, 17-3-2014న అమరావతిలో ప్రకటించారు.
  2. ఇక్కడ కృష్ణానది ఒడ్డున పురాతన విఘ్నేశ్వర దేవాలయము ఉంది. ఈ ఆలయాన్ని, 2015, మార్చి-4వ తేదీనాడు, కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్రసరస్వతిస్వామి, శిష్య, ప్రశిష్య సమేతంగా దర్శించి పూజలు నిర్వహించాడు. ఈ ఆలయ 21వ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆయన స్వామివారిని సేవించుకున్నాడు. అంతకు ముందు ఆయన, నూతనంగా నిర్మించిన ఆలయ ప్రధాన ముఖద్వారాన్ని ప్రారంభించాడు.
  3. అమరావతి నుండి నడక దారిలో సాయి మందిరము ఉంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

కె.చంద్రశేఖర్:- జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలో, గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలు చేపట్టిన వారికి, 2015, మార్చి-7వ తేదీన జరిగిన 8వ ద్వైవార్షిక పురస్కార ప్రదానోత్సవంలో జాతీయస్థాయి తృతీయ పురస్కారం పొందాడు. మూడు నిమిషాలలో 50 ఇటుకలు తయారు చేయగల యంత్రాన్ని రూపొందించి ఈ పురస్కారానికి ఎంపికైనాడు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-08-23.
"https://te.wikipedia.org/w/index.php?title=ధరణికోట&oldid=4061377" నుండి వెలికితీశారు