Jump to content

ధీరూభాయ్ షా

వికీపీడియా నుండి
ధీరూభాయ్ షా

పదవీ కాలం
1998  2002
ముందు గుమాన్‌సిన్హ్‌జీ వాఘేలా
తరువాత మంగళదాస్ పటేల్

ముందు బాబూభాయ్ షా
తరువాత బాబూభాయ్ షా
నియోజకవర్గం రాపర్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-12-18) 1952 డిసెంబరు 18 (వయసు: 73)
బేలా గ్రామం, రాపర్ తాలూకా, కఛ్ జిల్లా, గుజరాత్, భారతదేశం
మరణం (2008-03-17) 2008 మార్చి 17 (వయసు: 18)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం గుజరాత్
వృత్తి రాజకీయ నాయకుడు

ధీరూభాయ్ స్వరూప్‌చంద్ షా (18 డిసెంబర్ 1952 – 17 మార్చి 2008) గుజరాత్‌కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు, ఆయన 1998 మార్చి 19 నుండి 2002 డిసెంబర్ 27 వరకు పదవ గుజరాత్ శాసనసభకు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అతను గుజరాత్ శాసనసభ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన స్పీకర్.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ధీరూభాయ్ షా 18 డిసెంబర్ 1952న[2] భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం, కచ్ జిల్లా, రాపర్ తాలూకా, బేలా గ్రామంలోని ఒక జైన కుటుంబంలో జన్మించాడు.[3] ఆయన బి. కామ్., ఎల్.ఎల్.బి. చదివిన తరువాత,[2] గాంధీధామ్‌లో తన న్యాయవాద వృత్తిని ప్రారంభించాడు.[3] ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.[2][4]

రాజకీయ జీవితం

[మార్చు]

ధీరూభాయ్ షా 1983-84లో గాంధీధామ్ మున్సిపాలిటీలో ప్రతిపక్ష నాయకుడిగా, 1984 నుండి 1993 వరకు గాంధీధామ్ మున్సిపాలిటీ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన గుజరాత్ నగరపాలిక పరిషత్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వరుసగా ఎనిమిది సంవత్సరాలు పని చేశాడు.[2]

ధీరూభాయ్ షా 1998 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో రాపర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[5][6][4] ఆయన 1998 మార్చి 19 నుండి 2002 డిసెంబర్ 27 వరకు పదవ గుజరాత్ శాసనసభకు స్పీకర్‌గా పని చేశాడు. ఆయన శాసనసభ 16వ స్పీకర్. ఆయన గుజరాత్ శాసనసభ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన స్పీకర్.[3][6][4] ధీరూభాయ్ షా 2002 గుజరాత్ శాసనసభ ఎన్నికలలో రాపర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.[7][4]

ఆయన 2003 నవంబర్ 19న గుజరాత్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.[3]

మరణం

[మార్చు]

ధీరూభాయ్ షాకు 2005 జనవరి 29న తన కుమార్తె వివాహంలో గుండెపోటు వచ్చి కోమాలోకి వెళ్ళాడు. ఆయన ఆరోగ్యం మెరుగుపడింది కానీ ఎప్పుడూ పూర్తిగా కోలుకోలేదు. ఆయన 2008 మార్చి 17న అహ్మదాబాద్‌లో కోమా స్థితిలో గుండెపోటుతో మరణించాడు.[3][4] ఆయన భౌతికకాయానికి 2008 మార్చి 18న మధ్యాహ్నం అంత్యక్రియలు జరిపారు. 2008 మార్చి 18న అహ్మదాబాద్‌లోని పాల్డిలోని కుచ్చి భువన్‌లో ఆయన జ్ఞాపకార్థం బహిరంగ ప్రార్థన జరిగింది. అలాగే  2008 మార్చి 21న ఆయన స్వస్థలమైన గాంధీధామ్‌లో ఇదే విధమైన ప్రార్థన కార్యక్రమం జరిగింది. 2008 మార్చి 25న గుజరాత్ శాసనసభలో ప్రత్యేక సంతాప సభ జరిగింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, స్పీకర్ అశోక్ భట్ తదితరులు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు,  ఆ రోజుకు సభ వాయిదా పడింది.

స్మారక చిహ్నాలు

[మార్చు]
అహ్మదాబాద్‌లోని ధీరూభాయ్ షా అండర్‌బ్రిడ్జ్ (పల్డి జలరామ్ రైల్వే అండర్‌పాస్)

20 డిసెంబర్ 2011న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గాంధీధామ్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించాడు.[8] 2024 మార్చి 4న అహ్మదాబాద్‌లో పాల్డి క్రాస్ రోడ్‌ను లా గార్డెన్‌తో కలిపే పాల్డి రైల్వే అండర్‌పాస్‌కు ఆయన పేరు మీద ధీరూభాయ్ స్వరూప్‌చంద్ షా అండర్‌పాస్ అని నామకరణం చేశారు.[9]

మూలాలు

[మార్చు]
  1. "Past Speakers". Gujarat Vidhan Sabha website. Archived from the original on 22 April 2019. Retrieved 2014-06-23.
  2. 1 2 3 4 "Dhirubhai Swaroopachand Shah". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2002-11-22. Archived from the original on 2024-06-05. Retrieved 2025-03-23.
  3. 1 2 3 4 5 "Former Gujarat speaker Dhirubhai Shah dead". Thaindian News. 2008-03-18. Archived from the original on 2016-03-04. Retrieved 2014-06-23.
  4. 1 2 3 4 5 "Gujarat Assembly ex-speaker passes away". One India (in ఇంగ్లీష్). 2008-03-18. Retrieved 2025-03-23.
  5. "Rediff On The NeT Elections '98: Constituency Profile/Kutch, Gujarat". m.rediff.com. Retrieved 2025-03-23.
  6. 1 2 "Rediff On The NeT Elections '98: BJP MLA elected Gujarat speaker". m.rediff.com. Retrieved 2025-03-23.
  7. "Big leaders lose on both sides". The Times of India. 2002-12-15. ISSN 0971-8257. Retrieved 2025-03-23.
  8. "Former Assembly Speaker Dhirubhai lived a life fulfilled: Hon'ble CM". narendramodi.in. 20 December 2011. Retrieved 2014-06-23.
  9. "अहमदाबाद में नवनिर्मित 'श्री धीरूभाई स्वरूपचंद शाह-पालड़ी अंडरपास' का लोकार्पण". www.tarunmitra.in (in హిందీ). 2024-03-04. Retrieved 2025-03-23.