ధీరేంద్రనాథ్ గంగూలీ
ధీరేంద్రనాథ్ గంగూలీ (26 మార్చి 1893 – 18 నవంబర్ 1978), ధీరేన్ గంగూలీ లేదా డి.జి గా సుపరిచితులు. వీరు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం, పద్మభూషణ్ గ్రహీత, బెంగాలీ సినిమాకు చెందిన సినీ పారిశ్రామికవేత్త, నటుడు, దర్శకుడు. వీరు ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ, బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్, లోటస్ ఫిల్మ్ కంపెనీ వంటి అనేక చలనచిత్ర నిర్మాణ సంస్థలను స్థాపించారు. తరువాత న్యూ థియేటర్స్ కోసం చిత్రాలకు దర్శకత్వం వహించారు. హాస్య ప్రధాన చిత్రాలను ఎక్కువగా నిర్మించారు. వీరు కలకత్తాలో జన్మించారు, అదే నగరంలో మరణించారు.
ప్రారంభ జీవితం
[మార్చు]గంగూలీ శాంతినికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో చదివారు. హైదరాబాద్ లోని స్టేట్ ఆర్ట్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. 1915లో తన మేకప్ మెలకువలతో 'భవ్కీ అభివ్యక్తి' అనే ఛాయాచిత్రాల పుస్తకాన్ని విడుదల చేశారు. బ్రిటిష్ ఇండియా, స్వతంత్ర భారతదేశంలో సి.ఐ.డి (C.I.D.) అధికారులకు కూడా ఈ కళను నేర్పించారు. వీరి కుటుంబం బారిసాల్ కు చెందినది. [1]
వృత్తి
[మార్చు]ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ
[మార్చు]గంగూలీ ఛాయాచిత్ర పుస్తకం ద్వారా జె. ఎఫ్. మదన్ పరిచయం అయ్యారు. ఆయన సినిమాలలో పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారు.[1] 1918లో గంగూలీ, మదన్ థియేటర్స్ మేనేజర్ నితీష్ లాహిరితో కలిసి బెంగాలీ యాజమాన్యంలోని మొదటి నిర్మాణ సంస్థ 'ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ'ని స్థాపించారు.[2] నితీష్ లాహిరి దర్శకత్వం వహించిన మూకీ హాస్య చిత్రం 'బిలాత్ ఫెరత్ (1921)' (ది ఇంగ్లాండ్ రిటర్న్డ్) ఈ సంస్థ నుండి వచ్చిన మొదటి సినిమా.[1] 1922లో 'యశోద నందన్', 'సాధు ఔర్ సైతాన్' అనే మరో రెండు సినిమాలు విడుదల చేశారు.[2]
లోటస్ ఫిల్మ్ కంపెనీ
[మార్చు]గంగూలీ హైదరాబాద్‌లో 'లోటస్ ఫిల్మ్ కంపెనీ'ని స్థాపించారు. నిజాం సహాయంతో ఒక ఫిల్మ్ స్టూడియో, రెండు సినిమా హాళ్లను ఏర్పాటు చేశారు. 1924లో బొంబాయిలో నిర్మించిన 'రజియా బేగం' సినిమా పంపిణీదారుగా ఉన్నారు. ఒక ముస్లిం యువరాణి అబిసీనియన్ బానిసతో ప్రేమలో పడడాన్ని ఈ చిత్రం చూపించింది. ఇది నిజాంకు కోపం తెప్పించింది, గంగూలీని హైదరాబాద్ విడిచి వెళ్ళమని ఆదేశించారు.
బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్
[మార్చు]గంగూలీ కలకత్తాకు తిరిగి వచ్చి 'బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్' అనే మరో నిర్మాణ సంస్థను స్థాపించారు. నటుడు ప్రమథేష్ బారువా ఇందులో పెట్టుబడి పెట్టడమే కాకుండా, ఈ సంస్థ నిర్మించిన చిత్రంలో నటించారు. అయితే టాకీలు, కొత్త శబ్ద సాంకేతికత రావడంతో ఈ సంస్థ విఫలమైంది.
టాకీల శకం
[మార్చు]గంగూలీ, ప్రమథేష్ బారువాకు చెందిన బారువా పిక్చర్స్ కంపెనీలో చేరారు. కానీ త్వరలోనే ఇద్దరూ బి.ఎన్. సర్కార్ కు చెందిన న్యూ థియేటర్స్‌లో చేరారు.
గుర్తింపు
[మార్చు]- డి.జి. 1974లో పద్మభూషణ్ అందుకున్నారు.[3]
- 1975లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.
చలనచిత్ర జాబితా
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]- కార్టూన్ (1949)
- శేష్ నిబేదన్ (1948)
- శృంఖల్ (1947)
- దాబి (1943)
- ఆహుతి (1941)
- కర్మఖాలి (1940)
- పథ్-భూలే (1940)
- అభిసారిక (1938)
- అచిన్ ప్రియ (1938)
- హల్ బంగ్లా (1938)
- కంట్రీ గర్ల్ (1936) (హిందీ: దేహతి లడ్కీ)
- ద్విపాంతర్ (1936)
- బిద్రోహి (1935)
- ఎక్స్క్యూజ్ మీ, సర్ (1934)
- హల్కథ (1934)
- మస్తుతో భాయ్ (1934)
- నైట్ బర్డ్ (1934)
- చరిత్రహీన్ (1931)
- తకాయ్ కి నా హే (1931) (ఆంగ్ల శీర్షిక: Money Makes What Not)
- అలిక్ బాబు (1930) (ఆంగ్ల శీర్షిక: Master Liar)
- ఫ్లేమ్స్ ఆఫ్ ఫ్లెష్ (1930) (బెంగాలీ శీర్షిక: కామోనార్ అగున్)
- బిమాత (1923) (హిందీ శీర్షిక: బిజోయ్ బసంత్, ఆంగ్ల శీర్షిక: Stepmother)
- చింతామణి (1923)
- ది మ్యారేజ్ టానిక్ (1923)
- సతీ సీమంతిని (1923)
- విజయ్ అండ్ బసంత (1923)
- యయాతి (1923)
- యశోద నందన్ (1922) (హిందీ శీర్షిక: శ్రీ రాధా కృష్ణ)
- హర గౌరి (1922)
- ఇంద్రజీత్ (1922)
- లేడీ టీచర్ (1922)
నటుడిగా
[మార్చు]- శేష్ నిబేదన్ (1948)
- బొండిత (1945)
- హల్ బంగ్లా (1938)
- ఎక్స్క్యూజ్ మీ, సర్ (1934)
- మస్తుతో భాయ్ (1934)
- మరనేర్ పరే (1931) (ఆంగ్ల శీర్షిక: After the Death)
- తకాయ్ కి నా హే (1931) (ఆంగ్ల శీర్షిక: Money Makes What Not)
- పంచసర్ (1930) (ఆంగ్ల శీర్షిక: Blind God / Five Arrows)
- అలిక్ బాబు (1930) (ఆంగ్ల శీర్షిక: Master Liar)
- శంకరాచార్య (1927) (ఆంగ్ల శీర్షిక: Renaissance of Hinduism)
- యశోద నందన్ (1922) (హిందీ శీర్షిక: శ్రీ రాధా కృష్ణ)
- లేడీ టీచర్ (1922)
- సాధు ఔర్ సైతాన్ (1922)
- బిలెత్ ఫెరత్ (1921) (ఆంగ్ల శీర్షిక: The England Returned)
రచయితగా
[మార్చు]- శేష్ నిబేదన్ (1948) (స్క్రీన్ ప్లే)
- బిలెత్ ఫెరత్ (1921) (ఆంగ్ల శీర్షిక: The England Returned) (రచయిత)
నిర్మాతగా
[మార్చు]- ఫ్లేమ్స్ ఆఫ్ ఫ్లెష్ (1930) (బెంగాలీ శీర్షిక: కామోనార్ అగున్)
- బిలెత్ ఫెరత్ (1921) (ఆంగ్ల శీర్షిక: The England Returned)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 pp 950-951, Google books preview from 'Arts of Transitional India Twentieth Century', by Vinayak Purohit, ISBN 0-86132-138-3
- ↑ 2.0 2.1 "History of Bengali Cinema from BFJA Awards website". Archived from the original on 24 September 2005. Retrieved 14 May 2008.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Dhirendranath Ganguly పేజీ
- Bangla Films Online Archived 13 సెప్టెంబరు 2017 at the Wayback Machine