Jump to content

ధీరేంద్ర నాథ్ బెజ్‌బారువా

వికీపీడియా నుండి
ధీరేంద్ర నాథ్ బెజ్బారువా
1933 (age 9293)
వృత్తిపాత్రికేయుడు


రచయిత
Spouseకల్పనా బెజ్బారువా
పిల్లలుగాయత్రీ బెజ్బారువా, మైత్రేయి రాయ్, భాస్కర్ బెజ్బారువా
తల్లిదండ్రులుదివంగత సురేంద్ర నాథ్ బెజ్బారువా, దివంగత కమలా బెజ్బారువా
పురస్కారాలుపద్మశ్రీ


బి. డి. గోయెంకా అవార్డు


కథా అవార్డు


నచికేత సమ్మాన్

ధీరేంద్ర నాథ్ బెజ్బారువా భారతీయ పాత్రికేయుడు, రచయిత. గౌహతి కేంద్రంగా వెలువడే ది సెంటినెల్ అనే ఆంగ్ల దినపత్రికకు ఈయన వ్యవస్థాపక ఎడిటర్.[1]

తొలి జీవితం

[మార్చు]

ఈయన ఈశాన్య భారత రాష్ట్రమైన అస్సాం లోని జోర్హాట్ జిల్లాలో 1933లో జన్మించారు. యూకేలోని రీడింగ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత లెక్చరర్‌గా వృత్తి జీవితం ప్రారంభించారు.[2] 1983లో ది సెంటినెల్ దినపత్రిక స్థాపించినప్పుడు ఈయన వ్యవస్థాపక ఎడిటరుగా ఎంపికయ్యారు. చాలా ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.[3] అస్సాం మీడియా ట్రస్ట్‌తో అనుబంధం కలిగిన ఈయన 1992లో ఆ సంస్థ వేడుకల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు.[4] అస్సామీ నుండి ఆంగ్లంలోకి ఈయన అనేక పుస్తకాలు అనువదించారు. వాటిలో భబేంద్ర నాథ్ సైకియా రాసిన 'ది కేవెర్న్ అండ్ అదర్ స్టోరీస్' అనే కథా సంకలనం ఒకటి.[5] పాత్రికేయ రంగంలో సేవలకు గాను 1997లో బి. డి. గోయెంకా అవార్డు,[2] 2001లో పాంచజన్య వారపత్రిక అందించే నచికేత సమ్మాన్ అందుకున్నారు.[6] అనువాద ప్రక్రియలో కథా అవార్డు కూడా దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో ఈయన కృషిని గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2016లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ తో గౌరవించింది.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ది సెంటినెల్

భబేంద్ర నాథ్ సైకియా

మూలాలు

[మార్చు]
  1. "This Is How Assam Shines Bright on the 67th Republic Day Today". Bordoisila. 26 జనవరి 2016. Archived from the original on 20 ఆగస్టు 2016. Retrieved 25 జూలై 2016.
  2. 1 2 Robin S. Ngangom (2009). Dancing Earth: An Anthology of Poetry from North-East India. Penguin Books India. pp. 323–. ISBN 978-0-14-310220-5.
  3. "Padma Sri for DN Bezbaruah, three others". The Sentinel. 25 జనవరి 2016. Archived from the original on 15 ఆగస్టు 2016. Retrieved 25 జూలై 2016.
  4. "History". Media Trust. 2016. Retrieved 25 జూలై 2016.
  5. "BJP suffers because of setting high standards of probity for itself". Hindu Vivek Kendra. ఏప్రిల్ 2001. Retrieved 25 జూలై 2016.
  6. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 3 ఆగస్టు 2017. Retrieved 3 జనవరి 2016.

బయటి లింకులు

[మార్చు]

"Ex-NEHU teacher gets Padma Shri". The Shillong Times. 26 జనవరి 2016. Archived from the original on 10 జనవరి 2017. Retrieved 25 జూలై 2016.

Dr KH Kabi; Dr. S N Pattnaik (24 జూలై 2015). Media, Conflict and Peace in Northeast India. Vij Books India Pvt Ltd. pp. 49–. ISBN 978-93-84464-44-8.

మూస:సాహిత్యం, విద్యారంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు