ధృవీకృత ఆర్థిక ప్రణాళికాదారుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధృవీకృత ఆర్థిక ప్రణాళికాదారుడు (ఆంగ్లం: Certified Financial Planner : CFP) హోదా అనేది ప్రామాణిక‌ ధృవీకృత ఆర్థిక ప్రణాళికా బోర్డు ఆర్థిక ప్రణాళికాదురులకు ఇచ్చే వృత్తిపరమైన సర్టిఫికేషన్‌ హోదా. (CFP బోర్డు) [1] యునైటెడ్‌ స్టేట్స్‌లో ఉన్న సంస్థ. అలాగే కెనడాలోని[2] ఆర్థిక ప్రణాళికాదారుల స్టాండర్స్‌ సమితి మరియు ఆర్థిక ప్రణాళికా స్టాండర్డ్స్‌ బోర్డు (FPSB) [3]కి అనుబంధంగా ఉన్న 18 సంస్థలు కూడా ఈ హోదాను ఇస్తాయి. వీటన్నింటికీ యునైటెడ్‌ స్టేట్స్‌ బయట ఈ CFP మార్కు ఇచ్చే అధికారం ఉంది.

ఈ హోదాను తీసుకునే హక్కు కలగాలంటే. క్యాండిటెట్‌ కచ్చితంగా అవసరమైన చదువును, పరీక్షను పూర్తి చేయాలి. అనుభవంతో పాటు అవసరమైన విలువలను కలిగి ఉండి, సర్టిఫికెట్‌కు అవసరమైన ఫీజు చెల్లించాలి.[4]. యునైటెడ్‌ స్టేట్స్‌లో దీనికి సంబంధించిన సమాచారం అంతా CFP బోర్డు చూసుకుంటుంది.[5] అలాగే యుకెలో CFP లైసెన్సు ఆర్థిక ప్రణాళికాదారులకు ఆర్థిక ప్రణాళికా సంస్థ సభ్యత్వం ద్వారా లభిస్తుంది.[6]

కావలసిన చదువు[మార్చు]

CFP హోదా పొందాలంటే, వ్యక్తులు కచ్చితంగా అనేక అవసరాలను పూర్తి చేయాలి. తొలుత అవసరమైన చదువును పూర్తి చేయాలి. యు.ఎస్‌.కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదవాలి. [8] CFP సర్టిఫికేషన్‌లో తొలి అడుగుగా విద్యార్థులు ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన 100 అంశాలను కచ్చితంగా[7] చదివి తీరాలి.[8] ఆ అంశాలు ప్రణాళికలకు సంబంధించి ఇలా ఉన్నాయి:

 • ఆర్థిక ప్రణాళికలకు సంబంధించిన సాధారణ సిద్ధాంతాలు
 • బీమా ప్రణాళికలు
 • ఉద్యోగుల లాభాల ప్రణాళిక
 • పెట్టుబడులు మరియు సెక్యూరిటీల ప్రణాళిక
 • స్టేట్‌ మరియు ఫెడరల్‌ ఆదాయపన్ను ప్రణాళిక
 • ఎస్టేట్‌ పన్ను, బహూమతి పన్ను, బదిలీ పన్ను ప్రణాళిక
 • ఆస్తుల రక్షణ ప్రణాళిక
 • పదవీ విరమణ ప్రణాళిక
 • ఎస్టేట్‌ ప్రణాళిక

చదువుకు సంబంధించిన అర్హతలను పూర్తి చేసుకున్నాక, విద్యార్థులు పైన పేర్కొన్న అంశాల గురించి శిక్షణ తీసుకోవాలి. ఇందులో తొలుతగా CFP బోర్డు నిర్వహించే సర్టిఫికేషన్‌ పరీక్షను పది గంటల పాటు కూర్చుని రాయాల్సి ఉంటుంది.[7] బ్యాచిలర్స్‌ డిగ్రీ (లేదా అంతకంటే పెద్దది) లేదా దానికి సమానమైన అంశంలో ఒక ధృవీకృత కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి CFP సర్టిఫికేషన్‌ పొందేందుకు వీలుగా సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. ఆరంభ సర్టిఫికేషన్‌ కోసం బ్యాచిలర్స్‌ డిగ్రీ సర్టిఫికేషన్‌ అనేది ప్రాథమిక నిబంధన; CFP సర్టిఫికేషన్‌ పరీక్ష తీసుకునేందుకు ఇది అవసరం కాదు.[9]

CFP బోర్డు అనుమతి ముందుగా పొంది ఉన్న హోదాలను వృత్తినిపుణులు కలిగి ఉంటే (వ్యాపారం మరియు ఆర్థికశాస్త్రంలో PhDలు, అటార్నీలు, సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్స్‌ ( (CPA), చార్టెర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ACCA), చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (CA), చార్టర్డ్‌ వెల్త్‌ మేనేజర్స్‌ (AAFM‌), చార్టర్డ్‌ లైఫ్‌ అండర్‌రైటర్స్‌ ( (CLU), చార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌ CFA) ) వీరు రిజిస్టర్‌ చేసుకుని, అవసరమైన విద్యార్హతలు లేకుండానే పరీక్ష రాయవచ్చు. CFP బోర్డు యొక్క చాలెంజ్‌ హోదాను ఉపయోగించి అవసరమైన విద్యార్హతలను చేరవచ్చు.

యు.ఎస్‌. డిగ్రీతో సమాన హోదా ఉన్న మూడో సంస్థ నుంచి ఏదైనా అంతర్జాతీయ డిగ్రీ కలిగి ఉన్నా ఫర్వాలేదు.

పరీక్ష[మార్చు]

CFP సర్టిఫికేషన్‌ పరీక్ష పది గంటల పాటు మల్టిపుల్‌ చాయిస్‌లో జరుగుతుంది. ఇది మూడు సెషన్‌లలో జరుగుతంది. మొదటిది నాలుగు గంటలు (శుక్రవారం మధ్యాహ్నం), రెండు మూడేసి గంటల సెషన్‌లు (శనివారం) ఈ పరీక్ష జరుగుతంది. ఇందులో మూడు పెద్ద వాస్తవ సమస్యలను కూడా పరిష్కరించాలి. ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి వాస్తవంలో ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనే సామర్ధ్యం విద్యార్థికి ఉందా లేదా అనేది పరిశీలించడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఈ పరీక్షను 1993లో తప్పనిసరి చేశారు. ఆ సమయంలో ఈ పరీక్షలో పాస్‌ కాకపోయినా CFP లభించేది.

పని అనుభవం[మార్చు]

పరీక్ష పాస్‌ అయిన తర్వాత, ఆర్థిక ప్రణాళిక విభాగంలో ఆ వ్యక్తి కచ్చితంగా కొంత అనుభవాన్ని పొందాలి. CFP బోర్డు నిర్వచనం ప్రకారం పని అనుభవం అంటే పర్యవేక్షణ, ప్రత్యక్ష మద్దతు, అన్ని వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల గురించి కక్షిదారున‌కు నేరుగా బోధించడం.[9] మరియు ఇలాంటి అనుభవం ఆర్థిక ప్రణాళికలో కింద పేర్కొన్న ఆరు అంశాలలో కనీసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంశాల పరిధిలో ఉండాలి.

 • కక్షిదారుని‌ సంబంధాల గురించి తెలుసుకోవడం మరియు నిర్వచించడం
 • కక్షిదారుని‌ యొక్క సమాచారాన్ని, లక్ష్యాలను సేకరించడం
 • కక్షిదారుని‌ యొక్క ఆర్థిక స్థితిని విశ్లేషించడం, విలువకట్టడం
 • ఆర్థిక ప్రణాళికకు సంబంధించి సిఫార్సు‌లను సమర్పించడం మరియు వాటిని అభివృద్ధి చేయడం.
 • ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన సిఫార్సుల‌ను ఆచరణలో పెట్టడం
 • ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన సిఫార్సులను పర్యవేక్షించడం.

విద్యార్థులు పరీక్ష పాసయ్యి, ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ఈ ఆరు ప్రాథమిక అంశాలను కూడా పూర్తి చేసుకున్నాక, అతడు లేదా ఆమె కింద అంశాలను కూడా పూర్తి చేయాలి.

 • ఆర్థిక ప్రణాళిక విభాగంలో మూడేళ్ల పాటు పూర్తి స్థాయిలో లేదా సమానంగా (ఏడాదికి 2 వేల గంటలు) పార్ట్‌టైమ్‌ అనుభవం గడించాలి.
 • ఆరంభంలో సర్టిఫికేషన్‌ సమయంలోనే CFP బోర్డు యొక్క అనుమతిని పొందాలి, ఇందులో పూర్తి స్థాయిలో విద్యార్థి యొక్క గతాన్ని సమీక్షిస్తారు. ఇందులో విలువలు, వ్యక్తిత్వం‌, నేరచరిత్ర‌ అంశాల గురించి విచారణ ఉంటుంది.

విలువలు మరియు చదువును కొనసాగించడం[మార్చు]

ఇక ఇందులో చివరి అంశం విలువలు మరియు చదువును కొనసాగించే అంశాలను పూర్తి చేయడం.[10] విద్యార్థులు మరియు సర్టిఫికెట్‌ కోరుకునేవారు, CFP బోర్డు యొక్క విలువల కోడ్‌ను కచ్చితంగా పాటించాలి మరియు ఆర్థిక ప్రణాళిక ఆచరణ‌ ప్రమాణాలకు సంబంధించి వృత్తిపరమైన బాధ్యతలు కలిగి ఉండాలి. నమోదు చేసుకున్న పెట్టుబడి సలహాదారులు, పెట్టుబడుల గురించి పూర్తి అప్రమత్తంగా, బాధ్యతతో మెలగాలి.[11] క్రమశిక్షణ నిబంధనలు, పద్ధతి ప్రకారం వీరిని ఎప్పుడైనా తొలగించే అధికారం CFP బోర్డుకు ఉంది.

హెదాను కొనసాగించుకునేందుకు, లైసెన్స్‌ పొందిన వారు ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫీజు చెల్లించడంతో పాటు, దీనికి అవసరమైన నిరంతరం కొనసాగే చదువును కూడా కొనసాగిస్తూ ఉండాలి.[12]

సంబంధిత హోదాలు[మార్చు]

 • చార్టర్డ్‌ ఆర్థిక కన్సల్టెంట్‌
 • చార్టర్డ్‌ మార్కెట్‌ టెక్నీషియన్‌
 • చార్టర్డ్‌ ఆర్థిక విశ్లేషణదారుడు
 • చార్టర్డ్‌ ప్రత్యామ్నాయ పెట్టుబడుల విశ్లేషణదారుడు
 • చార్టర్డ్‌ ధృవీకృత అకౌంటెంట్‌
 • సర్టిఫైడ్‌ పబ్లిక్‌ అకౌంటెంట్‌
 • సర్టిఫైడ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌
 • సర్టిఫైడ్‌ విలువలు తెలిపే విశ్లేషణదారుడు
 • చార్డర్డ్‌ ఆర్థిక కన్సల్టెంట్‌
 • సర్టిఫైడ్‌ పెట్టుబడుల నిర్వహణ విశ్లేషణ దారుడు

వీటిని కూడా చూడండి[మార్చు]

 • రిజిస్టర్డ్‌ పెట్టుబడుల సలహాదారు
 • ఫి-ఓన్లీ ఆర్థిక సలహాదారు
 • సెక్యూరిటీ పరీక్షల జాబితా

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]