ధ్యాన్ చంద్
![]() | |||||||||||||||||||||||
| వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జననం |
1905 ఆగస్టు 29 [1] అలహాబాద్,[2] ఉత్తర ప్రదేశ్ | ||||||||||||||||||||||
| మరణం |
1979 డిసెంబరు 3 (వయసు: 74) ఢిల్లీ | ||||||||||||||||||||||
| ఎత్తు | 5 ft 7 in (170 cm) | ||||||||||||||||||||||
| ఆడే స్థానము | ఫార్వార్డ్ | ||||||||||||||||||||||
| క్రీడా జీవితము | |||||||||||||||||||||||
| సంవత్సరాలు | Team | Apps | (Gls) | ||||||||||||||||||||
| 1921–1956 | భారత సైన్యం | ||||||||||||||||||||||
| జాతీయ జట్టు | |||||||||||||||||||||||
| 1926–1948 | భారత హాకీ జట్టు | {{{nationalcaps(goals)1}}} | |||||||||||||||||||||
సాధించిన పతకాలు
| |||||||||||||||||||||||
ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు.[3] గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు. ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం చూసి గోల్పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ ను కోరగా అది సరియైన గుర్తింపుగా అందరి మన్ననలు పొందారు. తద్వారా ఆయనకి ఆటమీద గల అభిమానం తెలియజేస్తుంది.
ధ్యాన్ చంద్ పేరు మీద భారత ప్రభుత్వం భారత అత్యున్నత క్రీడా అవార్డు "మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న" గా ప్రకటించింది.[4]
బాల్యం
[మార్చు]ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29 న అలహాబాదులో ఒక బైస్ రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు.[5][6] అతని తల్లిదండ్రులు శారద సింగ్,[7] సమేశ్వర్ దత్ సింగ్ బైస్.[8][9] తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాడు. అక్కడ ఆయన ఆర్మీ తరఫున హాకీ ఆడేవాడు. ధ్యాన్ చంద్ కి మూల్ సింగ్, రూప్ సింగ్ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. రూప్ సింగ్ కూడా హాకీ క్రీడాకారుడే. తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండటం వల్ల వీరి కుటుంబం అనేక ప్రాంతాలలో నివాసం ఉన్నారు. ధ్యాన్ చంద్ కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే బడిలో చదివాడు. చివరికి వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో స్థిరపడింది.
ధ్యాన్ చంద్ ఆలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదివాడు. తర్వాత 1932 లో గ్వాలియర్ లోని విక్టోరియా కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. తండ్రి మిలిటరీ సేవకుగాను వారికి ఒక ఇంటిస్థలం లభించింది. బాల్యంలో ఆటల వైపు అంతగా ఆసక్తి చూపేవాడు కాదుకానీ కుస్తీలో మాత్రం పాల్గొనేవాడు. ఈయన ఆర్మీలో చేరక ముందు వరకు పెద్దగా హాకీ ఆడింది లేదని చెప్పాడు. అప్పుడప్పుడు మాత్రం ఝాన్సీలో తన స్నేహితులతో కలిసి సరదాగా ఆటలు ఆడేవాడు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Indian hockey's famous legend Dhyan Chand's resume". Mid Day. 3 December 2015. Archived from the original on 1 April 2016. Retrieved 1 April 2016.
- ↑ Dharma Raja, M.K. "HOCKEY WIZARD DHYAN CHAND REMEMBERED". Press Information Bureau. Government of India. Archived from the original on 1 April 2016. Retrieved 1 April 2016.
- ↑ "Dhyan Chand (Indian athlete)". Encyclopædia Britannica.
- ↑ "ఖేల్ రత్న అవార్డు". the hindu.
{{cite web}}: CS1 maint: url-status (link) - ↑ Dhyan Chand (1952). Goal! Autobiography of Hockey Wizard Dhyan Chand. Chennai: Sport & Pastime. p. 2.
I was born in Allahabad on August 29, 1905. I come from a Rajput family which settled in Allahabad and later migrated to Jhansi.
- ↑ "The legend of Dhyan Chand". The Hindu. 29 August 2017. Retrieved 2020-08-29.
- ↑ "Major Dhyan Chand Biography: Know the Story Behind Nickname 'Hockey Wizard' of Greatest Indian Field Hockey Player". Jagranjosh.com (in ఇంగ్లీష్). 2024-08-28. Retrieved 2025-07-18.
- ↑ Majumdar, Boria; Mehta, Nalin (2009). India and the Olympics. Routledge. p. 272. ISBN 978-1-135-27574-7.
- ↑ "Dhyan Chand Singh Bais". Dhyan Chand Foundation (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-08-18. Retrieved 2025-07-18.
- ↑ "Dhyan Chand Profile – Indian Hockey Player Dhyan Chand Biography – Information on Dhyan Chand". www.iloveindia.com. Archived from the original on 8 ఆగస్టు 2016. Retrieved 23 August 2016.
- CS1 maint: url-status
- Pages using infobox3cols with undocumented parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1905 జననాలు
- 1979 మరణాలు
- భారతీయ హాకీ క్రీడాకారులు
- 1928 సమ్మర్ ఒలంపిక్స్ లోని ఫీల్డ్ హాకీ ఆటగాళ్ళు
- పద్మభూషణ పురస్కార గ్రహీతలు
- ఉత్తర ప్రదేశ్ క్రీడాకారులు
- అలహాబాద్ వ్యక్తులు
- భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు
- భారతీయ క్రీడాకారులు
