Jump to content

ధ్రువ్ జురెల్

వికీపీడియా నుండి
ధ్రువ్ జురేల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ధ్రువ్ చంద్ జురేల్
పుట్టిన తేదీ (2001-01-21) 2001 జనవరి 21 (age 24)
ఆగ్రా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
ఎత్తు1.8 మీ. (5 అ. 11 అం.)
బ్యాటింగుకుడిచేతి
పాత్రవికెట్-కీపర్-బ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 312)2024 15 ఫిబ్రవరి - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2024 22 నవంబర్ - ఆస్ట్రేలియా తో
తొలి T20I (క్యాప్ 112)2024 6 జూలై - జింబాబ్వే తో
చివరి T20I2024 7 జూలై - జింబాబ్వే తో
T20Iల్లో చొక్కా సంఖ్య.16
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2021–ప్రస్తుతంఉత్తరప్రదేశ్
2023-ప్రస్తుతంరాజస్థాన్ రాయల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ టీ20ఐ ఫస్ట్-క్లాస్ టీ20
మ్యాచ్‌లు 4 4 22 42
చేసిన పరుగులు 202 12 1,235 451
బ్యాటింగు సగటు 40.40 4.00 45.74 19.60
100లు/50లు 0/1 0/0 1/9 0/2
అత్యుత్తమ స్కోరు 90 6 249 56*
క్యాచ్‌లు/స్టంపింగులు 6/2 4/1 57/6 25/2
Medal record
పురుషుల క్రికెట్
Representing  భారతదేశం
ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్
Runner-up రన్నరప్ 2020 ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ - దక్షిణాఫ్రికా
మూలం: [1]

ధ్రువ్ చంద్ జురెల్ (జననం 21 జనవరి 2001) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. ఆయన కుడిచేతి బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్. జురెల్ దేశీయ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరపున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆయన 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత అండర్-19 జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు.[1][2]

దేశీయ కెరీర్

[మార్చు]

ధ్రువ్ జురెల్ 14 సంవత్సరాల వయసులో తన పాఠశాలలో వేసవి శిబిరంలో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[3] ఆయన ఆ తర్వాత ఆగ్రాలోని తన ఇంటిని విడిచిపెట్టి ఢిల్లీ శివార్లలోని నోయిడాలోని క్రికెట్ అకాడమీలో శిక్షణ కోసం వెళ్ళాడు.ధ్రువ్ జురెల్ ఉత్తర ప్రదేశ్ అండర్-14, అండర్-16, అండర్-19 జట్ల తరపున యూత్ క్రికెట్ ఆడాడు.

జురెల్ 2020–21 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ తరపున 2021 జనవరి 10న తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] ఆయన ట్వంటీ20 అరంగేట్రానికి ముందు 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.[5]

జురెల్ ఫిబ్రవరి 2022లో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది.[6] ఆయన ఫిబ్రవరి 17న ఉత్తరప్రదేశ్ తరపున 2021–22 రంజీ ట్రోఫీలో తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[7] జురెల్ 2023 ఏప్రిల్ 5న గౌహతిలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసి 32*(15) పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన జట్టులో జురెల్ స్థానాన్ని సుస్థిరం చేసింది.

జురెల్ 2023 జూలై 14న ఇండియా ఏ తరపున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏ తో జరిగిన 2023 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో లిస్ట్ ఏ అరంగేట్రం చేశాడు.[8]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ధ్రువ్ జురెల్ జనవరి 2024లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్ట్‌లకు తన తొలి భారతీయ కాల్-అప్‌ను పొందాడు.[9] ఆయన ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో భారతదేశం తరపున తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. జురెల్ తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో 104 బంతుల్లో 46 పరుగులు చేశాడు, రెండవ ఇన్నింగ్స్‌లో భారత్ నాల్గవ రోజు భోజనం తర్వాత 430/4 వద్ద డిక్లేర్ చేయడంతో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.

జురెల్ రాంచీలో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 90 పరుగులు చేసి, భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆయన రెండవ ఇన్నింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్‌తో కలిసి కీలకమైన 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను విజయపథంలో నడిపించాడు, 77 బంతుల్లో 39* పరుగులు చేశాడు. జురెల్ రెండు ఇన్నింగ్స్‌లలో కీలకమైన ఇన్నింగ్స్‌లకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1 తేడాతో భారత్‌ నిలిచింది.

మూలాలు

[మార్చు]
  1. "Dhruv Jurel". ESPNcricinfo. Retrieved 10 January 2021.
  2. "Dhruv Jurel: The inspiring journey of Kargil war veteran's son who is now India's newest Test cricketer" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-03-10. Retrieved 25 February 2024.
  3. Sanju (2023-03-10). "Dhruv Jurel Biography in Hindi. ध्रुव जुरेल का जीवन परिचय" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-03-11. Retrieved 2023-03-11.
  4. "Elite A, Bengaluru, Jan 10 2021, Syed Mushtaq Ali Trophy". ESPNcricinfo. Retrieved 10 January 2021.
  5. "Four-time champion India announce U19 Cricket World Cup squad". Board of Control for Cricket in India. Retrieved 2 December 2019.
  6. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPNcricinfo. Retrieved 13 February 2022.
  7. "Elite, Group G, Sultanpur, Feb 17 - 20 2022, Ranji Trophy". ESPNcricinfo. Retrieved 17 February 2022.
  8. "3rd Match, Group B, Colombo (SSC), July 14, 2023, ACC Men's Emerging Cup". ESPNcricinfo. Retrieved 17 July 2023.
  9. "Dhruv Jurel 'living the dream' with maiden Test call-up after years of struggle: Was shocked to see my name". India Today. February 2024. Retrieved 3 February 2024.