ధ్వాళ్ ఆంగళ్
(ధ్వాళ్ అంగళ్ నుండి దారిమార్పు చెందింది)
ధ్వాళ్ ఆంగళ్ లంబాడీ గిరిజన ప్రజల దేవత. లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను పూజిస్తారు. వారిలో త్వళ్జ ఒకరు.[1]
లంబాడీ సంస్కృతిలో ధ్వాళ్ ఆంగళ్ దేవత[మార్చు]
తండాలో ఏ కార్యం జరిగినా పెళ్ళి, పుట్టుకలు, చావులు, పండుగలు అయినా సామూహికంగా తండా పెద్దలే జరిపించేవారు. పెళ్ళి అయితే ఆ తండాలో ఉన్న ప్రతి ఒక్కరూ కలిసిపోయేవారు. ఇంటిల్లిపాదీ భోజనంచేసేవారు. ప్రతి మనిషి తంతులో పాల్గొనాల్సిందే. పాటలతో లంబాడీలు తరతరాలుగా ఏడుగురు దేవతలను కొలుస్తారు. వారు మేరమ్మ, త్వళ్జ, సీత్ల, మంత్రల్, హింగ్ల, ధ్వాళ్ ఆంగళ్, కంకాళీ.
అడవిలో ఉండే పక్షులు, జంతువులు బాగుండాలని వన సంరక్షణలో జంతువులు కాపాడబడాలని పాలపిట్ట, పక్షి రోజు తండాకు కనబడిపోవాలని ధ్వాళ్ ఆంగళ్ దేవతను ఆరాధిస్తారు.
మూలాలు[మార్చు]
- ↑ "బంజారా సంస్కృతి-సీత్లా భవాని పండుగ | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-07-09.
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |