Jump to content

నంగారా భవన్

వికీపీడియా నుండి

నంగారా భవన్ మహారాష్ట్ర లోని, వాశిం జిల్లా మనోర తాలుకా లోని పోహ్రాదేవి తీర్థ క్షేత్రంలో బంజారా సంస్కృతి సంప్రదాయాలు పత్రిబింబించే విధంగా‌ 900 కోట్ల రూపాయిలతో నంగారా భవన్ నిర్మించి బంజారా మ్యూజియం ఏర్పాటు చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించాడు[1][2][3].

నంగారా భవన్ పోహ్రాదేవి
బంజారా నంగారా భవన్
సాధారణ సమాచారం
నిర్మాణ శైలినగారా ఆకృతి
చిరునామామహారాష్ట్ర , బంజారా కాశీ
పోహ్రాదేవి తీర్థ క్షేత్రం 444404
తెలంగాణ, భారతదేశం
ప్రస్తుత వినియోగదారులుభారతదేశం లోని బంజారా ప్రజలు
నిర్మాణ ప్రారంభం3 డిసెంబర్ 2018
పూర్తి చేయబడినది5 అక్టోబరు 2024; 58 రోజుల క్రితం (2024-10-05)
వ్యయం900 కోట్ల రూపాయలు
క్లయింట్మహారాష్ట్ర ప్రభుత్వం
సాంకేతిక విషయములు
నిర్మాణ వ్యవస్థదక్షిణ భారతదేశం, హిందూ దేవాలయం
పరిమాణం12 ఎకరాల విస్తీర్ణం
నేల వైశాల్యం522,720 sq ft (48,562 మీ2)
నగారా భవన్ ఆలయంలో సంత్ సేవాలాల్ మహరాజ్ యొక్క విగ్రహాం.

చరిత్ర

[మార్చు]

నంగారా భవన్ ను మహారాష్ట్ర లోని‌ మనోర్ తాలుకా పోహ్రాదేవి తీర్థ క్షేత్రం లోని విశాలమైన పన్నెండు ఎకరాల స్థలంలో ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేయడం జరిగింది.అందులో బంజారా సంస్కృతిలో అంతర్భాగమైన బంజారా ప్రజల యొక్క ప్రసిద్ధ వాయుద్యమైన నగారా ఆకృతిలో అద్భుతమైన నిర్మాణం చేపట్టారు.అందులో దేశంలోని ఉన్న పదిహేను కోట్ల బంజారా ప్రజల చరిత్ర, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం ఇవి బంజారా సమాజం యొక్క సృజనాత్మక స్పూర్తి చాతుర్యానికి నిదర్శనం అని చెప్పవచ్చును.

నిధులు మంజూరు

[మార్చు]

15 కోట్ల బంజారా ప్రజల ఆధ్యాత్మిక తీర్థ క్షేత్రం పోహ్రాగడ్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ధవ్ ఠాక్రే వారి ఆధ్వర్యంలో నంగారా భవన్ నిర్మాణానికి 900 కోట్ల రూపాయల మహారాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.తేదీ 3 డిసెంబర్ 2018 న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ భావు రాథోడ్ తో కలిసి నంగారా భవన్ వాస్తు సంగ్రాలయం భూమి పూజ చేయడం జరిగింది.

భవన ప్రారంభం

[మార్చు]

5 అక్టోబర్ 2024 న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంజారాల కాశీలో కొలువైన శ్రీ సంత్ సేవా లాల్ మహారాజ్ సమాధి స్థానానికి నిలయం, జగదాంబ దేవి ఆలయాన్ని సందర్శించి నూతనంగా నిర్మించిన నగారా ఆకృతిలో ఉన్న నంగారా వాస్తు మ్యూజియం ప్రారంభించాడు.ఆలయం దర్శించుకునేందుకు తోలి సారి వచ్చిన ఆయన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే,ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్,యవత్మాల్ శాసనసభ్యులు అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ తో కలిసి ప్రారంభించాడు

మ్యూజియం ఏర్పాటు

[మార్చు]

ఐదు అంతస్తుల మ్యూజియంలో 150 అడుగుల సేవాధ్వజ్ , సంత్ సేవాలాల్ యొక్క తెల్లని రంగులో ఉన్న జెండా, సంత్ సేవాలాల్ మహరాజ్ యొక్క గుర్రపు స్వారీ విగ్రహాం కూడా చూడవచ్చు. మ్యూజియం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఫ్లయింగ్ థియేటర్లు 3 డి డోమ్లు, సందర్శకులు లీనమయ్యే విధంగా ఫిజికల్ రిక్రియేషన్లు, 3డి హోలోగ్రాఫిక్ ప్రాజెక్షన్లు ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ లు గ్రాఫిక్స్ ప్యానెల్స్ కటౌట్లు పర్చువల్ రియాలిటీ ఎగ్జామినేషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.మ్యూజియంలో బంజారా ఆచారాలు, వస్త్రధారణ, ఆభరణాలు , బంజారా ప్రజల భౌతిక సంస్కృతి యొక్క ఇతర కోణాలను కూడా ప్రదర్శించారు. ఇందులో చరిత్ర కారులు, పండితులు, విద్యావేత్తలు సామాన్య ప్రజలను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. బంజారా సమాజానికి పట్టం కట్టే బంజారాల కళా వైభవాన్ని చాటి చెప్పుతుంది[4].

మూలాలు

[మార్చు]
  1. "Modi to sound poll nagara with Oct 5 visit to Banjara deity Pohradevi". The Times of India. 2024-09-22. ISSN 0971-8257. Retrieved 2024-12-01.
  2. "బంజారాల ఇతిహాసాన్ని వెలికితీసిన ప్రధాని | - | Sakshi". sakshi.com. Retrieved 2024-12-01.
  3. "PM Modi to Inaugurate 'Banjara Virasat' Nangara Bhavan at Pohradevi on October 5". www.nagpurtrends.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-12-01.
  4. "Nangara Bhavan – A world class museum inaugurated". Banjarasthan (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2024-10-06. Retrieved 2024-12-01.