నందన చక్రవర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నందన చక్రవర్తి 10వ శతాబ్దము లో ప్రస్తుత కర్నూలు జిల్లా ప్రాంతమును పరిపాలించిన రాజు.[1] నందన చక్రవర్తి ఉత్తరాది నుండి 500 బ్రాహ్మణ కుటుంబములను ఈ ప్రాంతమునకు ఆహ్వానించి వారికి బనగానపల్లె దగ్గరి నందవరము గ్రామమును అగ్రహారముగా ఇచ్చెను. అందువల్ల వారిని "నందవారిక్స్" అని పిలిచేవారు. చౌడేశ్వరి మహాత్మ్యం ప్రకారం నంద లేదా నందన అనే క్షత్రియుడు పాండవుల వంశానికి చెండిన వాడనీ, చంద్రవంశానికి చెందినవాడని తెలుస్తుంది. [2] ఈ పురాణం ప్రకారం ఈ వంశం పాడవుల కాలం నాటి క్షత్రియులైన క్రమం పాండురాజు, కిరీటి, అభిమన్యుడు, పరీక్షిత్తుడు, జనమేజయుడు, శతానికుడు, ధన్వ, అశ్వదేధ దత్త, క్షేమేంద్ర, సోమేంద్ర, ఉత్తుంగభుజ ల తరువాత నంద చక్రవర్తి గా తెలుపుతుంది. ద్వాపరయుగం లో పరిపాలించిన పరీక్షిత్తు నుండి కలియుగంలో పరిపాలించిన నంద చక్రవర్తి వరకు 10 తరాలుగా ఉన్నట్లు తెలుస్తుంది. దీని ఆధారంగా అతని కాలం క్రీ.శ1059 అయి ఉండవచ్చు.

ఈ నందన ‘చక్రవర్తి’ భారతదేశ చరిత్రకు సంబంధించిన ఏ పుస్తకాల్లోనూ ప్రస్తావించబడలేదు. అతని పాలన, మనుగడ కాలం యొక్క వివరాలను స్థాపించడం కష్టం. ఏదేమైనా, నందా వృషణాల వ్యాధితో మరణించాడని, నంద్యాల చుట్టూ ఉన్న అతని రాజ్యానికి వారసులు లేరని చెబుతారు. తన అసలు రాజధాని నగరం 'ఆనందవరపురంను భ్రాహ్మణులకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది చరిత్ర పుస్తకాలలో ప్రస్తావించకపోయినప్పటికీ ఆ బహుమతి పొందిన బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారసులు ఇంకా అక్కడ ఉన్నారు. కనుక అతని ఉనికి కల్పితం కాదని తెలుస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-02.
  2. "Welcome to Nandavareeka". nandavareeka.com. Retrieved 2020-07-02.

పుస్తక మూలములు[మార్చు]

  • A Manual of Kurnool District in the Presidency of Madras - Narahari Gopalakristnamah Chetty Pub. Government press, Madras. 1886.