నందిని రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందిని రాయ్
Nandini Rai.jpg
జననంనీలం
(1990-09-18) 1990 సెప్టెంబరు 18 (వయస్సు: 29  సంవత్సరాలు)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2010–ప్రస్తుతం

నందిని రాయ్ (నీలం గౌహ్రానీ)[1][2] తెలుగు చలనచిత్ర నటి, మోడల్. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది.[3]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

నందిని 1990, సెప్టెంబరు 18న హైదరాబాదులోని సింధీ కుటుంబంలో జన్మించింది.[1][2] హైదరాబాదులోని సెయింట్ ఆల్బన్స్ హైస్కూల్ నుండి 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నందిని, లండన్‌లో ఫైనాన్స్ లో ఎం.బి.ఏ. డిగ్రీని పూర్తి చేసింది.

మోడలింగ్[మార్చు]

80కిపైగా జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని, అనేక అందాల పోటీలలో గెలిచింది. 2008లో మిస్ హైదరాబాద్ 2008, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వంటి బహుమతులు అందుకుంది.[4]

సినీరంగ ప్రస్థానం[మార్చు]

ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ చిత్రంలో, మాయ, మోసగాళ్ళకు మోసగాడు అనే తెలుగు చిత్రాలలో నటించింది.[4] 2012లో లాగిన్ అనే బాలీవుడ్ చిత్రంలో కూడా కనిపించింది.[2] ఎ. సాజీద్ దర్శకత్వం వహించిన గుడ్‌బై డిసెంబర్ చిత్రంతో మలయాళంలోకి,[4] 2014లో ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో ఖుషి ఖుషియాగి చిత్రంతో కన్నడంలోకి,[5][6] 2018లో గ్రహణం చిత్రంతో తమిళంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం తెలుగులో సుడిగాడు 2 సినిమాలో నటిస్తుంది.[7]

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2011 ఫ్యామిలీ ప్యాక్ సుల్తానా హిందీ
2011 040 తెలుగు
2012 హార్మోన్స్ సౌమ్య నాయక్ తెలుగు
2012 లాగిన్ దివ్య హిందీ
2013 గుడ్‌బై డిసెంబర్ మలయాళం తొలిచిత్రం
2014 మాయ వైశాలి తెలుగు
2015 ఖుషి ఖుషియాగి ప్రియ కన్నడం తొలిచిత్రం
2015 మోసగాళ్ళకు మోసగాడు జానకి తెలుగు
2018 గ్రహణం తమిళం నిర్మాణంలో ఉంది
2018 సిల్లీ ఫెలోస్ పుష్ప తెలుగు
2019 శివరంజని శివరంజని తెలుగు

టీవీరంగం[మార్చు]

నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ పోటీదారులలో ఒకరైన నందిని,[3] 2018, ఆగస్టు 5న షో నుండి పంపించబడింది.[8]

సంవత్సరం సిరీస్ పాత్రపేరు ఛానల్ పేరు భాష మూలాలు
2019 హై ప్రీస్టెస్ రూబీ జీ5 తెలుగు ప్రసారం[9]
2018 బిగ్ బాస్ తెలుగు స్టార్ మా తెలుగు హాట్ స్టార్

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 New ‘naughty’ girl in town, Retrieved 25 August 2019
  2. 2.0 2.1 2.2 Asha Prakash, TNN (27 February 2012). "Who inspired Nandini Rai's makeover? - Times Of India". Articles.timesofindia.indiatimes.com. Retrieved 25 August 2019. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 "Who is Bigg Boss 2 Contestant Nandini Rai?". Cite web requires |website= (help)
  4. 4.0 4.1 4.2 Anasuya Menon (25 February 2012). "Hello Mollywood!". The Hindu. Retrieved 25 August 2019. Cite web requires |website= (help)
  5. "It's final, Ganesh's next is Kushi Kushiyalli - Times of India". Cite web requires |website= (help)
  6. "Nandini Rai comes between Ganesh and Amoolya - Times of India". Cite web requires |website= (help)
  7. "Nandini Rai to debut in Tamil - Times of India". Cite web requires |website= (help)
  8. "NewsDog - India News - NewsDog". www.newsdogapp.com.
  9. "Telugu web series 'High Priestess' explores psychic world". Cite web requires |website= (help)

ఇతర లంకెలు[మార్చు]