నందివాడ (పొందూరు)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నందివాడ, శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలానికి చెందిన గ్రామము.[1] ఈ గ్రామంలో ప్రఖ్యాత వ్యక్తి అయిన బాలయోగీశ్వర స్వామి ఆలయం ఉంది. వీరు నందివాడ బాలయోగీశ్వరులుగా పిలువబడుతున్నారు. ఆయన నిరంతర తపస్సులో ఉంటారు. పసి ప్రాయంనుండి నిరంతర సాధనలో ఉందురు. శివరాత్రి నాడు ఆయన ప్రజలకు దర్శనమిస్తారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఆ దినము ఈ గ్రామానికి వచ్చి ఆయనను సేవించు కుంటారు. ఆయన ఆశ్రమం, శివాలయం,వంటి ఆలయాలు ఇచట ఉన్నాయి. ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ గ్రామం లోలుగు గ్రామమునకు 3 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలో విద్యార్థులు ఉన్నత విద్యను లోలుగులో గల ఉన్నత పాఠశాలనందు అభ్యసిస్తారు.ఇక్కడ యువకులు శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం అను ఒక సంస్దను స్థాపించి దాని ద్వారా గ్రామ విద్యార్థులకు విద్య, భగవద్గీత, యోగా లలో శిక్షణ ఇస్తున్నారు.దీనికి కార్యనిర్వహణాధికారిగా పిసిని సతీష్ వ్యవహరిస్తున్నారు.

నందివాడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం పొందూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,064
 - పురుషుల సంఖ్య 539
 - స్త్రీల సంఖ్య 525
 - గృహాల సంఖ్య 262
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,064 - పురుషుల సంఖ్య 539 - స్త్రీల సంఖ్య 525 - గృహాల సంఖ్య 262

మూలాలు[మార్చు]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11