Jump to content

నంది నాటక పరిషత్తు - 2000

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు. మూడవ నంది నాటకోత్సవం (నంది నాటక పరిషత్తు - 2000) 2001, మే 28 నుండి జూన్ 4 వరకు హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో నిర్వహించబడింది.[1]


ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు

[మార్చు]

తుది పోటీల న్యాయనిర్ణేతలు

[మార్చు]

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

[మార్చు]

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఇచ్చే పురస్కారం 2000 సంవత్సరానికి గాను జోలేపాళెం సిద్ధప్పనాయుడు (పద్యనాటకం) గారికి అందజేశారు.[2]

బహుమతులు

[మార్చు]

పద్యనాటకం

[మార్చు]
  • ఉత్తమ ప్రదర్శన: మహాకవి కాళిదాసు (సంస్కార భారతి, హైదరాబాదు)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: తిరుపతమ్మ కథ (శ్రీ విజయలక్ష్మీ శ్రీనివాస నాట్య మండలి, తెనాలి)
  • ఉత్తమ దర్శకుడు: వేమూరి రాధాకృష్ణమూర్తి (మహాకవి కాళిదాసు)
  • ఉత్తమ నటుడు: భాగి శివశంకరశాస్త్రి (మహాకవి కాళిదాసు)
  • ఉత్తమ నటి: రమణ కుమారి (తిరుపతమ్మ కథ)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: తడకమళ్ళ రామచంద్రరావు (ఉషా పరిణయం)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: బి.వి.ఎ. నాయుడు (శశిరేఖా పరిణయం)
  • ఉత్తమ హాస్య నటుడు: వి. బాబూరావు (శ్రీకృష్ణ నారదీయం)
  • ఉత్తమ రచయిత: పల్లేటి లక్ష్మీకులశేఖర్ (శ్రీరామ పాదుకలు)
  • ఉత్తమ బాల నటుడు: బి.పి. యోగిబాబు (శ్రీకృష్ణ నారదీయం)
  • ఉత్తమ సంగీతం: ఆళ్లగడ్డ శ్రీనివాసరావు (శ్రీరామ పాదుకలు)
  • ఉత్తమ ఆహార్యం: ఎం. రామలింగమూర్తి (శ్రీకృష్ణాభిమన్యు)
  • ఉత్తమ రంగాలంకరణ: సురభి లీలా పాపారావు అండ్ సన్స్ (ఉషా పరిణయం)
  • ప్రత్యేక బహుమతి: సి.హెచ్. నాంచారయ్య (శ్రీకృష్ణ నారదీయం)

సాంఘీక నాటకం

[మార్చు]
  • ఉత్తమ ప్రదర్శన: ప్రతిస్పందన (వంశీ నిరంజన్ కళాకేంద్రం, హైదరాబాద్)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: ప్రేమ సామ్రాజ్యం (కళాదర్శిని విజయవాడ)
  • ఉత్తమ దర్శకుడు: బి.పి. ప్రసాదరావు (ప్రతిస్పందన)
  • ఉత్తమ నటుడు: బి.పి. ప్రసాదరావు (ప్రతిస్పందన)
  • ఉత్తమ నటి: బి. విజయరాణి (నాన్నా బొమ్మ కావాలి)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: కొండవలస లక్ష్మణరావు (కేళి విలాసం)
  • ఉత్తమ పాత్రోచిత నటి: ఎ. కళ్యాణి (ప్రతిస్పందన)
  • ఉత్తమ హాస్య నటుడు: కె.వి. శాస్త్రి (ఎయిర్ ఇండియా)
  • ఉత్తమ సంగీతం: కె. జేసుదాసు (ప్రేమ సామ్రాజ్యం)
  • ఉత్తమ ఆహార్యం: సురభి గణేష్ (ప్రేమ సామ్రాజ్యం)
  • ఉత్తమ రంగాలంకరణ: పి. శేషగిరి, వెంకట్, శ్యామ్ (నాన్నా బొమ్మ కావాలి)
  • ప్రత్యేక బహుమతి: పిళ్లా ప్రసాద్ (ప్రేమ సామ్రాజ్యం)

సాంఘీక నాటిక

[మార్చు]
  • ఉత్తమ ప్రదర్శన: మేలుకొలుపు (ఎల్.వి.ఆర్. క్రియేషన్స్, గుంటూరు)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: వఱడు (సాగరి, చిలకలూరిపేట)
  • ఉత్తమ దర్శకుడు: నాయుడు గోపి (ఎడారి కోయిల)
  • ఉత్తమ నటుడు: కె.పి.వి. ప్రసాదరావు (ఆకలికాలం)
  • ఉత్తమ నటి: వై. జగదీశ్వరి (దోషైచవహ్ని)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: ఎం. ప్రసాదమూర్తి (అలరాస పుట్టిళ్లు)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: పి.వి. రామ్ కుమార్ (ఇప్పుడు)
  • ఉత్తమ హాస్య నటుడు: సాంబశివ (కాకి సందేశం)
  • ఉత్తమ బాల నటుడు: కె. సాయితేజ (మేలుకొలుపు)
  • ఉత్తమ రచన: సి.ఎస్. రావు (మళ్లీ ఎప్పుడొస్తారు)
  • ఉత్తమ సంగీతం: అంబటి విజయరాఘవన్, ఈశ్వరరావు (కరప్షన్)
  • ఉత్తమ ఆహార్యం: కె. భరణి (అలరాస పుట్టిళ్లు)
  • ఉత్తమ రంగాలంకరణ: ఎల్.వి. భూషన్ అండ్ పార్టీ (మళ్లీ ఎప్పుడొస్తారు)
  • ప్రత్యేక బహుమతి: సంజీవి ముదిలి (నిజాయితి)

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.699.
  2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695