నంద కిషోర్ పున్
| నంద కిషోర్ పున్ | |||
2018 లో పన్ | |||
| పదవీ కాలం 2015 అక్టోబరు 31 – 2023 మార్చి 20 | |||
| రాష్ట్రపతి | బిద్యా దేవి భండారి రామ్ చంద్ర పౌడెల్ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | |||
| ముందు | పరమానంద్ ఝా | ||
| తరువాత | రామ్ సహాయ యాదవ్ | ||
పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చీఫ్ కమాండర్
| |||
| పదవీ కాలం 2008 సెప్టెంబరు 12 – 2012 ఏప్రిల్ 12 | |||
| ముందు | పుష్ప కమల్ దహల్ | ||
| తరువాత | పదవి రద్దు చేయబడింది | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1966 అక్టోబర్ 23 రంగ్సీ , రోల్పా , నేపాల్ | ||
| రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
| ఇతర రాజకీయ పార్టీలు | నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) (2015 వరకు) | ||
| జీవిత భాగస్వామి |
హస్తమాలి పున్ (m. 1983) | ||
| సంతానం | 2 | ||
| పూర్వ విద్యార్థి | మహేంద్ర బహుముఖి క్యాంపస్ | ||
నందా కిషోర్ పున్ (నేపాలీ : नन्दकिशोर पुन ; జననం 23 అక్టోబరు 1966) నందా బహదూర్ పున్ అని కూడా పిలుస్తారు, నేపాల్ రాజకీయ నాయకుడు. ఆయన 2015 నుండి 2023 వరకు నేపాల్ రెండవ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.[1] ఆయన నేపాల్‌లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చీఫ్ కమాండర్‌గా, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్ సెంటర్) సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]నందా కిషోర్ పున్ తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు, 17 సంవత్సరాల వయసులో హస్తమాలి పున్‌ను వివాహం చేసుకున్నాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]నంద కిషోర్ పున్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిటీ సెంటర్)లో చేరి 1990లో జిల్లా కేంద్ర కమిటీ సభ్యుడయ్యాడు. ఆయన ఆ తర్వాత పార్టీ యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడయ్యాడు, ఇది 1996లో పీపుల్స్ వార్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది. ఆయన తరువాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) నలుగురు డిప్యూటీ కమాండర్లలో ఒకరిగా నియమితుడై అప్పటి రాయల్ నేపాల్ ఆర్మీకి వ్యతిరేకంగా అనేక యుద్ధాలకు నాయకత్వం వహించాడు.
నంద కిషోర్ పున్ 2015లో జరిగిన నేపాల్ ఉపాధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి 547 ఓట్లకు గాను 325 ఓట్లు అందుకొని దేశ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Nanda Bahadur Pun (Nanda Kishor Pun)". election.ujyaaloonline.com. Archived from the original on 7 December 2016. Retrieved 18 June 2017.
- ↑ "उपराष्ट्रपतिको कार्यालय". vpn.gov.np (in ఇంగ్లీష్). Archived from the original on 3 డిసెంబరు 2017. Retrieved 18 June 2017.
- ↑ "Nanda Kishor Pun elected Nepal's new Vice-President" (in Indian English). The Hindu. 31 October 2015. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.
- ↑ "Nanda Kishor Pun Elected Nepal's New Vice President" (in ఇంగ్లీష్). The New Indian Express. 31 October 2015. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.