Jump to content

నక్షత్రమండలం

వికీపీడియా నుండి

నక్షత్రమండలం అంటే ఖగోళంలో కనిపించే కొన్ని నక్షత్ర సముదాయం. ఇవి చూడటానికి ఒక జంతువు, లేదా పౌరాణిక విషయాలు, లేదా ఏదైనా కదలికలేని ఆకారాన్ని ఏర్పరచినట్లుగా కనిపిస్తాయి.[1]

చరిత్రకు పూర్వమే కొన్ని నక్షత్రమండలాలను నిర్వచించారు. ప్రజలు తమ నమ్మకాలు, అనుభవాలు, విశ్వసృష్టి, పురాణాల కథలను చెప్పడానికి వాటిని ఉపయోగించారు. వివిధ సంస్కృతులు, దేశాలు వారి స్వంత నక్షత్రమండలాలను కనిపెట్టాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో అంతర్జాతీయంగా వీటిని గుర్తించేవరకు వీటి హవా కొనసాగింది. కాలక్రమేణా నక్షత్రమండలాల గుర్తింపు గణనీయంగా మారిపోయింది. చాలా మండలాలు పరిమాణం లేదా ఆకారంలో మార్పు చెందాయి. కొన్ని జనాదరణ పొందాయి, కొన్ని మరుగున పడిపోయాయి. కొన్ని ఒకే సంస్కృతి లేదా దేశానికి పరిమితమయ్యాయి. నక్షత్రమండలాలకు నామకరణం చేయడం, ఖగోళ శాస్త్రవేత్తలకు, నావికులకు నక్షత్రాలను మరింత సులభంగా గుర్తించడంలో సహాయపడింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Definition of constellation". Oxford English Dictionary. Archived from the original on 2 January 2013. Retrieved 2 August 2016.
  2. "Constellation | Definition, Origin, History, & Facts | Britannica". 5 March 2024.