నగరం నిద్రపోతున్న వేళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నగరం నిద్రపోతున్న వేళ
Nagaram Nidrapotunna Vela Movie Poster.jpg
నగరం నిద్రపోతున్న వేళ సినిమా పోస్టర్
దర్శకత్వంప్రేమ్ రాజ్
కథా రచయితప్రేమ్ రాజ్
నిర్మాతనంది శ్రీహరి
తారాగణంజగపతి బాబు
ఛార్మీ కౌర్
ఆహుతి ప్రసాద్
ఛాయాగ్రహణంలక్ష్మీ నరసింహన్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంయశో కృష్ణ
నిర్మాణ
సంస్థ
గురుదేవా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ [1]
విడుదల తేదీ
2011 జూన్ 24 (2011-06-24)
సినిమా నిడివి
133 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నగరం నిద్రపోతున్న వేళ, 2011 జూన్ 24న విడుదలైన తెలుగు సినిమా. గురుదేవా క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నంది శ్రీహరి నిర్మించిన ఈ సినిమాకు ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, ఛార్మీ కౌర్, ఆహుతి ప్రసాద్ నటించగా, యశో కృష్ణ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమ బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[2][3]

కథా సారాంశం[మార్చు]

ఒక తెలుగు న్యూస్ ఛానెల్‌లో పనిచేస్తున్న యువ జర్నలిస్ట్ నిహారిక, 'బోరింగ్' వార్తలను తీసుకువచ్చినందుకు ఆమె యజమాని చేత చివాట్లు తింటుంటుంది. ఆ తరువాత ఆమె కొన్ని వివాదాస్పద విషయాల కోసం వెతకడం ప్రారంభిస్తుంది. అందుకోసం ఆమె రాత్రి ఒంటరిగా హైదరాబాద్‌లోకి వెళుతుంది. తన దగ్గరున్న పెన్ కెమెరాతో ఒక రాజకీయ నాయకుడి రహస్య చర్చను షూట్ చేయడానికి నిహారిక వెలుతుంది. ఆ వీడియో బయటకు వస్తే అతని బండారం బట్టబయలు అవుతుంది. రాత్రి సమయంలో నిహారిక హైదరాబాద్ చీకటి రహస్యాలు చూడటం ప్రారంభిస్తుంది. ఆ సందర్భంలో తాగుబోతు శివరామ ప్రసాద్‌ను కలుస్తుంది. అతనితో కలిసి రాజకీయ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, వాటిని ఆమె ఎలా అధిగమించింది అన్నది మిగతా కథ.

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

నగరం నిద్రపోతున్న వేళ
యశో కృష్ణ స్వరపరచిన సినిమా
విడుదల2011
సంగీత ప్రక్రియపాటలు
నిడివి31:58
రికార్డింగ్ లేబుల్ఆదిత్యా మ్యూజిక్
నిర్మాతయశో కృష్ణ

ఈ సినిమాకు యశో కృష్ణ సంగీతం సమకూర్చాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నటరాజు పూజ (రచన: సుద్దాల అశోక్ తేజ)"  శంకర్ మహదేవన్ 4:42
2. "నిద్ర పోతున్నది (రచన: సుద్దాల అశోక్ తేజ)"  ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం 5:50
3. "సమరసింహ (రచన: గోరటి వెంకన్న)"  గోరటి వెంకన్న 5:50
4. "ఎక్కడి దాకా (రచన: అనంత శ్రీరామ్)"  హరిహరన్, హరిణి 5:45
5. "మా మమ్మీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  రంజిత్, సుచిత్ర 5:06
6. "అక్షరానికి (రచన: సుద్దాల అశోక్ తేజ)"  వందేమాతరం శ్రీనివాస్ 4:31
మొత్తం నిడివి:
31:58

మూలాలు[మార్చు]

  1. "Titles". FilmiB.
  2. "Heading-2". Gulte.com.
  3. "Heading-3". 123Telugu.
  4. "Songs". Raaga.

బయటి లింకులు[మార్చు]