నగరీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నియంత్రనలేని నగరీకరణకు విస్తరిస్తున్న లాస్ ఆంజేలేస్ ప్రాంతం ఒక ఉదాహరణ.[1]

ప్రపంచవ్యాప్త మార్పుల వల్ల నగర విస్తీర్ణము పెరగడాన్ని నగరీకరణ అంటారు. గ్రామీణ ప్రాంతాలనుండి నగర ప్రాంతాలకు జనము నగరానికి వలస వెళ్లడం మరియు జనాభా పెరుగుదల నగరాలలో ఎక్కువగా ఉండుట కూడా నగరీకరణగానే యునైటెడ్ నేషన్స్ లెక్కిస్తున్నది. యునైటెడ్ నేషన్స్ అంచనాల ప్రకారం ప్రపంచంలోని సగం జనాభా 2008 చివరకు నగర ప్రాంతాల్లో నివసించటం ఆరంభిస్తారు.[2]

ఆధునీకరణను, పెరుగుతున్న పారిశ్రామికీకరణను, సాంఘిక ప్రక్రియ ద్వారా జరిగే పద్ధతులలో మార్పులను కూడా నగరీకరణగానే భావించవచ్చు.

కదలిక[మార్చు]

2006 సంవత్సరం నాటికి దేశాల వారిగా నగర జనాభా.[3]

పల్లెల నుండి పొలాలు వదిలి మరింత మంది ప్రజలు పట్టణాలలో నివసించుటకు వెళ్ళుట వలన నగరీకరణ జరుగుచున్నది. పందొమ్మిదవ శతాబ్దం చివరలో చికాగో వంటి నగరాలు, ఒక శతాబ్దం తరువాత షాంఘై పెరిగిన తీరు గ్రామీణ ప్రజల నగర వలస వలసల జరిగినదే. ఈ విధమైన పెరుగుదల అభివృద్ధి చెందుతున్న దేశములలో సాధారణము.

ఇరవయ్యవ శతాబ్దములో ప్రపంచ జనాభా యొక్క వేగవంతమైన పెరుగుదల యుఎన్ 2005 సమీకరణలో ప్రపంచ నగరీకరణ అంచనాలు అందు వివరించబడింది. ప్రపంచ నగర జనాభా ఆశ్చర్యజనకంగా 1900లో 13% (220 మిలియను) నుండి 1950లో 29% (732 మిలియను) మరియు 2005 లో 49% (3.2 బిలియను) కు పెరిగింది. అదే నివేదిక ప్రకారం అ సంఖ్య 2030కి 60% (4.9 బిలియను) కి పెరిగే అవకాశాలు ఉన్నాయి[4]. అయినా ఫ్రెంచి రాజకీయ తత్వవేత్త ఫిలిప్పే బోకియర్ ది ఫ్యుచరిస్ట్ పత్రిక కోసం వ్రాస్తూ "2030 సంవత్సరానికి ప్రపంచ జనాభాలో నగరాలూ పట్టణాలలో వుండే వారి శాతం షుమారుగా 50%,ఇది యునైటెడ్ నేషన్స్ వేసిన 60% అంచనాల కన్నా కొంత తక్కువ ఎందుకంటే వేగంగా జరిగే నగరీకరణలో ఉండే అవకతవకలు నిలబడవు. నగరాలకు మరింత ఎక్కువ సంఖ్యలో జనము తరలిసవస్తారని బోకియర్ మరియు UN చెపుతున్నారు. ఐతే, వాళ్ళలో అనేక మంది ఉండటానికి చోటు లేక చేయడానికి పని లేక నాగారలనుంది వెళ్లిపోతారని బోకియర్ చెపుతున్నారు" అని సూచించింది.[5]

UN స్టేట్ అఫ్ ది వరల్డ్ పాపులేషన్ 2007 నివేదిక ప్రకారం, 2007 సంవత్సర మధ్య కాలములో, చరిత్రలోనే మొదటి సారిగా, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనము నగారాలలో గాని పట్టణాలలో గాని నివసిస్తూ ఉంటారు; దీనిని "అర్బన్ మిలినియం" లేదా 'టిప్పింగ్ పాయింట్' అని చెపుతారు. బావిషయత్తులో నగరాల వృద్దిలో 93% అభివృద్ధి చెందుతున్న దేశాలలో జరుగుతాయని, నగరాల వృద్దిలో 80% ఆసియా మరియు ఆఫ్రికా లో జరుగుతాయని అంచనా.[6][7]

నగరీకరణ రేటులు దేశాలని బట్టి మారుతాయి. యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్డం లలో చైనా, భారత దేశం, స్వాజిలాండ్ లేదా నిగేర్ దేశాలలోకంటే నగరీకరణ స్థాయి చాలా ఎక్కువ. కాని వార్షిక నగరీకరణ రేట్ చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభా తక్కువగా ఉంటుంది కాబట్టి.

Center of São Paulo, one of the largest metropolis in the world.
Center of São Paulo, one of the largest metropolis in the world.

కారణాలు[మార్చు]

ముందరి అమెరికన్ గ్రిడ్ అభివృద్ధి పధ్ధతికు ఇల్లినాయిస్ లోని షికాగో నగరము ఒక ఉదాహరణ.సమమట్టం కాని టోపోగ్రాఫి లో కూడా గ్రిడ్ ఏర్పడుతుంది.
అన్ని సందర్పాలలో నగరీకరణకు అత్యధిక డెన్సిటీ కారణం కాదు.మనిలాలో, ధరలు పెరగడంతో ప్రజలు నాణ్యత తక్కువ ఉన్న మురికి వాడలలో నివసిసిస్తున్నారు.

రవాణాకు అయ్యే సమయం మరియు కర్చులను దగ్గించడానికి, ఉద్యోగం, విద్యా, గృహము, ప్రయాణము వంటి అవసరాలకు అవకాశాలను పెంచుకోవడానికి వ్యక్తిగతంగా మరియు సంస్థాగతంగా చేయబడే ప్రయత్నాల వల్ల నగరీకరణ సహజంగానే జరుగుతుంది. నగరాలలో నివసించడం మూలాన, వ్యక్తులు మరియు కుటుంబాలకు నగరాలలో ఉన్న మార్కెట్ పోటి, బిన్నత్వం మరియు చేరువ వంటి అంశాలను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.

జనము ఆర్థిక అవకాశాల కోసం నగరాలకు కదిలి వెళుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా చిన్నపాటి కుటుంబాలలో, అత్యావసర అవసరాలకు పైన జీవిత స్థాయిని పెంచడం సాధ్యం కాదు. పొలాలలో నివసించడం అనిశ్చయమైన వాతావరణ పరిస్థుతుల మీద ఆధారపడి ఉంటుంది. కరువు, వరద, రోగాలు వచ్చిన సమయాలలో జీవించడం అత్యధిక కష్టసాధ్యమవుతుంది.

దానికి బిన్నంగా, డబ్బు, సేవలు మరియు దనము కేంద్రీకరించి ఉన్న ప్రాంతాలుగా నగరాలు ఉంటాయి. నగరాలలో అధ్రుష్టాలు కలిసివస్తే, సామాజికంగా పైకి ఎదగవచ్చు. ఉద్యోగాలు, దానాలను సృష్టించే వ్యాపారాలు ఎక్కువగా నగరాలలోనే కేంద్రీకరించి ఉంటాయి. విదీశీ ద్రవ్యం, వర్తకము లేదా పర్యాటకుల మూలాన, దేశములోకి నగరాల ద్వారానే వస్తాయి. పొలాలలో నివసించే వారు ఎందుకు నగరాలకు వలస వచ్చి, డబ్బు సంపాదించి, కష్టములో ఉన్న తమ కుటుంబాలకు పంపించే సాహసం చేయడం వెనుక ఉన్న కారణాలను అర్ధం చేసుకోవడం సులబమే.

గ్రామీణ ప్రాంతాలలో లేని మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు విశేష సేవలు నగరాలలో ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యం మరొక ముఖ్య అంశం. జనము, ముఖ్యంగా వృద్దులు, తమకు అవసరమైన వైద్యలు, ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న నగరాలకు వెళ్లిపోవాల్సిన అవసరము వస్తుంది. వినోదాలకు ఎక్కువ అవకాశాలు ఉండటం (రెస్టారంట్లు, సినిమ్మ థియేటర్లు, తీం పార్కులు), విశ్వవిద్యాలయాలు వంటి మంచి విధా అవకాశాలు ఉండటం వంటివి ఇతర కారాణాలు. జనాభాలు ఎక్కువ ఉండటం వలన, నగర ప్రాంతాలలో వివిధ రకాల సామాజిక వర్గాలు నోవశిస్తుంటారు. దీని మూలాన, జనాలకు వాళ్ల లాంటి జనాలను కనుక్కోవడం సులభంగా ఉంటుంది. ఐతే, ఇది గ్రామీణ ప్రాంతాలలో సాధ్యం ఉండదు.

ఒక సమాజం పారిశ్రామిక సమాజముగా మారే సమయములో ఈ పరిస్తుతులు ఇంకా తీవ్రత అవుతాయి. ఈ సమయములోనే, అనేక కొత్త వాణిజ్య సంస్థలు నెలకొల్పబడి, నగరాలలో కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతాయి. పారిశ్రమీకరణ వలన పంట పొలాలలో మషిన్ల వాడకం ఎక్కువ అయి, అనేక రైతు కూలీలకు పని దొరకడం లేదు. భారాత దేశములో ఇదే ప్రస్తుతం చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది.

ఆర్ధిక ప్రభావాలు[మార్చు]

పాతనాటి రుష్యాన్ గ్రామమైన ల్యూకేర్యినో లో మిగిలి ఉన్న కొన్ని పాత ఇల్లు. గత 30 సంవత్సరాలలో అనేక ఇల్లు కూల్చబడి, కొత్త 9-అంతస్తుల అపార్ట్మెంట్ భవనాలు క్స్తోవో అనుబడు అభివృద్ధి చెందుతున్న నగరములో నిర్మించబడుతున్నాయి. అటువంటి ఒక భావనం ఇక్కడ కనిపిస్తుంది.

ఇటీవల కాలములో, గ్రామీణ ప్రాంతాలు నగరీకరణకు గురవ్వడం పెరుగుతూ ఉంది. వ్యవసాయం, సాంప్రదాయక స్థానిక సేవలు మరియు చిన్నతరహా పరిశ్రమలు ఆదరణ కొల్పోయి ఆధునిక పరిశ్రమలు పెరగడంతో, నగరానికి కావలసిన వస్తువులు, పెరుగుతూ ఉన్న నగరము లోపలే తయారు అయ్యేవి.

పెద్ద నగరాలు ప్రత్యేక వస్తువులు మరియు సేవలను ప్రాంతీయ మార్కెట్ మరియు పరిసర ప్రాంతాలకు ఎక్కువగా అందిస్తాయని నగర పర్యావరణ మీద జరిపిన పరిశోధనలు చెపుతున్నాయి. పెద్ద నగరాలు రవాణా కేంద్రాలుగా మరియు మొట్ట వ్యాపారాలకు కేంద్రాలుగా నిలిచి, మూలదనము సెలరణ, ఆర్థిక సేవలు అందించే కేంద్రాలుగా పని చేస్తాయి. అంతే కాక, విద్యావంతులైన కార్మికులు కలిగి ఉండి, ఆ ప్రాంతాలకు పరిపాలనా కార్యకాలాపాలను అందిస్తూ ఉంటాయి. వివిధ స్థాయిలలో ఉన్న ప్రాంతాల మధ్య ఉన్న సంబంధాలను నగర హైరార్కి అని పిలవబడుతుంది.

నగరాలు అభివృద్ధి చెందుతూ ఉంటె, దారాలు బాగా పెరిగి, మునిసిపల్ ఉద్యోగులు వంటి స్థానిక కార్మికుల వర్గాల స్థాయికి మించి పోతాయి. ఉదాహరణకు, ఎరిక్ హోబస్బాం రచించిన ది ఏజ్ అఫ్ ది రివల్యూషణ్: 1789–1848 (1962 మరియు 2005లో ప్రచురించబడ్డాయి) పుస్తకము యొక్క 11వ అధ్యాయం ప్రకారం, "మన కాలములో [1789–1848] నగర అభివృద్ధి అనేది ఒక బ్రహ్మాండమైన వర్గీకరణ. ఇది కొత్తగా ఏర్పడిన పేద కార్మికుల వర్గమును మరింత పెదరికములోకి నెట్టేసి, వాళ్ళను ప్రభుత్వ కేంద్రాలకు, వ్యాపారాలకు కొత్తగా ఏర్పడిన ప్రత్యేక మధ్య తరగతి వర్గాల వారి నివాశ ప్రాంతాలకు దూరంగా ఉంది పోయారు." ఈ కాలములోనే, దాదాపు ప్రపంచమంతట పాటిస్తున్న యురోపియన్ విబజన ఐన 'మంచి' పశ్చిమ భాగము, 'పేద' తూర్పు భాగముగా పెద్ద నగరాలలో విబజన తత్వం ఏర్పడింది. దీనికి బహుశా ఇది కారణమయి ఉండవచ్చు: బొగ్గు పొగను ఇతర కాలుష్య పదార్తాలను కలిగి ఉన్న దక్షిణ-పశ్చిమ గాలి వీసుతూ ఉండటముతో, నగరములో తూర్పు ప్రాంతాలకంటే పశ్చిమ ప్రాంతాలు మంచిగా ఉంటాయి. ఇదే సమస్యలు ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో నెలకుంటున్నాయి. దురితగతిన నగరీకరణ మూలానా అసమానత్వం పెరుగుతూ ఉంది. దురితగతిన ఏర్పడుతున్న నగరీకరణ మరియు సమర్ధత వంటి అంశాలు అసమానమైన నగర పెరుగుదలకు దారి తీస్తుంది. నగరాలకు తరలి వస్తున్నా తక్కువ ప్రావిణ్యం కలిగిన మరియు ప్రావిణ్యం లేని కార్మికులకు ఉపాది కలిపించాదము కోసం కార్మికుల ఆధారిత అభివృద్ధి విధానాలను ఓవర్సీస్ డెవెలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు ప్రతిపాదించాయి[9].

నగరీకరణ తరచూ ఒక కీడు కలిగించే అంశంగానే చూడబడుతుంది. కాని, నిజానికి రవాణాకు అయ్యే సమయం మరియు కర్చులను దగ్గించడానికి, ఉద్యోగం, విద్యా, గృహము, ప్రయాణము వంటి అవసరాలకు అవకాశాలను పెంచుకోవడానికి వ్యక్తిగతంగా మరియు సంస్థాగతంగా చేయబడే ప్రయత్నాల వల్ల నగరీకరణ సహజంగానే జరుగుతుంది. నగరాలలో నివసించడం మూలాన, వ్యక్తులు మరియు కుటుంబాలకు నగరాలలో ఉన్న మార్కెట్ పోటి, బిన్నత్వం మరియు చేరువ వంటి అంశాలను ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.[10][11]

పర్యావరణ ప్రభావాలు[మార్చు]

నగరాలు ఉష్ణ ద్వీపాలుగా మారుతూ ఉండటం ఒక చింతించవలసిన విషయము. ఇది ఇటీవల సంవత్సరాలలో పెరుగుతూ ఉంది. పారిశారామిక మరియు నగర ప్రాంతాలు వృద్ధి చెందినప్పుడు, ఉష్ణోగ్రత పెరిగి, నగర ఉష్ణ ద్వీపం ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో, భూమిలోకి వస్తున్న సౌర శక్తిలో పెద్ద భాగం, మట్టి మరియు చెట్లలో ఉన్న నీటిని ఆవిరిగా మార్చడానికి ఉపగోగించబడుతుంది. నగరాలలో, చెట్లు మరియు బయట కనిపించే మట్టి తక్కువగా ఉండటం వలన సొర శక్తి కట్టడాలు, ఆస్ఫాల్ట్ లలో చేరుతుంది. అందువలన వెచ్చగా ఉన్న పగటి సమయములో, నగరాలలో ఆవిరిగా మారి చల్లదనాన్ని పెంచడం తగ్గి గ్రామీణ ప్రాంతాలకంటే ఉష్ణోగ్రత పెరిగుతుంది. ఇంకా, వాహనాలు, కర్మాగారాలు మరియు పరిశ్రమలోను నివాశములోను వాడే హీటింగ్ మరియు కూలింగ్ పరికరాల నుండి వెలుబడే ఉష్ణము నగరాల వేదిను పెంచుతుంది.[12] ఈ ప్రభావం వలన నగరము పరిశర ప్రాంతాలకంటే 2 నుండి 10o F (1 నుండి 6o C) ఉష్ణం ఎక్కువగా ఉంటుంది[13]. దీని ప్రభావం వల్ల మట్టిలో తేమ తగ్గి కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గమం పెరుగుతుంది.[14]

నగరీకరణ పర్యావరణం మీద మంచి ప్రభావమే చూపుతుందని హోల్ ఎర్త్ డిసిప్లిన్ అనే పుస్తకములో స్టూవర్ట్ బ్రాండ్ వాదిస్తున్నారు. ముందుగా, కొత్తగా నగరాలలో నివాశానికి వచ్చిన వారిలో జనన రేటు వెంటనే రీప్లేస్మెంట్ రేటుకు తగ్గుతుంది. తరువాత కూడా తగ్గుతూ ఉంటుంది. దీని మూలాన భవిష్యత్తులో జనాభా పెరుగుదలను అరికట్టవచ్చు. రెండవ విషయము ఏమంటే, నగరీకరణ మూలాన నరకడం, కాల్చడం వంటి నిర్మూలత్మక వ్యవాసాయ పద్ధతులకు ముగింపు వస్తుంది. చివరిగా దీని మూలానా మనుషులు భూమిని వాడుకోవడం తగ్గి, ప్రకృతికి ఎక్కువ బూమిని వదిలి పెట్టడం జరుగుతుంది.[11]

మారుతున్నా నగరీకరణ రూపాలు[మార్చు]

బవన నిర్మాణ శైలి, ప్రణాళిక విధాల మరియు చారిత్రాత్మిక అభివృద్ధి లను బట్టి నగరకీరణను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు.

అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్న నగరాలలో, ఇన్-మైగ్రేషన్ అనబడే మానవ కార్యకలాపాలను కేంద్రీకరించే ప్రభావాన్ని నగరీకరణ చూపించింది. పూర్వపు కాలనీలు మరియు అటువంటి ప్రదేశాలనుండి వలస రావడాన్ని ఇన్-మైగ్రేషన్ అని పిలుస్తారు. వలస వచ్చే అనేక మంది జనము నగరములోని బీద ప్రాంతాలలో స్థిరపడుతారు. దీని మూలాన "పెరీపరలైసేషన్ అఫ్ ది కోర్" అనే తత్వానికి దారి తీసింది. దీనికి అర్ధం ఏమనగా, ఒకప్పుడు పూర్వపు రాజ్యాలలో నగర మధ్య బాగాలకు దూరంగా నివసించే వారు ఇప్పుడు నగర మధ్య బాగాములో నివసిస్తున్నారు.

అంతర్-నగర పునఃఅభివృద్ధి పధకాలు వంటి ఇటీవల పరిణామాల వలన ప్రస్తుతం నగరములోకి కొత్తగా వస్తున్నా జనము నగర కేంద్రములోనే స్థిర పడతారనే అవసరం లేదు. అభివృద్ధి చెందిన కొన్ని ప్రాంతాలలో, ప్రతి-నగరీకరణ అనబడే బిన్నమైన పరిణామం జరిగింది. దీని మూలాన నగర జనాభా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పోవడం జరిగింది, ముఖ్యంగా ధనవంతుల కుటుంబాలలో. దీనికి ముఖ్య కారణము మేరుగుబడిన సమాచార వ్యవస్థ. నేరాల గురించి భయము మరియు అద్వానంగా ఉన్న నగర వాతావరణము దీనికి ఇతర కారణాలు. ఈ పరిణామానికి అనంతరం "వైట్ ఫ్లైట్" అని పేరు పెట్టబడింది. ఇది కేవలం అత్యధిక సంఖ్యలో అల్పసంఖ్యా వర్గీయులు ఉన్న నగరాలకు మంత్రమే పరిమితం కాదు.

నివాశప్రాంతాలు బయట వైపు విస్తరిస్తే దీనిని సబర్బనైసేషన్ అని అంటారు. సబర్బనైసేషన్ మూలాన నగర కేంద్రాలకు పరిశరములో కొత్త కేంద్రాలు ఏర్పడుతున్నాయని అనేక రచయితలు, పరిశోధనాకారులు సూచిస్తున్నారు. ఇది భారత దేశము వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు అభివృద్ధి చెందిన దేశాలలోనూ జరుగుతుంది.[15] ఈ విదంగా ఒకటితో ఒకటి సంబంధం ఉంది అనేక రకాలుగా కేంద్రీకరించబడతామే కొత్తగా రూపు దిద్దుకుంటున్న నగరీకరణ రూపమని కొందరి అబిప్రాయం. దీనిని ఎక్సూర్బియ, ఎడ్జ్ సిటీ (గర్యూ, 1991), నెట్ వర్క్ సిటీ (బట్టేన్, 1995), లేదా పోస్ట్ మాడరన్ సిటీ (డియర్, 2000) అని అనేక రకాలుగా పిలవబడుతుంది. లాస్ యాన్జేలేస్ నగరమే ఈ నగరీకరణ పద్ధతికి మంచి ఉదాహారణ.


గ్రామీణ ప్రాంతాలనుండి వలస వచ్చినవారు నగరాలు అందిస్తున్న అవకాశాలను చూసి ఆకర్షించబడుతున్నారు. కాని వారు మురికి వాడలలో ఉంటూ, పేదరికాన్ని అనుభవిస్తారు. 1980లలో, ఈ సమస్యను ఛేదించడానికి మైకేల్ లిప్టన్ ఒక నగర పక్షపాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆయినా ఈ విధముగా రాశారు "....... ప్రపంచములోని పేద దేశాలలో ప్రస్తుతం నేలకున్తన్న అతి ముఖ్యమైన వర్గ పోరాటం, కార్మికులకు మూలదానకు మధ్య జరిగేది కాదు. అది దేశీయ, విదేశీ మధ్య పోరాటమూ కాదు. అది గ్రామీణ వర్గానికి నగర వర్గానికి మధ్య జరిగే పోరాటమే. గ్రామీణ ప్రాంతములో అత్యధిక పేదరికం ఉంది. ఐతే, నగరాలలో వాక్చాతుర్యం, సంస్థ మరియు శక్తి ఉన్నాయి. అందువలన, గ్రామీణ వర్గాలతో జరిగే పోరాటాలలో నగర వర్గాలే అనేక సార్లు గెలుపొందుతున్నాయి..." [16]. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న నగరాలలో నివసించే పేదలలో పని సంపాదించే కలిగిన అనేక మంది భద్రత లేని తక్కువ జీతము వచ్చే ఉద్యోగాలలోనే ఉన్నారు. ఓవర్సీస్ డెవలప్మేంట్ ఇన్స్టిట్యూట్ వారి పరిశోధన ప్రకారం, నగరకీరణ పేదలకు అనుకూలంగా ఉండాలంటే, కార్మికులు ఎక్కువ అవసరమైన రీతిలో అభివృద్ధి, కార్మికుల రక్షణ, భూమిని వాడకం పై సరళమైన చట్టాలు మరియు మౌలిక సేవల మీద పెట్టుబడులు వంటి విధానాలు అవసరము.' [17]

1957 నాటి తెలుగు సినిమా తోడికోడళ్ళులో టౌను పక్కకెళ్ళొద్దురా పాట
పట్టణీకరణకు అనుకూల ప్రతికూల వాదనలు ఇందులో సాహిత్య రూపం తీసుకున్నాయి.

నగరీకరణ, ప్రణాళిక ప్రకారం జరగవచ్చు లేదా దానంతట అదే జరగవచ్చు. ప్రణాళిక ప్రకారం జరిగే నగరీకరణ అనగా, ప్రణాళిక ప్రకారం ఏర్పరిచిన సమాజం లేదా ఉద్యావన నగర ఉద్యమం. ఇది ముందుగానే నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం, సైన్య, అందము, ఆర్థిక లేదా నగర రూపకల్పన వంటి కారణాల కొరకు జరగవచ్చు. అనేక పురాతన నగరాలలో దీనికి ఉదాహరణాలు చూడవచ్చు; అన్వేషణ మూలాన దేశాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు, ఆక్రమించే దేశాల యొక్క గుణగణాలు ఆక్రమించబడిన నగరాల మీద రుద్దపడేది. అవంతట అవే అభివృద్ధి చెందిన అనేక నగరాలలో సైన్య మరియు ఆర్థిక కారణాల నిమిత్తం పునఃనిర్మాణం చోటు చేసుకున్నాయి. కొత్త రహదారులు వేయడం, కొత్త బూములను ప్రత్యేక ఉద్దేశం కొరకు కేటాయించడం వంటి కార్యక్రమాల మూలాన నగరాలకు ప్రత్యేక రూపం వచ్చేవి. నగరీకరణ జరిగేముందు నగరాలలో మౌలిక సదుపాయాలు పూర్తీ చేయబడాలని UN కోరుకుంటుంది. నగరీకరణ జరిగేముందు పార్కులు, డ్రైనేజ్ వ్యవస్థలు, పచ్చదనం వంటి సదుపాయాలను నగర ప్రణాళిక అధికారులు ఏర్పరుచాలి. లేదా నగరీకరణ తరువాతనైన ఈ పనులు చేబట్టి, నగరాన్ని అభివృద్ధి చేసి నివసించడానికి అర్హత సమకూర్చాలి. నగర విస్తీరణను నియంత్రించే విధానాలను అమెరికన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ప్లనేర్స్ పరిగణములోకి తీసుకుంటుంది.[18]

సూచనలు[మార్చు]

 1. [0]
 2. The Associated Press (February 26, 2008). "UN says half the world's population will live in urban areas by end of [[2008]]". International Herald Tribune. మూలం నుండి 2008-04-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-05. Cite news requires |newspaper= (help); URL–wikilink conflict (help)
 3. http://www.unicef.org/sowc08/docs/sowc08_table_StatisticalTables.pdf
 4. ప్రపంచ నగరీకరణ సూచనలు: 2005 రివిషణ్, పాప్. విభాగం, ఆర్ధిక మరియు సామాజిక వ్యవహారాల విభాగం, UN
 5. బ్రిటానికా ఫ్యూచరిస్ట్ బ్లాగ్
 6. "UN స్టేట్ అఫ్ ది వరల్డ్ పోపులేషణ్ 2007, UNFPA". మూలం నుండి 2011-07-28 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-05. Cite web requires |website= (help)
 7. Ankerl, Guy (1986). Urbanization Overspeed in Tropical Africa. INUPRESS, Geneva. ISBN 2881550002.
 8. "Population Bulletin 2007/2008" (Press release). Milton Keynes intelligence Observatory. 10/03/2008. మూలం నుండి 2016-02-04 న ఆర్కైవు చేసారు. Retrieved 11/06/2008. Check date values in: |accessdate=, |date= (help)
 9. గ్రాంట్, ఉర్సుల(2008) నగర కార్మిక మార్కెట్లలో అవకాశాలు మరియు శూరకృత్యము [1] లండన్: ఓవర్సీస్ డెవెలప్మెంట్ ఇన్స్టిట్యూట్
 10. Glaeser, Edward (Spring, 1998). "Are Cities Dying?". The Journal of Economic Perspectives. 12 (2): 139–160. Check date values in: |date= (help)
 11. 11.0 11.1 Brand, Stewart. "Whole Earth Discipline - annotated extract". మూలం నుండి 2010-04-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-29. Cite web requires |website= (help)
 12. పార్క్, హెచ్.-ఎస్. (1987). నగర ఉష్ణ ద్వీపము యొక్క తీవ్రత మీద బూగోళ వాతావరణాల ప్రభావం. ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ సెంటర్ పత్రాలు, నం. 11.) ఇబారకి, జపాన్: ఎన్విరాన్మెంటల్ రిసెర్చ్ సెంటర్, ది యునివేర్సిటీ అఫ్ ట్సుకుబ.
 13. "హీట్ ఐలాండ్ ఎఫెక్ట్"
 14. "వేడెక్కడం: చైనాలో దురితగతిలో జరుగుతున్న నగరీకరణ మూలానా ఇతర నగర ప్రాంతాలకంటే ప్రాంతాలలో వాతావరణం తొందరగా వేడుక్కుతుంది అని ఒక అధ్యయనం చూపుతుంది" [2]
 15. శ్రీధర్, కే. డెన్సిటి గ్రేడియాంట్స్ అండ్ తెర్ డిటర్మినంట్స్: ఎవిడెన్స్ ఫ్రం ఇండియా Archived 2010-02-14 at the Wayback Machine. రీజనల్ సైన్స్ అండ్ అర్బన్ ఎకనామిక్స్ 37 (3) 2007, 314:344
 16. వార్ష్ణే, ఏ. (ఎడ్.) 1993 "బెయోండ్ అర్బన్ బయాస్", p.5. లండన్: ఫ్రాంక్ కాస్.
 17. "Opportunity and exploitation in urban labour markets". Overseas Development Institute. November 2008. http://www.odi.org.uk/resources/odi-publications/briefing-papers/44-urban-labour-markets-exploitation.pdf. 
 18. Lovelace, E.H. (1965). "Control of urban expansion: the Lincoln, Nebraska experience". Journal of the American Institute of Planners. 31:4: 348–352.

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నగరీకరణ&oldid=2823565" నుండి వెలికితీశారు