నటనాలయం (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నటనాలయం
కృతికర్త: మోదుకూరి జాన్సన్
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నాటకం
ప్రచురణ: సరళ పబ్లికేషన్స్
విడుదల: 1965
పేజీలు: 97


నటనాలయం మోదుకూరి జాన్సన్ రాసిన సాంఘీక నాటకం.[1] కళాకారుని జీవన నేపథ్యంలో రాయబడిన ఈ మెలోడ్రామా నాటకం తెలుగు నాటకరంగంలో అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా గుర్తింపుపొంది, అనేక నాటకాలకు మార్గదర్శిగా నిలిచింది.[2] ఈ నాటకానికి ముందుగా అనుకున్న పేరు గిజిగాడు, కానీ ఇతర పాత్రల వల్ల నటనాలయం అని పేరు పెట్టారు.

కథానేపథ్యం[మార్చు]

నటుడు తన నటన ద్వారా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంటాడుకానీ తన జీవితంలో అతనికి ఎన్నో సమస్యలు ఉంటాయి. నిజమైన నటుడు నటనలో జీవించాలేకాని జీవితంలో నటించకూడదన్న సందేశంతో నటనకు, జీవితానికి మధ్య నలిగిపోయి ఉక్కిరిబిక్కిరి అయిన రాజారావు జీవిత నేపథ్యంతో ఈ నాటకం ఉంటుంది. ఒక కళాతపస్వి కళకోసం పడే తపన, ఆవేదన, లక్ష్యసాధనలో బాహ్య పరిస్థితులలో పడే ఘర్షణ ఈ నాటకంలో అడుగడుగునా కనిపిస్తుంది.[3]

పాత్రలు[మార్చు]

  • రాజారావు
  • చిట్టిబాబు
  • డాక్టర్
  • గిజిగాడు

ఇతర వివరాలు[మార్చు]

  1. ఇది తొలిసారిగా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆంధ్రరసాలిని సంస్థ తరపున ఆలపాటి వెంకట్రామయ్య కళాపరిషత్తులో ప్రదర్శించబడింది. ఆ తరువాత గురజాడ కళామందిరం (విజయవాడ) నుండి ఎ. శివరామిరెడ్డి, ఊట్ల బుడ్డయ్య చౌదరి విరివిగా ప్రదర్శించారు.
  2. రంగస్థల, సినిమా నటుడు దర్శకుడు సంజీవి ఈ నాటకంలోని చిట్టిబాబు పాత్ర ద్వారా నాటకరంగ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ నాటకంలోని సంజీవి నటనను చూసి బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం సినిమాలో బాలనటుడి వేషం ఇచ్చాడు.
  3. తెలుగు నాటకరంగంలోని అనేక నాటక సంస్థలచే ప్రదర్శించబడిన ఈ నాటకం ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది.
  4. ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో, మరెన్నో పరిషత్తు పోటీలలో ఉత్తమ రచనకు, ఉత్తమ ప్రదర్శనకు ఎన్నెన్నో బహుమతులు అందుకుంది.[3]
  5. నాటకంలో ప్రధానమైన రాజారావు పాత్రను ధరించి, మెప్పించాలని ఆ తరంలోని సీనియర్‌ నటులందరూ అనుకునేవారు.[3]

అవార్డులు[మార్చు]

  1. ఉత్తమ బాల నటుడు (సంజీవి ముదిలి) - ఆంధ్ర నాటక కళా పరిషత్తు, 1965, హైదరాబాదు.
  2. ఉత్తమ బాల నటుడు (సంజీవి), ఉత్తమ నటుడు (వై. శంకరరావు-ఏఎన్ఆర్ రోలింగ్ షీల్డు) - లలిత కళానికేతన్ (రాజమండ్రి).

మూలాలు[మార్చు]

  1. సాక్షి, సినిమా (24 December 2014). "ఆ పాట.. ఆయన.. చిరంజీవులు". Sakshi. రెంటాల జయదేవ. Archived from the original on 14 జూలై 2017. Retrieved 11 September 2019.
  2. అద్భుత నాటకం నటనాలయం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 24 జూలై 2017, పుట.14
  3. 3.0 3.1 3.2 విశాలాంధ్ర, సాహిత్యం (22 February 2010). "తెనాలి తేజోమూర్తులు బొల్లిముంత, జాన్సన్‌". పెనుగొండ లక్ష్మీనారాయణ. Archived from the original on 11 సెప్టెంబరు 2019. Retrieved 11 September 2019. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "తెనాలి తేజోమూర్తులు బొల్లిముంత, జాన్సన్‌" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు