Jump to content

నత్తం

Coordinates: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
నత్తం
నత్తం is located in Tamil Nadu
నత్తం
నత్తం
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:విజయాసన పెరుమాళ్
ప్రధాన దేవత:వరగుణమంగై తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:అగ్నితీర్థం
విమానం:అగ్నిహోత్రునకు
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:విజయకోటి విమానం

నత్తం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

ఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడా పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళింగుడి" యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని కీర్తించారు.

సాహిత్యం

శ్లో. శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే:|
   నాయక్యా వరగుణమంగై నామ సత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూప:|
   విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచ: ప్రియ:|
   సుజన సేవిత పాద సరోరుహ: విజయతే ధరణౌ విజయాసన:||

పాశురాలు

పా. పుళిజ్గుడిక్కిడన్దు వరగుణమంగై యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
    తెళిన్ద వెన్‌శిన్దై యగజ్కழிయాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
    నళిర్‌న్ద శీరులగమ్‌ మూన్ఱుడన్ వియప్ప; నాజ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
    పళిజ్గునీర్ ముగిలిన్ పవళమ్బోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-4

వివరాలు

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
విజయాసన పెరుమాళ్ వరగుణమంగై తాయార్ అగ్నితీర్థం తూర్పు ముఖము కూర్చున్న భంగిమ నమ్మాళ్వార్ విజయకోటి విమానం అగ్నిహోత్రునకు

మంచిమాట

భక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.

భగవంతుడు ప్రపన్నులను సంతోషింప చేయ ప్రయత్నించును

సూచన

తిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.

చేరే మార్గం

శ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము

చిత్రమాలిక

ఇవికూడా చూడండి

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

వెలుపలి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=నత్తం&oldid=1966731" నుండి వెలికితీశారు