నదీమ్-శ్రవణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నదీమ్-శ్రవణ్
రంగంFilm Soundtrack
వృత్తిComposer, music director, singer
క్రియాశీల కాలం1981–present

నదీమ్-శ్రవణ్ (కొన్నిసార్లు నదీమ్ శ్రావణ్‌గా పేరుపడిన) బాలీవుడ్ సినీ పరిశ్రమలోని సంగీత దర్శక ద్వయం. వీరి అసలు పేర్లయిన నదీమ్ సైఫీ మరియు శ్రవణ్ రాథోడ్ యొక్క మొదటి నామముల నుంచి ఈ పేరు వచ్చింది.

1990, 2000 లలో నదీమ్-శ్రవణ్ విజయవంతమైన సంగీత దర్శకులు. గొప్ప మాధుర్య ప్రధాన పాటలకు మరియు మంచి లయను (వేళ్ళతో తట్టే లాటిన్ వాయిద్యాలను తరచుగా ఎక్కువగా వాడతారు) కలిగి త్వరగా జనామోదం పొందే పాటలకు వీరు పెట్టింది పేరు. వీరి సంగీతదర్శకత్వంలో, ప్రముఖ హిందీ సినీనేపథ్య గాయకులైన కుమార్ సాను, ఉదిత్ నారాయణ్, సోను నిగం, అభిజీత్, SP బాలసుబ్రహ్మణ్యం, అల్కా యాగ్నిక్, అనురాధ పోడ్వాల్ మరియు అనేక మంది ఇతరులు పాడారు.

అనేక విజయవంతమైన చిత్రాలు ఆషికి, సాజన్, సడక్, దిల్ హైకి మాంతా నహిన్, ఫూల్ ఔర్ కాంటే, దీవానా, హమ్ హై రాహి ప్యార్ కే, దిల్ వాలే, బర్సాత్, రాజా హిందుస్తానీ, పరదేశ్, సిర్ఫ్ తుం, ధడకన్, కసూర్, రాజ్, దిల్ హై తుమ్హారా, అందాజ్, బేవఫాకు సంగీతాన్ని అందించారు.

సంగీతపరమైన వృతి జీవితం[మార్చు]

నదీమ్ మరియు శ్రవణ్ మధ్య అనుసంధానత వారిరువురూ 1972లో ఒక వేడుకలో మొదటిసారిగా కలసుకున్న నాటినుంచి మొదలైనది. 1981లో వారు పనిచేసిన మొదటి హిందీ చిత్రం మైనే జీనా సీఖ్ లియా . కానీ, ఇలాఖా, హిసాబ్ ఖూన్ కా మరియు లష్కర్ వంటి మూడు పెద్ద సినిమాలు వచ్చే వరకు, B గ్రేడ్ సినిమాలతోనే వారు ఆగిపోయారు. అయితే ఆ సినిమాలు భారీవైనప్పటికి, వాటిలో సంగీతం చెప్పుకోదగినట్లు లేదు. ఈ B గ్రేడ్ సినిమా సంగీత దర్శకులు, తరువాతి కాలంలో బాగా ప్రాచుర్యం పొంది, బాలీవుడ్‌లో పెద్దవైన నిర్మాణ సంస్థలతో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.

ఖ్యాతిని ఆర్జించడం[మార్చు]

ఆషికి (1990) నదీమ్-శ్రవణ్ లను వెలుగులోకి తీసుకువచ్చింది. సంగీత మొఘుల్ గుల్షన్ కుమార్ ఈ సినిమాతో వీరికి బ్రేక్ ఇచ్చారు మరియు ఈ సినిమా నదీమ్, శ్రవణ్ మరియు కుమార్ సాను అనే ముగ్గురు భవిష్యత్ తారలను అందించింది. హిట్టైన పాటలలో కొన్ని 'సాంసోకి జారూరత్', 'నాజర్ కే సామనే జిగర్ కే పాస్', 'ధీరే ధీరే సే మేరి జిందగీ మే ఆన', 'అబ్ తేరే బిన్ జీ లేంగే హమ్' మరియు "జానేజిగర్ జానేమన్". సినిమా లోని ప్రతి పాట హిట్టైన కొద్ది సినిమాలలో ఆషికి ఒకటి. ఈ పయనం 'సాజన్', 'దిల్ హైకి మాంతా నహిన్', 'సడక్', 'సైనిక్', 'రాజా', 'దిల్ వాలే' మరియు 'ఫూల్ ఔర్ కాంటే' తో కొనసాగింది. 'చెహ్ర క్యా దేఖ్తే హో' (సలామి), 'ఆదఎన్ భి హైన్' (దిల్ హైకి మాంతా నహిన్) 'సోచేంగే తుమ్హే ప్యార్' (దీవానా), 'ఆజ్ రాత్ చాందిని హై' (కల్ కి అవాజ్, లో నదీమ్ శ్రవణ్ ల ముద్ర ప్రస్ఫుటంగా కనబడుతుంది.

వారు అన్నిరకాల సంగీతాన్ని, అనగా ఫాస్ట్ ట్రాక్, సెంటిమెంట్ లేదా నృత్య ప్రధాన సంగీతాన్ని స్వరపరచారు. అయితే వారి నైపుణ్యత ఎప్పుడూ మాధుర్య ప్రధానమైనదే. మరొక గుర్తించవలసిన విషయం ఏమిటంటే, వారి సంగీతం వినసొంపుగా వుండి శ్రోతలకు వెంటనే నచ్చుతుంది. వారి సంగీతంలో ఎక్కువ వైవిధ్యం కనబడదు మరియు బాగా ఎక్కువగా ప్రయోగాలు చేయలేదు అని చెప్పబడుతుంది. కానీ, వారు సంప్రదాయమైన భారతీయ సంగీతానికి, ఆధునికతను జోడించడంలో సిద్ధహస్తులు. అయితే నదీమ్ శ్రవణ్ " సంప్రదాయంలోనే వైవిధ్యతను" చూపగలరని ప్రపంచానికి నిరూపించదలచారు. ఇందుకొరకు వారికి అన్నిరకాల సంగీతాన్ని సమకూర్చుటకు అవకాశమున్న స్క్రిప్ట్ ని కలిగిన మరియు స్వరపరచుటలో స్వేచ్ఛను ఇవ్వగలిగిన దర్శకుని మద్దతు అవసరం. సుభాష్ ఘాయ్ యొక్క 'పరదేశ్' విడుదలైనప్పుడు ఒక ప్రఖ్యాత సంగీత విమర్శకుడు ఇలా అన్నాడు: "నదీమ్ శ్రవణ్ ఇకపై స్వరకల్పన చేయడం ఆపివేయవచ్చు... ఎందుకనగా ఇంతకంటే మెరుగైనది ఇక ఉండదు...నదీమ్ శ్రవణ్ శిఖరాగ్రాన్ని చేరుకున్నారు". ఈ చిత్రం అన్నింటిని కలిగివున్నది.. మాధుర్యప్రధాన ప్రేమ గీతాలు (దో దిల్ మిల్ రహే హైన్), పాప్ (మై ఫస్ట్ డే ఇన్ అమెరికా), బాధ (ఏ దిల్ దీవానా), ఖవాలి (నహీన్ హోనా థా) మరియు అన్నిటిలోకి ఉత్తమమైనది (ఐ లవ్ మై ఇండియా). నదీమ్ చెప్పినది:

"ఐ లవ్ మై ఇండియా అనేది ఒక పాట మాత్రమే కాదు, అది దేశాన్ని గురించిన నా భావాలను కుడా చాటి చెబుతుంది".

వారికి అత్యధిక హిట్స్ కుమార్ సాను, అనురాధ పోడ్వాల్, ఆల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్, వినోద్ రాథోడ్ తో మరియు ఇప్పుడు సోను నిగంతో ఉన్నాయి. వారు చాలామంది పాటల రచయితలు ఆనంద్ బక్షి, ఫైజ్ అన్వర్, హస్రత్ జైపురి, రాణి మాలిక్, మరియు అనేకమందితో పనిచేసారు కానీ, వారి స్వరకల్పనకు సమీర్ గీతాలు సరిగ్గా సమకూరతాయి. వారు ప్రవేశించేనాటికి, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ మరియు ఆనంద్ మిలింద్ లు అగ్రస్థానంలో ఉన్నారు. కానీ, తదనంతరం వారి కృషి వలన వరుసగా అనేక హిట్స్‌ను ఇచ్చారు.

వారి పాటలు తరచుగా ఝాన్కార్/కాంగా/ఎలక్ట్రానిక్ డ్రంల సమ్మేళిత దరువులు కలిగి ఉంటాయి. వారు ఎక్కువగా సమీర్ (గీత రచయిత) మరియు గాయకులు కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ మరియు గాయకురాలు ఆల్క యాగ్నిక్ తమ స్వరకల్పనకు కావాలని పట్టుబట్టేవారు (అన్నిటికి కాదు).

గుల్షన్ కుమార్ హత్యా ఉదంతం[మార్చు]

1997లో నదీమ్ లండన్, ఇంగ్లాండ్ లో విహార యాత్రలో వున్నప్పుడు, వాళ్ళ పూర్వపు నిర్దేశకుడు మరియు రికార్డు అధినేత గుల్షన్ కుమార్ (T-సిరీస్ మ్యూజిక్ కంపెనీ యజమాని) హత్య కేసులో, నదీమ్ హస్తం ఉన్నట్లు ఇండియాలోని పోలీసుల విచారణలో తేలి అతని మీద అరెస్టు వారెంటు జారీ కావడంతో, ఈ ద్వయం దుష్ప్రచారానికి గురైనది. చీకటి ప్రపంచపు నాయకుడికి డబ్బులు ఇచ్చి ఈ పని చేయించినట్లు చెప్పబడింది. అతని పాస్ పోర్ట్ రద్దుచేయబడినది మరియు అరెస్ట్‌ను తప్పించుకొనుటకు, అతను ఇంగ్లాండ్‌లోనే ఉండి పోయాడు. 2002లో, బొంబాయి కోర్ట్, గుల్షన్ కుమార్ హత్య కేసులో నదీమ్‌ను నిర్దోషిగా పేర్కొని, అతని పైనున్న ఆరోపణలను కొట్టివేసింది. న్యాయమూర్తి ఆతనిపై గల నిందారోపణలకు తగిన సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.[1] చివరకు నదీమ్ సైఫీ ఈ కేసులో విజయం సాధించాడు. హౌస్ అఫ్ లార్డ్స్, 1997 హత్య కేసులో ప్రత్యర్పణం (విదేశాలలో దాగున్న నేరస్తులని స్వదేశానికి రప్పించే ఏర్పాటు) విషయంలో లండన్ హైకోర్ట్ నిర్ణయాన్ని సమర్ధించి, తిరిగి విచారణ చెయ్యాలన్న ఇండియా ప్రభుత్వ అభ్యర్ధనను తిరస్కరించింది. "హౌస్ అఫ్ లార్డ్స్, UK కోర్ట్ కనుగొన్న విషయాలను సమర్ధించి, గుల్షన్ కుమార్ హత్య కేసులో నదీమ్ సైఫీని నిర్దోషి మరియు ఈ హత్యకేసులో నదీమ్‌ను అన్యాయంగా ఇరికించారని ప్రకటించినది." [2][3]

కొంతకాలం స్తబ్దంగా వున్న తరువాత, నదీమ్-శ్రవణ్ ఎహ్ దిల్ ఆషికానా, ఏక్ రిష్తా, కసూర్, హమ్ హోగయే ఆప్కే, రాజ్, దిల్ హై తుమ్హారా, ఖయామత్, హంగామా, అందాజ్, బేవఫా, తుంసే నహి దేఖా, బర్సాత్, దోస్తీ మరియు డు నాట్ డిస్టర్బ్ వంటి సినిమాలతో తిరిగివచ్చారు.

నదీమ్ UKలో ఉన్నాడు మరియు భౌగోళికంగా, ఇండియా మరియు ఇంగ్లాండ్ చాలాదూరంలో ఉన్నపట్టికీ, నదీమ్ మరియు శ్రవణ్ కలసే మ్యూజిక్ చేసేవారు. కానీ వారు దోస్తీ తరువాత విడిపోయారు.

విడిపోవడం మరియు తిరిగి కలవడం[మార్చు]

2005లో ఈ ద్వయం విడిపోయారు, పైకి కనబడే కారణం, శ్రవణ్‌కి తన సంగీతాన్ని కొనసాగించడం మీద ఆసక్తి లేకపోవడం మరియు తన కొడుకు సంగీత గమనం మీద & సినిమా తీయడం మీద దృష్టి పెట్టడం ఉన్నాయి. ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి వేరే కారణం ఉండవచ్చు.[4]

పురస్కారాలు మరియు నామినేషన్లు[మార్చు]

నదీమ్-శ్రవణ్, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డ్ ను ఈ క్రింది సినిమాలకు గెలుచుకున్నారు: పురస్కారాలు మరియు ఎంపికలు

వరుస సంఖ్య అవార్డ్ నామినేషన్లు చలనచిత్రం
1 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ - గెలుచుకున్నారు ఆషికీ (1990) ...
2 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ - గెలుచుకున్నారు సాజన్ (1991) ...
3 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి - ఎంపికయ్యారు ఫూల్ ఔర్ కాంటే (1991)
4 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ - గెలుచుకున్నారు దీవానా (1992)
5 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి - ఎంపికయ్యారు. హమ్ హై రాహి ప్యార్ కే (1993)
6 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి - ఎంపికయ్యారు రాజా (1995)
7 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ - గెలుచుకున్నారు రాజా హిందుస్తానీ (1996)
8 స్టార్ స్క్రీన్ ఉత్తమ సంగీత దర్శకుడు - గెలుచుకున్నది రాజా హిందుస్తానీ (1996)
9 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి - ఎంపికయ్యారు పరదేశ్ (1997)
10 స్టార్ స్క్రీన్ ఉత్తమ సంగీత దర్శకుడు - గెలుచుకున్నది పరదేశ్ (1997)
11 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి - ఎంపికయ్యారు ధడకన్ (2000)
12 స్టార్ స్క్రీన్ ఉత్తమ సంగీత దర్శకుడుగా - ఎంపికయ్యారు ధడకన్ (2000)
13 IIFA ఉత్తమ సంగీత దర్శకుడుగా - ఎంపికయ్యారు ధడకన్ (2000)
14 ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డుకి - ఎంపికయ్యారు రాజ్ (2002)
15 ఉత్తమ సంగీత దర్శకుడిగా జీ సిని అవార్డ్ - గెలుచుకున్నారు రాజ్ (2002)
16 ఉత్తమ సంగీత దర్శకుడిగా జీ సిని అవార్డ్ - ఎంపికయ్యారు అందాజ్ (2003)

నదీమ్ శ్రవణ్, 2002లో రాజ్ సినిమా కొరకు ఇంకొక ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ని దురదృష్టవశాత్తు పోగొట్టుకొన్నారు, ఈ సినిమాలోని పాటలు ఆ సంవత్సరంలో వచ్చిన ఇతర పాటలకంటే ఎక్కువ జనామోదాన్ని పొందాయి, చివరకు ఆ అవార్డ్ సాతియా సినిమా కొరకు A R రెహమాన్‌కు లభించింది.

డిస్కోగ్రఫీ[మార్చు]

 1. దంగల్ (భోజ్ పూరి) (1979)
 2. బెబస్సి (1982)
 3. అన్మోల్ సితారే (1982)
 4. నయా సఫర్ (1982)
 5. మైనే జీనా సీఖ్ లియా (1982)
 6. అపరాధి కౌన్? (1982)
 7. జాఖ్మి ఇన్సాన్ (1982)
 8. చీఖ్ (1985)
 9. విక్రం భేతాళ్ (1986)
 10. ఖూని మహాల్ (1987)
 11. జుల్మ్ కో జలా దూంగా (1988)
 12. ఇలాక (1989)
 13. హిసాబ్ ఖూన్ కా (1989)
 14. లష్కర్ (1989)
 15. బాప్ నంబరి బేటా దస్ నంబరి (1990)
 16. సోలః సత్త్రా (1990)
 17. మేరె హందం (1990)
 18. ప్యార్ ప్యార్ (1990)
 19. ఆషికీ (1990) ...
 20. అప్మాన్ కి ఆగ్ (1990)
 21. లాల్ పరీ (1990)
 22. శందార్ (1990)
 23. జిగార్వాల (1991)
 24. జాన్ కీ కసం (1991)
 25. ఆంచల్ తేరా ధల్క హు (1991)
 26. ఆప్ కి యాదేన్ (1991)
 27. దిల్ హైకి మాంత నహిన్ (1991)
 28. సాజన్ (1991) ...
 29. సాథీ (1991)
 30. ఫూల్ ఔర్ కాంటే (1991)
 31. ప్యార్ కా సాయా (1991)
 32. సడక్ (1991)
 33. దిల్ కా క్యా కసూర్ (1992)
 34. సప్నే సాజన్ కే (1992) ...
 35. జాన్ తేరే నామ్ (1992)
 36. దిల్ వాలే కభి న హారే (1992)
 37. పాయల్ (1992)
 38. దీవానా (1992)
 39. బేఖుది (1992)
 40. కల్ కి అవాజ్ (1992)
 41. జునూన్ (1992)
 42. ఆనం (1992)
 43. పనాః (1992)
 44. శ్రీమాన్ ఆషిక్ (1993)
 45. సంగ్రాం (1993)
 46. బల్మా (1993)
 47. కైసే కైసే రిష్తే (1993)
 48. ధర్తీ పుత్ర (1993)
 49. ఆద్మీ ఖిలోన హై (1993)
 50. దివ్యశక్తి (1993)
 51. దామిని (1993)
 52. వక్త్ హమారా హై (1993)
 53. క్రిషణ్ అవతార్ (1993)
 54. హమ్ హై రాహి ప్యార్ కే (1993)
 55. రంగ్ (1993)
 56. సైనిక్ (1993)
 57. దిల్ తేరా ఆషిక్ (1993)
 58. తడిపార్ (1993)
 59. క్రాంతి క్షేత్ర (1994)
 60. ఆతిష్ (1994)
 61. చోటీ బహు (1994)
 62. ఏక్ రాజా రాణి (1994)
 63. సయేశ -- మ్యూజిక్ ఆల్బం (1994)
 64. దిల్ వాలే (1994)
 65. సలామి (1994)
 66. సాజన్ కా ఘర్ (1994)
 67. స్టంట్ మాన్ (1994)
 68. ఆందోళన్ (1995)
 69. గద్దార్ (1995)
 70. జామానా దీవానా (1995)
 71. సాజన్ కి బహోన్ మైన్ (1995)
 72. బర్సాత్ (1995)
 73. అనోఖ అందాజ్ (1995)
 74. తేరి మోహబ్బత్ మైన్ (1995)
 75. అల్ టైం హిట్స్ (1995)
 76. రాజా (1995)
 77. అగ్నిసఖి (1996)
 78. మజ్దార్ (1996)
 79. జంగ్ (1996)
 80. సాజన్ చలే ససురాల్ (1996)
 81. జీత్ (1996)
 82. రాజా హిందుస్తానీ (1996)
 83. హిమ్మత్వార్ (1996)
 84. సజని (1996)
 85. జుదాయి (1997)
 86. జీవన్ యుద్ (1997)
 87. మోహబ్బత్ (1997)
 88. నసీబ్ (1997)
 89. హాయ్ అజనబీ (1997)
 90. సాత్ రంగ్ కే సప్నే (1997)
 91. పరదేశ్ (1997)
 92. మహారాజ (1998)
 93. ఆ అబ్ లౌట్ చలేన్ (1999)
 94. సిర్ఫ్ తుం (1999)
 95. ధడకన్ (2000)
 96. కసూర్ (2001)
 97. ఏక్ రిష్ఠ (2001)
 98. హమ్ హో గయే ఆప్కే (2001)
 99. ఎహ్ దిల్ ఆషిక్నా (2002)
 100. హా మైనే భీ ప్యార్ కియా (2002)
 101. రాజ్ (2002)
 102. అన్ష్ (2002)
 103. తుమ్సే అచ్చా కౌన్ హై (2002)
 104. హమ్ తుమ్హారే హైన్ సనం -- (2 పాటలు) (2002)
 105. దిల్ హై తుమ్హారా (2002)
 106. జీనా సిర్ఫ్ మేరె లియే (2002)
 107. దిల్ కా రిష్ఠ (2003)
 108. ఇండియన్ బాబు (2003)
 109. ఎహ్ దిల్ (2003)
 110. అందాజ్ (2003)
 111. ఖయామత్ (2003)
 112. హంగామా (2003)
 113. ఫుట్ పాత్ (2003)
 114. జిందా దిల్ (౨౦౦౩)
 115. రాజా భయ్యా (2003)
 116. షీన్ (2004)
 117. తుంసే నహిన్ దేఖా (2004)
 118. హత్య - ది మర్డర్ (2004)
 119. బేవఫా (2005)
 120. బర్సాత్: ఎ సబ్ లైమే లవ్ స్టొరీ (2005)
 121. Dosti: Friends Forever (2005)
 122. మేరే జీవన్ సాథి (2006)
 123. గుమ్నాం – ది మిస్టరీ (2008)
 124. డు నాట్ డిస్టర్బ్ (2009)
 125. సునీల్ దర్శన్ నెక్స్ట్ (2009)
 126. రహ్బర్ (2009)
 127. సనం తేరి కసం (2009)
 128. భాన్వారా (రాబోవు చిత్రం)

రికార్డు అమ్మకాల మీద ప్రభావం[మార్చు]

ఇండియాలో 1990-2004 వరకు అమ్మకాల నిజాలు: మొత్తం 15 సంవత్సరాలలో, నదీమ్-శ్రవణ్ ఆల్బం మొదటి 3 స్థానాలలో లేకుండా వున్నది కేవలం 4 సంవత్సరాలు. అవి 2002, 1999, 1998, 1994

క్రింద ఇవ్వబడినది సంవత్సరాల వారీగా విశ్లేషణ

సంవత్సరం శ్రేణి (ఇండియాలో అమ్మకాలపరంగా పొందిన స్థానం)
1990 1-ఆషికీ
1991 1-సాజన్ 2-ఫూల్ ఔర్ కాంటే 3-సడక్, మొత్తం మూడు.
1992 1-దీవానా
1993 1-దిల్ వాలే
1994 లేదు
1995 2-రాజా
1996 1-రాజా హిందుస్తానీ 3-అగ్నిసాక్షి
1997 2-పరదేశ్
1998 లేదు
1999 లేదు
2000 2-ధడకన్
2001 3-రాజ్
2002 లేదు
2003 2-అందాజ్
2004 2-బేవఫా

విక్రయాలు[మార్చు]

మొత్తం రికార్డ్‌ల అమ్మకాలు :[5]

స్థానం చలనచిత్రం సంవత్సరం అమ్మబడిన రికార్డ్ ల సంఖ్య
1 ఆషికీ 1990 18,000,000
3 రాజా హిందుస్తానీ 1996 11,000,000
8 సాజన్ 1991 7,000,000
9 ఫూల్ ఔర్ కాంటే 1991 6,000,000
10 పరదేశ్ 1997 6,000,000
11 దిల్ వాలే 1994 5,500,000
13 సడక్ 1991 5,000,000
15 దీవానా 1992 4,500,000
16 ధడకన్ 2000 4,000,000
17 అందాజ్ 2003 1,785,761

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]