నమ్మ మెట్రో
| నమ్మ మెట్రో | |||
|---|---|---|---|
| ముఖ్య వివరాలు | |||
| Owner | బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ | ||
| స్థానిక ప్రదేశం | బెంగళూరు | ||
| ట్రాన్సిట్ రకం | వేగ రవాణా | ||
| లైన్ల సంఖ్య | 3 | ||
| స్టేషన్ల సంఖ్య | 83[1] | ||
| వార్షిక ప్రయాణికులు | 23.28 కోట్లు (2023)[2]క్వ్ | ||
| ప్రధానకార్యాలయం | BMTC కేంద్ర కార్యాలయం, సారిగె సదన, కెంగల్ హనుమంతయ్య రోడ్, బెంగళూరు | ||
| నిర్వహణ | |||
| ప్రారంభమైన కార్యాచరణ | 20 అక్టోబరు 2011 | ||
| వాహనాల సంఖ్య | 63 | ||
| రైలు పొడవు | 6 కోచ్‌లు[3] | ||
| సాంకేతిక అంశాలు | |||
| వ్యవస్థ పొడవు | ఆపరేషన్లో 96.10 km (59.71 mi) ; నిర్మాణంలో (Ph 2, 2A, 2B) 79.44 km (49.36 mi) | ||
| ట్రాక్‌ల సంఖ్య | 2 | ||
| ట్రాక్ గేజ్ | 1,435 mm (4 ft 8+1⁄2 in) standard gauge | ||
| విద్యుదీకరణ | 750 V DC third rail | ||
| సరాసరి వడి | 35 km/h (22 mph)[4] | ||
| అత్యధిక వడి | 80 km/h (50 mph) | ||
| |||
నమ్మ మెట్రో (మన మెట్రో), కర్ణాటక రాష్ట్ర రాజధాని నగరం బెంగళూరు నగరానికి సేవలందించే వేగవంతమైన రవాణా వ్యవస్థ. 96.1 కిలోమీటర్ల పొడవుతో, నమ్మ మెట్రో భారతదేశంలో రెండవ అతిపెద్ద మెట్రో నెట్‌వర్కు.[5] 2011 లో ప్రారంభమైనపుడు ఇది, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మెట్రో వ్యవస్థ. తరువాత 2016 లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి భూగర్భ మెట్రోగా కూడా అయింది.[6] నమ్మ మెట్రోలో భూగర్భ, నేల మీద (ఎట్ గ్రేడ్), ఎత్తున ఉండే (ఎలివేటెడ్) స్టేషన్లు మూడు రకాలూ ఉన్నాయి. 2025 ఆగస్టు నాటికి నమ్మ మెట్రో లోని 83 స్టేషన్లలో, 74 ఎలివేటెడ్ స్టేషన్లు, ఎనిమిది భూగర్భ స్టేషన్లు, ఒకటి ఎట్-గ్రేడ్ స్టేషనూ ఉన్నాయి. ఈ వ్యవస్థ ప్రామాణిక-గేజ్[గమనిక 1] ట్రాక్‌లపై నడుస్తుంది.[7]
భారత ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ అయిన బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL), నమ్మ మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించడం, నిర్వహించడం, విస్తరించడం చేసే ఏజెన్సీ.[8] మెట్రో సేవలు ప్రతిరోజూ ఉదయం 05:00 నుండి రాత్రి 24:00 గంటల వరకు నడుస్తాయి. రైలుకూ రైలుకూ మధ్య సమయం 3 నుండి 15 నిమిషాల ఉంటుంది.[9][10] తొలుత రైళ్లు, మూడు కోచ్‌లతో ప్రారంభమయ్యాయి, కానీ తరువాత, ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో అన్ని రేక్‌లను ఆరు కోచ్‌లుగా మార్చారు.[11] రైలుకు మూడవ పట్టా[గమనిక 2] ద్వారా 750 V డైరెక్ట్ కరెంటును సరఫరా చేస్తారు.[గమనిక 3]
నేపథ్యం
[మార్చు]1977లోనే బెంగళూరు నగరానికి మెట్రో అనే సామూహిక వేగవంతమైన రవాణా ప్రాజెక్టును పరిశీలించాలని రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం సిఫార్సు చేసింది. మెట్రో అధ్యయనం అవసరమని ఉన్నత స్థాయి కమిటీ కూడా అంగీకరించింది. 1981లో దక్షిణ రైల్వే (SR) నుండి ఒక బృందాన్ని దీని కోసం నియమించింది. దక్షిణ రైల్వే బృందం 80 km (49.7 mi) పొడవుతో కమ్యూటర్ రైలు మార్గాలు, వృత్తాకార రైల్వేతో పాటు, రెండు కారిడార్ల మెట్రోను సిఫార్సు చేసింది.[12]
1993లో, కర్ణాటక రాష్ట్రం సామూహిక వేగవంతమైన రవాణాను పరిశీలించడానికి మరొక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1983లో SR ప్రతిపాదించిన అదే మెట్రో ప్రాజెక్టును అదే వృత్తాకార రైల్వేతో పాటు సిఫార్సు చేసింది. [12] ఆ తర్వాత రాష్ట్రం 1994లో సామూహిక వేగవంతమైన రవాణా ప్రాజెక్టు కోసం ప్రభుత్వ/ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పే ఆలోచనలతో బెంగళూరు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ లిమిటెడ్ (BMRTL)ను సృష్టించింది. సామూహిక వేగవంతమైన రవాణా ప్రాజెక్టుకు అంకితమైన ప్రత్యేక నగర సెస్‌ను ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టింది. BMRTL ఒక సాధ్యాసాధ్య అధ్యయనాన్ని ప్రారంభించింది. ఇది ఎలివేటెడ్, LRT-ఆధారిత, ఆరు మార్గాల్లో 300 km (186.4 mi) పొడవైన నెట్‌వర్కు ఆలోచనను ముందుకు తెచ్చింది. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ నేతృత్వంలోని ఒక ప్రైవేట్ కన్సార్టియం BOT ప్రాతిపదికన, ఆ ప్రాజెక్టు మరింత అభివృద్ధిని చేపట్టింది. అయితే, ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. [12]
తరువాత 2003 లో, కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీ మెట్రోను విజయవంతంగా అభివృద్ధి చేసిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)ను బెంగళూరులో మెట్రో కోసం వివరణాత్మక తయారీ అధ్యయనాన్ని నిర్వహించడానికి నియమించింది, ఇది ఢిల్లీలో ఉపయోగించే విధానం సాంకేతిక, ఆర్థిక అంశాలను అనుకరిస్తుంది. ఈ అధ్యయనం 60 km (37.3 mi), 50 km (31.1 mi) పొడవుతో 2-లైన్ల క్రాస్ ఆకారపు మెట్రోను సిఫార్సు చేసింది. ఈ లైన్లు కలిసే స్థానం, బెంగళూరులోని సెంట్రల్ రైల్వే స్టేషన్ వద్ద పూర్తిగా భూగర్భంలో ఉంటుంది. ఆర్థిక రాబడి రేటు 22.3% గా అంచనా వేసారు. ఆర్థిక అంచనాలో వడ్డీ చెల్లింపులకూ కొంత తరుగుదలకూ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని భావించారు. ఛార్జీల ఆదాయం ప్రత్యక్ష నిర్వహణ ఖర్చుల కంటే కొంత ఎక్కువగా ఉంటుందని ఊహించింది. ప్రభుత్వం దీన్ని అంగీకరించింది. BMRTL ను రద్దు చేసి, దాని స్థానంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ను తెచ్చింది. [12]
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (DMRC) 2003 మేలో నమ్మ మెట్రో మొదటి దశ కోసం వివరణాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసి సమర్పించింది [13] ఈ DPR 33 km (20.51 mi), 2-లైన్ల క్రాస్ ఆకారపు కోసం సిద్ధం చేసింది. ప్రామాణిక గేజ్ ఉపయోగించి ప్రాజెక్టు మొదటి దశ కోసం 32 స్టేషన్లతో ఈ నెట్‌వర్కు ఉంటుంది. ఈ ప్రాజెక్టును కేంద్ర మంత్రివర్గం 2006 ఏప్రిల్ 25 న ఆమోదించింది.[14][15][16]
నిర్మాణం
[మార్చు]దశ 1
[మార్చు]2006 జూన్ 24 న అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫేజ్-1 నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు.[17] తూర్పు-పశ్చిమ కారిడార్ (తరువాత పర్పుల్ లైన్ అని పేరు పెట్టారు) లోని రీచ్-2006 నిర్మాణాన్ని 1లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారు. బైయ్యప్పనహళ్లి, మహాత్మా గాంధీ రోడ్డు మధ్య పర్పుల్ లైన్ మొదటి విభాగంలో (రీచ్-1) సివిల్ నిర్మాణం 2007 ఏప్రిల్ 15 న ప్రారంభమైంది.[18]
ఉత్తర-దక్షిణ కారిడార్ (తరువాత గ్రీన్ లైన్ అని పేరు పెట్టారు) ఉత్తర పొడిగింపు ( యశ్వంతపుర నుండి నాగసంద్ర వరకు), దక్షిణ పొడిగింపు (రాష్ట్రీయ విద్యాలయ రోడ్డు నుండి యెలచెనహళ్లి వరకు) కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) 2007 అక్టోబరు, 2008 జూన్ లో సమర్పించారు. ఈ పొడిగింపులతో, మొదటి దశలో మార్గం మొత్తం పొడవు 42.3 km (26.28 mi) కు చేరుకుంది. మెట్రోను ఉత్తర, దక్షిణ చివరలలో ఔటర్ రింగ్ రోడ్‌కు అనుసంధానించడం, వాయవ్యంలో పీన్యాలోని పారిశ్రామిక ప్రాంతాలను కూడా కవర్ చేయడం, తద్వారా మెరుగైన కనెక్టివిటీని అందించడం, ప్రయాణీకుల సంఖ్యను పెంచడం దీని లక్ష్యం. 2008 అక్టోబరులో కర్ణాటక ప్రభుత్వం ఈ పొడిగింపును ఆమోదించింది, దీనికి అదనంగా ₹1,763 కోట్లు (US$250 మిలియన్లు) ఖర్చవుతుంది.[19]
భూగర్భ విభాగం
[మార్చు]
మొదటి దశ లోని రెండు లైన్లకు నగర కేంద్రంలో సొరంగ విభాగాలున్నాయి. ఇవి దక్షిణ భారతదేశంలో నిర్మించిన మొదటి మెట్రో సొరంగాలు.[6] భూగర్భ విభాగాల నిర్మాణం 2012 చివరిలో ప్రారంభమైంది. DPR ను సమూలంగా సవరించాల్సి రావడం, బిడ్‌ల ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో 2008 ప్రారంభంలో పిలిచిన ప్రారంభ టెండర్లను రద్దు చేయడం వంటి కారణాల వలన ఆలస్యం జరిగింది.[20] 2009 చివరిలో భారీ మెజెస్టిక్ ఇంటర్-చేంజ్ స్టేషన్‌ను ప్రత్యేక ప్యాకేజీగా రెండవ సారి టెండర్లు పిలిచారు.[21] 2011లో సొరంగ విభాగాలకు కాంట్రాక్టులను ఇవ్వగా, 2012లో నిర్మాణం ప్రారంభమైంది.
ఈ సొరంగాలు దాదాపు 60 feet (18.3 m) కంటే దిగువన, 5.6 మీటర్ల వ్యాసంతో, ఒకదాన్నుండి మరొకటి 9 మీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ సొరంగాలను తవ్వే TBM లకు హెలెన్, మార్గరిటా, [22] కావేరి, కృష్ణ, గోదావరి అనే పేర్లు పెట్టారు.[23]
తూర్పు-పడమర కారిడార్‌లో UG1 భూగర్భ విభాగపు సొరంగాల తవ్వకం 2014 మార్చి 17న పూర్తయింది. [24] కబ్బన్ పార్కు, మాగాడి రోడ్‌ల మధ్య 4.8 కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు, 3వ రైలు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పర్పుల్ లైన్ తూర్పు-పడమర సొరంగంలో 2015 నవంబరు 23 న ట్రయల్స్ ప్రారంభించింది. పర్పుల్ లైన్ మొత్తం విస్తరణ 2016 ఏప్రిల్ 29 న ప్రారంభించబడింది.[25]
ఉత్తర-దక్షిణ కారిడార్‌లో UG2 భూగర్భ విభాగం యొక్క టన్నెల్ బోరింగ్ 2016 సెప్టెంబరు 23 న పూర్తయింది. TBM గోదావరి కట్టర్ హెడ్ విరిగిపోయి విడిభాగాల కోసం వేచి ఉండాల్సి రావడంతో సొరంగం నిర్మాణంలో పెద్ద జాప్యం జరిగింది. [26] సంపిగే రోడ్, నేషనల్ కాలేజీ మధ్య 4 కిలోమీటర్ల గ్రీన్ లైన్ తూర్పు-పడమర సొరంగంపై ట్రయల్ రన్లు 2017 మార్చి 31న మొదలయ్యాయి. గ్రీన్ లైన్ 2017 జూన్ 19న మొదలవడంతో, ప్రాజెక్టు మొదటి దశ పూర్తయింది. [27]

ప్రారంభోత్సవం
[మార్చు]గడువు తేదీలు దాటిపోయిన తర్వాత, నమ్మ మెట్రో మొదటి విభాగం (రీచ్-1) చివరకు 2011 అక్టోబరు 20 న మొదలైంది.[28][29][30] కార్యకలాపాలు ప్రారంభించినప్పుడు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. BMRCL వర్గాల ప్రకారం, కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి 3 రోజుల్లోనే 1,69,019 మంది మెట్రోలో ప్రయాణించారు. [31] 4వ రోజు చివరి నాటికి, దాదాపు 2,00,000 మంది ప్రయాణీకులు మెట్రోలో ప్రయాణించారు. నమ్మ మెట్రో మొదటి 12-రోజుల సంచిత ఆదాయం ₹1 కోటి (US$100,000). [32]
గ్రీన్ లైన్ ఉత్తర విభాగాన్ని (రీచ్ 3, 3A, 3B) మొదట 2012 చివరి నాటికి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఇది ఆలస్యమై, చివరికి 2014 మార్చి 1 న మొదలైంది.[33] తొలిరోజున దాదాపు 25,000 మంది ప్రయాణీకులు ఈ లైన్‌లో ప్రయాణించారని BMRCL MD ప్రదీప్ సింగ్ ఖరోలా పేర్కొన్నారు. [34] కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి నెలలో, 7.62 లక్షల మంది ఈ లైన్‌ను ఉపయోగించారు, సగటున రోజుకు 24,605 మంది ప్రయాణించారు, దీని ద్వారా ₹1.5 కోట్లు (US$210,000) ఆదాయం వచ్చింది.
మొదటి భూగర్భ విభాగం (పర్పుల్ లైన్‌లో) 2016 ఏప్రిల్ 30 న కార్యకలాపాలు ప్రారంభించింది. ఇది నగర తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని అందిస్తుంది. తదనంతరం, రెండవ భూగర్భ విభాగాన్ని, దక్షిణ ప్రాంత మార్గాలతో సహా (ఉదాహరణకు రీచ్ 4, 4A) 2017 జూన్ 18న ప్రారంభించారు.[35]
పర్పుల్ లైన్ లోని భూగర్భ విభాగం తెరవడంతో తూర్పు, పశ్చిమ ప్రాంతాలు ఒకదానికొకటి అనుసంధానమయ్యాయి. దాంతో ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉత్తర-దక్షిణ భూగర్భ విభాగం తెరిచిన తర్వాత (దక్షిణంలో ఎలివేటెడ్ రీచ్ 4,4A తో ఏకకాలంలో), లైన్ల మధ్య ఇంటర్‌ఛేంజ్‌తో నెట్‌వర్కు నాలుగు దిశల లోనూ కనెక్టివిటీ ఏర్పడింది. ఇది రైడర్‌షిప్‌ను మరింత పెంచింది. రైడర్‌షిప్ పెరుగుతూనే పోయింది. 2019 సెప్టెంబరు నాటికి ప్రతిరోజూ 4,50,000 మంది మెట్రోను వాడుతున్నారు.[36]
మొదటి దశ లైన్లు, విభాగాలు
[మార్చు]
మొదటి దశలోని 42.30 kilometres (26.28 mi) మొత్తం పొడవులో, దాదాపు 8.82 kilometres (5.48 mi) భూగర్భంలోను, దాదాపు 33.48 kilometres (20.80 mi) భూమిపై ఎత్తులోనూ ఉంది.[37] ఈ దశలో ఉన్న 40 స్టేషన్లలో ఏడు భూగర్భంలోను, ఒకటి నేలపైన, 32 స్టేషన్లు ఎత్తుమీదా ఉన్నాయి.[38]
ఈ ప్రాజెక్టు మొదటి దశ ఖర్చు మొదట ₹6,395 కోట్లుగా అంచనా వేశారు. [39] రూట్ పొడిగింపులు, ఖర్చు పెరుగుదలలతో, దీనిని తరువాత ₹11,609 కోట్లుగా సవరించారు. నిర్మాణ సమయంలో చాలా జాప్యాలు జరిగాయి, ఫలితంగా, అనేక వాయిదాలు పడ్డాయి. మృదువైన నేల, అధిక భూగర్భజల మట్టాలు, గట్టి గ్రానైట్, పెద్ద బండరాళ్ల మిశ్రమంతో భూగర్భంలో ఉన్న క్లిష్ట భౌగోళిక పరిస్థితులు టన్నెల్ బోరింగ్‌కు ప్రధాన అడ్డంకిగా మారాయి. గోదావరి TBM కట్టర్ హెడ్ విరగడంతో పెద్ద ఆలస్యం జరిగింది, దీని కోసం ఇటలీ నుండి విడిభాగాలను ఆర్డర్ చేయాల్సి వచ్చింది.[40][41] మొదటి దశలో 42.3 km (26.28 mi) పొడవుతో రెండు లైన్లతో పూర్తయి, 2017 జూన్ 19 న ప్రజలకు అందుబాటు లోకి వచ్చింది. ఈ దశలో అయిన తుది ఖర్చు ₹14,405 కోట్లు.[42]
రెండవ దశ
[మార్చు]డిఎమ్‌ఆర్‌సి చేత రెండవ దశ డీపీఆర్‌ను తయారుచేయించే ప్రతిపాదనను 2011 జనవరి 4 న రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.[43] రెండవ దశపై ముందుకు పోయేందుకు హై పవర్ కమిటీ (HPC) 2011 జూలైలో సూత్రప్రాయంగా ఆమోదించింది. కర్ణాటక ప్రభుత్వం 2012 జనవరి 3 న దీనికి ఆమోదం తెలిపింది.[44][45] అయితే, డిపిఆర్ తయారీలోను, దానిపై కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించడం లోనూ జాప్యం జరిగింది.[20] 2013 ఆగస్టులో రెండవ దశకు ఎక్స్పెండిచర్ ఫైనాన్స్ కమిటీ (EFC) క్లియరెమ్సు నిచ్చింది. ఎట్టకేలకు 2014 జనవరి 30 న, రెండవ దశ ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది.[46]
2011-12 ధరల ప్రకారం 5 సంవత్సరాల పాటు ఏటా 5% పెరుగుదలతో ఫేజ్-2 అంచనా వ్యయం ₹26,405 కోట్లు.[47] రాష్ట్ర ప్రభుత్వం ₹9,000 కోట్లు అందిస్తుంది. [48] కేంద్ర సుంకాల పెరుగుదల కారణంగా పేరిగే ప్రాజెక్టు వ్యయభారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇతర ఖర్చు పెరుగుదలలను రాష్ట్రం, BMRCL భరించాల్సి ఉంటుంది. ఫేజ్-2 మొత్తం ప్రాజెక్టు వ్యయం నిర్మాణం ప్రారంభంలోనే ₹30,000 కోట్లు చేరుకుంటుందని అంచనా వేసారు. 2018 అక్టోబరులో ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ ఫేజ్-2 ఖర్చు దాదాపు ₹32,000 కోట్లు ఉంటుందని చెప్పాడు.[49] 2025 మేలో కర్ణాటక ప్రభుత్వం రూ.9,729 కోట్ల ఖర్చు పెరుగుదలను ఆమోదించింది. ఆ విధంగా, రెండవ దశ ఖర్చును రూ.40,425 కోట్లుగా సవరించారు.
చల్లఘట్ట వరకు 3.195 కి.మీ. పొడిగింపు తర్వాత, రెండవ దశ మొత్తం పొడవు 75.29 కి.మీ. అయింది. అందులో 13.79 కి.మీ. పొడవు భూగర్భంలో, 0.48 km (0.298 mi) నేల మీద, 61.37 km (38.13 mi) పొడవు, ఎత్తు మీద ఉంటుంది. 62 కొత్త స్టేషన్లు నెట్‌వర్కులో చేరతాయి. వాటిలో 12 భూగర్భంలో ఉన్నాయి.[50] ఫేజ్-2లో భాగంగా, రెండు ఫేజ్-1 లైన్లను ఇరువైపులా విస్తరించడం, రెండు కొత్త లైన్ల నిర్మాణం ఉన్నాయి.[51]
నెట్‌వర్కు
[మార్చు]అవలోకనం
[మార్చు]| ఆపరేషన్లో ఉన్న లైన్లు | ||||||||
|---|---|---|---|---|---|---|---|---|
| క్ర.సం | లైన్ పేరు | ఆద్యంత స్టేషన్లు | స్టేషన్ల సంఖ్య | పొడవు (కి.మీ.) | తెరచిన తేదీ | చివరి సారి పొడిగించిన తేదీ | ||
| 1 | పర్పుల్ | చల్లఘట్ట | వైట్‌ఫీల్డ్ (కాడుగోడి) | 37 | 43.49 | 20 అక్టో 2011 | 9 అక్టో 2023 | |
| 2 | గ్రీన్ | సిల్క్ ఇన్‌స్టిట్యూట్ | మాదవర | 32 | 33.46 | 1 మార్చి 2014 | 07 నవంబ24 | |
| 3 | యెల్లో | రాష్ట్రీయ విద్యాలయ రోడ్ | డెల్టా ఎలక్ట్రానిక్స్, బొమ్మసాంద్ర | 16 | 19.15 | 11-Aug-25 | ||
| 83 | 96.1 | |||||||
| నిర్మాణంలో ఉన్న లైన్లు | ||||||||
| క్ర.సం | లైన్ పేరు | ఆద్యంత స్టేషన్లు | స్టేషన్ల సంఖ్య | పొడవు (కి.మీ.) | ప్రారంభ తేదీ అంచనా | |||
| 4 | కలేన అగ్రహార | తావరెకెరె | 6 | 7.5 | 2026 మే | |||
| తావరెకెరె | నాగవర | 12 | 13.76 | 2026 డిసెంబరు | ||||
| 5 | సెంట్రల్ సిల్క్ బోర్డు | కృష్ణరాజపుర | 13 | 16.75 | 2026 సెప్టెంబరు | |||
| కృష్ణరాజపుర | హెబ్బళ్ | 8 | 12.35 | 2027 డిసెంబరు | ||||
| హెబ్బళ్ | KIAL టెర్మినళ్ళు | 8 | 30.09 | |||||
| 46 | 79.44 | |||||||
| ఆమోదించినవి | ||||||||
| క్ర.సం | లైన్ పేరు | ఆద్యంత స్టేషన్లు | స్టేషన్ల సంఖ్య | పొడవు (కి.మీ.) | ప్రారంభ తేదీ అంచనా | |||
| 6 | ఆరెంజ్ | కెంపపుర | జయప్రకాష్ నగర్ 4థ్ ఫేజ్ | 22 | 32.15 | 2031 | ||
| 7 | గ్రే | శ్రీ బాలగంగాధరనాథ స్వామీజీ స్టెషన్, హొసహళ్ళి | కడబగెరె | 9 | 12.5 | |||
| 8 | రెడ్ | హెబ్బళ | సర్జాపుర | 28 | 37 | 2031 | ||
| 59 | 81.65 | |||||||
| మొత్తం వ్యవస్థ (ఆపరేషన్లో ఉన్నవి, నిర్మాణంలో ఉన్నవి, ఆమోదించినవీ అన్నీ కలుపుకుని) | 188 | 257.19 | ||||||
విస్తరణ
[మార్చు]మరిన్ని కొత్త లైన్లు, పాత లైన్ల పొడిగింపులూ నిర్మాణంలో ఉన్నాయి. పూర్తయిన తర్వాత, 2వ దశ నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీని, వైట్‌ఫీల్డ్ లోని టెక్ హబ్‌లను కలుపుతుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోని తూర్పు సగాన్ని కూడా కలుపుతుంది. నగరానికి ఉత్తరాన ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నెట్‌వర్కు లోకి తీసుకువస్తుంది.[52][53]

| మొదటి దశ నెట్‌వర్కు | ||||||
|---|---|---|---|---|---|---|
| . లేదు. | లైన్ పేరు | టెర్మినల్స్ | స్టేషన్లు | దూరం (km) | ప్రారంభ తేదీ | |
| 1 | పర్పుల్ | బైయప్పనహళ్ళి | మహాత్మా గాంధీ రోడ్ | 6 | 6.70 km (4.16 mi) | 2011 అక్టోబరు 20 |
| మహాత్మా గాంధీ రోడ్ | మాగాడి రోడ్ | 5 | 5.12 km (3.18 mi) | 2016 ఏప్రిల్ 30 | ||
| మాగడి రోడ్ | మైసూరు రోడ్ | 6 | 6.40 km (3.98 mi) | 2015 నవంబరు 16 | ||
| 2 | <span id="mwA-w" style="color:white;"><b id="mwA-0">గ్రీన్</b></span> | మంత్రి స్క్వేర్ సంపిగే రోడ్ | పీన్యా ఇండస్ట్రీ | 10 | 9.91 km (6.16 mi) | 2014 మార్చి 1 |
| పీన్యా పరిశ్రమ | నాగసంద్ర | 3 | 2.50 km (1.55 mi) | 2015 మే 1 | ||
| మంత్రి స్క్వేర్ సంపిగే రోడ్ | యెలచెనహళ్లి | 11 | 11.62 km (7.22 mi) | 2017 జూన్ 18 | ||
| 40 | 42. 3 కి. మీ. | |||||
| రెండవ దశ నెట్‌వర్కు (Ph 2A/B తో సహా) | ||||||
| . లేదు. | లైన్ పేరు | టెర్మినల్స్ | స్టేషన్లు | దూరం (km) | ప్రారంభ తేదీ | |
| 1 | పర్పుల్ | మైసూరు రోడ్ | కెంగేరి | 6 | 7.50 km (4.66 mi) | 2021 ఆగస్టు 30 |
| కెంగేరి | చల్లఘట్ట | 1 | 2.05 km (1.27 mi) | 2023 అక్టోబరు 9 | ||
| బైయప్పనహళ్ళి | కృష్ణరాజపురం | 1 | 2.10 km (1.30 mi) | 2023 అక్టోబరు 9 | ||
| కృష్ణరాజపురం | వైట్ఫీల్డ్ (కాడుగోడి) | 12 | 13.71 km (8.52 mi) | 2023 మార్చి 26 | ||
| 2 | <span id="mwBEQ" style="color:white;"><b id="mwBEU">గ్రీన్</b></span> | యెలచెనహళ్లి | సిల్క్ ఇన్స్టిట్యూట్ | 5 | 6.29 km (3.91 mi) | 2021 జనవరి 15 [54] |
| నాగసంద్ర | మాదవర | 3 | 3.14 km (1.95 mi) | 2024 నవంబరు 7 | ||
| 3 | Yellow | రాష్ట్రీయ విద్యాలయ రోడ్ | డెల్టా ఎలక్ట్రానిక్స్ బొమ్మసంద్ర | 16 | 19.15 km (11.90 mi) | 2025 ఆగస్టు 11 [55] |
| 4 | Pink | కలేనా అగ్రహార | తవారేకెరే | 6 | 7.5 km (4.7 mi) | మే 2026[56] |
| తవారేకెరే | నాగవారా | 12 | 13.75 km (8.54 mi) | డిసెంబరు 2026[56] | ||
| 5 | Blue | సెంట్రల్ సిల్క్ బోర్డు | కృష్ణరాజపురం | 13 | 16.75 km (10.41 mi) | సెప్టెంబరు 2026 |
| కృష్ణరాజపురం | హెబ్బాళా | 8 | 12.35 km (7.67 mi) | డిసెంబరు 2027 | ||
| హెబ్బాళా | కియాఎల్ టెర్మినల్స్ | 8 | 30.09 km (18.70 mi) | |||
| 91 | 133.48 km | |||||
| మూడవ దశ నెట్‌వర్కు | ||||||
| . లేదు. | లైన్ పేరు | టెర్మినల్స్ | స్టేషన్లు | దూరం (km) | ప్రారంభ తేదీ | |
| 6 | Orange | కెంపపుర | జేపీ నగర్ 4 వ దశ | 22 | 32.15 km (19.98 mi) | 2031[57] |
| 7 | Grey | హోసహళ్ళి | కడబగేరే | 9 | 12.50 km (7.77 mi) | |
| 8 | Red | హెబ్బళ | సర్జాపుర | 28 | 37.00 km (22.99 mi) | 2031 |
| 59 | 81.65 km | |||||
పింక్ లైన్
[మార్చు]పింక్ లైన్ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు వెళ్తుంది. దక్షిణాన కాలెన అగ్రహారను ఉత్తరాన నాగవారతో కలుపుతుంది. ఇది 21.25-kilometre (13.20 mi) నిడివితో, 18 స్టేషన్లతో ఉంది. ఇది దక్షిణ వైపున తవరకెరె వరకు ఎత్తున పోతుంది. మిగిలినది నాగవార స్టేషన్ వరకు భూగర్భంలో ఉంది. ఈ లైన్ జయ ప్రకాష్ నగర్ 4వ దశ స్టేషన్ (ఆరెంజ్ లైన్‌తో ఇంటర్‌చేంజ్), జయదేవ హాస్పిటల్ స్టేషన్ ( ఎల్లో లైన్‌తో ఇంటర్‌చేంజ్), మహాత్మా గాంధీ రోడ్ ( పర్పుల్ లైన్‌తో ఇంటర్‌చేంజ్) గుండా వెళుతుంది. ఇది కంటోన్మెంట్ గుండా వెళ్ళి, నాగవర వద్ద ముగుస్తుంది, ఇది బ్లూ లైన్‌తో ఇంటర్‌చేంజ్ స్టేషన్‌గా ప్రణాళిక చేయబడింది. ఈ లైను 2026–27లో మొదలౌతుందని భావిస్తున్నారు.
బ్లూ లైన్
[మార్చు]బ్లూ లైన్ ORR తూర్పు, ఉత్తర విభాగాల వెంబడి ఉంది. ఇది హెబ్బాల్ వద్ద ORR నుండి బయల్దేరి, విమానాశ్రయం రోడ్డు వెంట కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సాగుతుంది. నిర్మాణం రెండు విభాగాలుగా జరుగుతోంది: ఫేజ్ 2A సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుండి కృష్ణరాజపుర వరకు, ఫేజ్ 2B కృష్ణరాజపుర నుండి విమానాశ్రయం వరకు ఉంటుంది. ఈ లైను పొడవు 58.19-kilometre (36.16 mi). ఇందులో 32 స్టేషన్లుంటాయి. యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్థావరం వద్ద కొద్దిపాటి భూగర్భ విభాగం తప్పించి, ఈ మార్గం దాదాపు అంతా భుమిపై ఎత్తున పోతుంది. ఈ లైన్‌లో విమానాశ్రయానికి దగ్గరగా నేలపైన కూడా ఒక ముక్క ఉంది. విమానాశ్రయ స్టేషన్ భూగర్భ స్టేషన్ అవుతుంది. ఈ లైన్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ (ఎల్లో లైన్‌తో ఇంటర్‌చేంజ్) వద్ద ప్రారంభమవుతుంది. కృష్ణరాజపుర (పర్పుల్ లైన్‌తో ఇంటర్‌చేంజ్), నాగవర (పింక్ లైన్‌తో ఇంటర్‌చేంజ్) గుండా వెళుతుంది. ఇది హెబ్బాల్, యెలహంక గుండా కూడా వెళుతుంది. నిర్మాణంలో ఉన్న ఈ లైను 2026 జూన్‌లో మొదలౌతుందని అంచనా.[58]
ఫేజ్ 2ఎ, ఫేజ్ 2బి (కృష్ణరాజపుర - యలహంక - బెంగళూరు విమానాశ్రయం)కు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) $500 మిలియన్ల రుణం సమకూరుస్తుంది. దాని బోర్డు 2020 డిసెంబరులో దీన్ని ఆమోదించింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) $318 మిలియన్ల రుణాన్ని అందిస్తుంది. దీని కోసం అధికారిక ఒప్పందంపై 2021 మార్చిలో సంతకాలయ్యాయి.[59]
మూడవ దశ
[మార్చు]124 కిలోమీటర్ల పొడవున్న మూడవ దశ మొదట 2016 మేలో ప్రతిపాదించారు.[60] మూడవ దశలో భాగంగా ప్రతిపాదించబడిన కొన్ని ముఖ్యమైన విభాగాలను రెండవ దశ లోనే దశ 2A, దశ 2B గా చేర్చారు.[61][62][63] 2020 మార్చి 7 న మొత్తం 44.65 కి.మీ. పొడవున్న రెండు కారిడార్లను పూర్తిగా ఎలివేటెడ్ లైన్లుగా పీపీపీ పద్ధతిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు.[64] వీటిలో కెంపాపుర-జయప్రకాష్ నగర 4వ దశ (ORR-వెస్ట్ వెంట) ఒకటి కాగా, హోసహళ్లి-కడబగేరె రెండవది.[65][66][67]
2022 మార్చి 4 న బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, హెబ్బల్ నుండి సర్జాపుర వరకు 35 km (22 mi) పొడవును (ఫేజ్ 3A గా చేపట్టనున్నట్లు) ప్రకటించింది. ప్రతిపాదిత కారిడార్ కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (DPR) త్వరలోనే తయారు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీని వ్యయం సుమారు ₹15,000 కోట్లు ఉంటుందని అంచనా. గతంలో ప్రకటించిన రెండు కారిడార్లకు ₹13,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. తరువాత, 2024 ఆగస్టు 16 న కేంద్ర మంత్రివర్గం ఫేజ్ 3ని ఆమోదించింది, ఇందులో రెండు లైన్లు, 31 స్టేషన్లు కొత్తగా చేరతాయి. దీని అంచనా వ్యయం ₹15,611 కోట్లు. [57] SECON ప్రైవేట్ లిమిటెడ్ రాబోయే 44.65 కి.మీ. కోసం మాగాడి రోడ్డులో జియోటెక్నికల్ పరిశోధన పనిని అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరు మెట్రో ఫేజ్ 3 ప్రాజెక్టు. 2024 నవంబరు 11 న హెబ్బల్ సర్జాపుర మధ్య నున్న 35 కి.మీ. పొడవును కర్ణాటక రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదించింది.
ఇతర ప్రతిపాదనలు
[మార్చు]| క్ర.సం | లైను | ఆద్యంత స్టేషన్లు | నిడివి | అంచనా వ్యయం |
|---|---|---|---|---|
| 1 | <span id="mwBV0" style="color:white;"><b id="mwBV4">Purple</b></span> | వైట్‌ఫీల్డ్-కాటమనల్లూరు-హోస్కోటే | 9 km (5.6 mi) | ₹ 2,400 Cr. |
| చల్లఘట్ట–బిదడి | 15 km (9.3 mi) | TBD | ||
| 2 | Green | మాదవర-తుమకూరు | 59.6 km (37.0 mi) | TBD |
| సిల్క్ ఇన్‌స్టిట్యూట్–హారోహళ్ళి | 24 km (15 mi) | TBD | ||
| 3 | Yellow | డెల్టా ఎలక్ట్రానిక్స్ బొమ్మసాంద్ర–అత్తిబేలె | 11 km (6.8 mi) | TBD |
| 4 | Pink | కాలెన అగ్రహార-కాడుగోడి ట్రీ పార్క్ | 68 km (42 mi) | ₹ 4,800 Cr. |
| నాగవర - KIA | 25 km (16 mi) | ₹ 10,000 Cr. | ||
| Pink Line (Branch) | జిగాని - సూర్య సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ | 4 km (2.5 mi) | TBD | |
| 5 | Blue Line (Branch) | దొడ్డజాల-దేవనహళ్ళి | 6 km (3.7 mi) | TBD |
| TBD | కొత్త లైను | కేఅర్ పుర - హోస్కోటె | 15 km (9.3 mi) | TBD |
| TBD | కొత్త లైను | ఎమ్‌జి రోడ్- హోప్ ఫార్మ్ | 16 km (9.9 mi) | ₹ 9,600 Cr. |
| TBD | ఇన్నర్ రింగ్ లైను | యశ్వంతపురా TTMC - మహాలక్ష్మి | 34 km (21 mi) | ₹ 10,000 Cr. |
2023 మార్చి 10 న కర్ణాటక ప్రభుత్వం మరిన్ని పొడిగింపులు, కొత్త మార్గాలనూ ప్రకటించింది. ₹27,000 కోట్ల విలువైన కొత్త కారిడార్ల ద్వారా అదనంగా 59 km (37 mi) పొడవున్న మార్గం నెట్‌వర్కుకు చేరుతుంది.[68] ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సిఫార్సు చేసిన, సమగ్ర మొబిలిటీ ప్లాన్ (CMP-2019)లో చేర్చబడిన ఇన్నర్ రింగ్ లైన్ మెట్రో కోసం కూడా ప్రతిపాదన ఉంది.[69]
బొమ్మసంద్ర నుండి కర్ణాటక-తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న హోసూర్ నగరంలోని రైల్వే స్టేషను వరకు యెల్లో లైన్ను పొడిగించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. సొంత ఖర్చుతో సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం సూచించింది.
ఆర్థికం
[మార్చు]నిధులు
[మార్చు]దశ 1
[మార్చు]
మొదటి దశ పూర్తిచెయ్యడం కోసం పెట్టుకున్న గడువులు తొమ్మిది సార్లు విఫలమయ్యాయి. దాని వ్యయ అంచనాలను నాలుగు సార్లు సవరించారు. 2006 లో ప్రాజెక్టును ఆమోదించినప్పుడు మొదటి దశ వ్యయ అంచనా రూ 6,395 కోట్లు. మార్గం పొడవును 33 to 42.3 km (20.5 to 26.3 mi) పెంచడంతో మొత్తం వ్యయం కూడారూ 8.158 కోట్లకు పెరిగింది. ఆలస్యం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తి, 2011 నాటికి ఖర్చు రూ 11,609 కోట్లు, 2015 నాటికి రూ 13,845 కోట్లూ అయింది. అంతిమంగా అది రూ 14,405.01 కోట్లు అయింది.[70] ఈ దశలో భూసేకరణ కోసం రూ 2,500 కోట్లు అయింది.[71]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చులో 58.91% నిధులు సమకూర్చాయి. మిగిలిన 41.09% నిధులను దేశీయ, విదేశీ ఆర్థిక సంస్థల నుండి రుణాల ద్వారా పొందారు.[70] BMRCL దీర్ఘకాలిక రుణాల ద్వారా ₹6,500 crore (US$810 million), బాండ్లను అమ్మడం ద్వారా ₹300 crore (US$38 million) సేకరించగా, మిగిలిన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాయి. BMRCL అనేక ఏజెన్సీల నుండి రుణాలు పొందింది - ₹3,000 crore (US$380 million) జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) నుండి, ₹600 crore (US$75 million) హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HUDCO) నుండి, ₹25 crore (US$3.1 million) ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) నుండి, మిగిలినది ఫ్రెంచ్ అభివృద్ధి సంస్థ నుండి తెచ్చింది. BMRCL తీసుకున్న అప్పు ₹ 6500 కోట్లపై దాదాపు 10% ఏటా వడ్డీగా చెల్లించాల్సి వచ్చింది. కర్ణాటక వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (FKCCI) అంచనా ప్రకారం ఇది రోజుకు రెండు కోట్లు. వడ్డీ భారం అంత ఎక్కువగా లేదనీ, కానీ అది "ఖచ్చితంగా రోజుకు ₹1 crore (US$1,30,000) కంటే ఎక్కువే" అని BMRCL పేర్కొంది.[72]

దశ 2 /2A /2B
[మార్చు]2012 జనవరి 3 న కర్ణాటక ప్రభుత్వం నమ్మ మెట్రో ప్రాజెక్ట్ రెండవ దశ కోసం ₹27,000 crore (US$3.4 billion) బడ్జెట్టును ఆమోదించింది.[73] ఈ దశ నిర్మాణ ఖర్చు ₹26,405 crore (US$3.3 billion), భూసేకరణ ఖర్చు ₹5,000 crore (US$630 million) అవుతుందని అంచనా వేసారు.[71] కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు ₹ 15,000 కోట్ల నిధులు సమకూరుస్తాయి. [74] ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్రం 30%, కేంద్రం 20% భరిస్తాయి. మిగిలినవి సీనియర్ టర్మ్ లోన్ల ద్వారా సేకరిస్తారు.[75] రుణాల ద్వారా ₹ 9,000 కోట్ల వరకు సేకరించడానికి BMRCL కు అనుమతి ఉంది.[74]
2012 మార్చి 27 న ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) BMRC కి $250 మిలియన్ల రుణం ఇవ్వడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఈ రుణం దక్షిణాసియాలోని పట్టణ రవాణా రంగంలోకి బహుపాక్షిక రుణ సంస్థ ప్రవేశాన్ని సూచిస్తుందని ADB ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 2011 మార్చిలో ADB బోర్డు ఆమోదించిన ఈ రుణం, సావరిన్ హామీలకు అవకాశం లేకుండా పట్టణ రవాణా రంగానికి ADB ఇచ్చే మొదటి రుణం. 2016 లో ఏజెన్సీ ఫ్రాంకైస్ డి డెవలప్‌మెంట్ (AFD) ఈ ప్రాజెక్ట్ కోసం ₹ 1,600 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. రుణంపై వడ్డీ రేటు యూరో ఇంటర్‌బ్యాంక్ ఆఫర్డ్ రేట్ (యూరిబోర్) + 130 బేసిస్ పాయింట్లతో అనుసంధానించబడి ఉంది. 2017 ప్రారంభంలో, యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ AFD వసూలు చేస్తున్న వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుతో, 20 సంవత్సరాల తిరిగి చెల్లించే వ్యవధితో, BMRCLకి ₹ 3,700 కోట్లు రుణం ఇవ్వడానికి అంగీకరించింది.[74]
2017 మేలో గొట్టిగెరె-నాగవర లైన్ నిర్మాణానికి ₹ 3700 కోట్ల నిధులను రుణం ద్వారా సమకూర్చడానికి యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (EIB) నుండి BMRC సూత్రప్రాయంగా ఆమోదం పొందింది. ఈ లైన్‌కు ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహ-ఆర్థిక సహాయం అందిస్తున్నాయి.
ఆర్‌వి రోడ్-బొమ్మసాంద్ర మెట్రో లైన్‌లో హెబ్బగోడి, ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో స్టేషన్ల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని భారతీయ సంస్థలు బయోకాన్, ఇన్ఫోసిస్ ప్రకటించాయి. ఒక్కో సంస్థ ₹100 crore (US$13 million) అందిస్తుందని BMRC ఆశిస్తోంది. నగరంలో రద్దీని తగ్గించడంలో సహాయపడుతుందని భావించి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలని కంపెనీ భావించిందని బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా తెలిపింది. బయోకాన్, ఇన్ఫోసిస్‌ల కార్యాలయాలు రెండూ ఈ స్టేషన్లకు సమీపంలో ఉన్నాయి. [76]
ORR-విమానాశ్రయ మెట్రో నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి BMRCL 2021 మార్చిలో JICA నుండి $318 మిలియన్లు, 2021 ఆగస్టులో ADB నుండి $500 మిలియన్లూ రుణాలు పొందింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ₹3,973 crore (US$500 million) సమకూరుస్తాయి. కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ కోసం అదనంగా ₹2,762 crore (US$350 million) చెల్లిస్తుంది.
ఆదాయాలు
[మార్చు]కేవలం 6.7 కి.మీ. పొడవున్న రీచ్ I ప్రారంభమయ్యాక, మొదటి నెలలో దాదాపు 13,25,000 మంది మెట్రోలో ప్రయాణించారు. [77] సగటున, ప్రతిరోజూ 41,390 మంది ప్రయాణించారు. సగటు రోజువారీ ఆదాయం ₹ 6,67,262. BMRC దాని మొదటి నెలలో రూ. 2.1 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.[78] అయితే, మొదటి ఆరు నెలల్లో, సగటు ప్రయాణీకుల సంఖ్య 24,968కి తగ్గింది. అదే కాలంలో BMRC మొత్తం రూ 6.6 కోట్లు సంపాదించింది.[79] నమ్మ మెట్రో రూ 41 లక్షల లాభాన్ని నమోదు చేసింది. రీచ్ I లో ఒక సంవత్సరం కార్యకలాపాల తర్వాత BMRCL అంచనా ప్రకారం మొదటి సంవత్సరంలో దాదాపు 80 లక్షల మంది ప్రయాణీకులు ఈ వ్యవస్థలో ప్రయాణించారు.[80] నమ్మ మెట్రో ఛార్జీయేతర ఆదాయాన్ని పెంచుకోవడానికి మెట్రో స్టేషన్లలో రిటెయిల్ స్థలాన్ని విక్రయించడం కూడా కొనసాగిస్తోంది.[81]
గమనిక: ఈ క్రింది పట్టిక నమ్మ మెట్రో ప్రారంభం నుండి వార్షిక ప్రయాణీకుల సంఖ్య, టిక్కెట్లపై వచ్చిన ఆదాయాన్ని చూపుతుంది. ప్రయాణీకుల సంఖ్యను సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య నుండి లెక్కించారు.[82][83]
| సంవత్సరం | ప్రయాణీకులు | టికెట్లపై ఆదాయం (₹) | మొత్తం ఆదాయం (₹) | లాభం/నష్టం (₹) |
|---|---|---|---|---|
| 2011–12 | 41,66,000 | ₹6.17 crore (US$7,70,000) | ||
| 2012–13 | 66,36,000 | ₹8.70 crore (US$1.1 million) | ₹49.46 crore (US$6.2 million) | -57.06 |
| 2013–14 | 72,55,000 | ₹9.86 crore (US$1.2 million) | ₹35.93 crore (US$4.5 million) | -83.18 |
| 2014–15 | 1,14,00,000 | ₹17.83 crore (US$2.2 million) | ₹42.98 crore (US$5.4 million) | -263.26 |
| 2015–16 | 1,68,00,000 | ₹28.29 crore (US$3.5 million) | ₹54.24 crore (US$6.8 million) | -360.99 |
| 2016–17 | 5,42,25,130 | ₹110.09 crore (US$14 million) | ₹145.12 crore (US$18 million) | -457.85 |
| 2017–18 | 10,92,06,905 | ₹281.00 crore (US$35 million) | ₹539.48 crore (US$68 million) | -352.25 |
| 2018–19 | 13,37,38,555 | ₹355.02 crore (US$44 million) | ₹535.86 crore (US$67 million) | -498.41 |
| 2019–20 | 17,42,19,000 | ₹376.88 crore (US$47 million) | ₹476.23 crore (US$60 million) | -598.58 |
| 2020–21 | 3,50,40,000 | ₹49.19 crore (US$6.2 million) | ₹86.78 crore (US$11 million) | -912.14 |
| 2021–22 | 8,21,25,000 | ₹163.33 crore (US$20 million) | ₹228.76 crore (US$29 million) | -455.79 |
| 2022–23 | 17,73,90,000 | ₹422.61 crore (US$53 million) | ₹784.55 crore (US$98 million) | -641.86 |
| 2023–24 | 23,27,76,000 | ₹573.91 crore (US$72 million) | ₹990.02 crore (US$120 million) | -349.07 |
ప్రయాణీకులు
[మార్చు]పర్పుల్ లైన్ లోని 6.7 కి.మీ.ల రీచ్-1 ముందుగా, 2011 అక్టోబరులో, మొదలైంది. రీచ్-1 కార్యకలాపాలు ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లో, 1,69,019 మంది మెట్రోలో ప్రయాణించారు. [84] నాల్గవ రోజు చివరి నాటికి, దాదాపు 2,00,000 మంది మెట్రోలో ప్రయాణించారు. రీచ్-1 ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో, దాదాపు 13,25,000 మంది మెట్రోలో ప్రయాణించారు. అందువల్ల, మొదటి నెలలో సగటున ప్రతిరోజూ 41,390 మంది రైలులో ప్రయాణించారు. అయితే, ఆపరేషన్ ప్రారంభమైన మొదటి ఆరు నెలల్లో సగటు ప్రయాణీకుల సంఖ్య 24,968కి పడిపోయింది.[83]
గ్రీన్ లైన్ ఉత్తర విభాగం (రీచ్ 3, 3A - 9.9 కి.మీ) 2014 మార్చిలో మొదలైంది. తొలిరోజున ఉత్తర విభాగంలో దాదాపు 25,000 మంది ప్రయాణించారు.[85] గ్రీన్ లైన్ కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి నెలలో, 7,62,000 మంది -రోజుకు సగటున 24,605 మంది- ఈ మార్గాన్ని ఉపయోగించారు.
రీచ్-1, రీచ్-3/3A, రీచ్-2 (2015 నవంబరులో మొదలయ్యాయి) పర్పుల్ లైన్ తూర్పు-పశ్చిమ భూగర్భ విభాగం (రీచ్‌లు 1, 2ని కలుపుతూ) 2016 ఏప్రిల్‌లో మొదలైంది. ఈ రెండూ ఒకదానితో ఒకటి కనెక్షను లేకుండా దేనికదే స్వతంత్రంగా పనిచేశాయి. తూర్పు, పశ్చిమ రీచ్‌లూ పర్పుల్ లైన్ లోని భూగర్భ విభాగమూ పరస్పరం కలిసిన తర్వాత, మొదటి కొన్ని రోజుల్లో లైన్‌లో ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగి, రోజుకు దాదాపు 1,00,000 మందికి చేరింది.[86] ఉత్తర-దక్షిణ భూగర్భ విభాగం తెరిచిన తర్వాత (దక్షిణంలో 4,4A ఎలివేటెడ్ రీచ్‌లతో ఏకకాలంలో), నెట్‌వర్క్ లైన్‌ల మధ్య ఇంటర్‌చేంజ్‌తో నాలుగు దిశలలో కనెక్టివిటీని అందించింది. దీంతో ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగింది. 2017 డిసెంబరు నాటికి సగటున 3,50,000 - 3,60,000 మధ్య చేరుకుంది.[87]
ప్రయాణీకుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో, రద్దీ తీవ్ర ఆందోళనకరంగా మారింది. అందువల్ల, 3-కోచ్‌లుండే రైళ్లను 6 కోచ్‌లుగా మార్చడం మొదలుపెట్టారు. మొదటి ఆరు బోగీల రైలును పర్పుల్ లైన్‌లో 2018 జూన్ 23 న ప్రవేశపెట్టారు. 2020 జనవరి నాటికి, అన్ని రైళ్లను ఆరు బోగీలుగా మార్చారు.[88]
2019–20లో, వార్షిక ప్రయాణీకుల సంఖ్య 17.422 కోట్లు (రోజుకు సగటున 4,77,315). 2019 అక్టోబరు 25 న గరిష్ట రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 6,01,164 కాగా, అత్యధిక రోజువారీ ఆదాయం రూ.1.2020 కోట్లు 67 మార్చి 2న నమోదైంది. 2020 జనవరిలో సగటున ప్రయాణీకుల సంఖ్య 5,18,074. [8]
COVID-19 మహమ్మారి కారణంగా, 2020 మార్చి 25 నుండి సేవలు నిలిపివేసారు. 2020 సెప్టెంబరు 7 న కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కోవిడ్ రెండవ దశలో 2021 ఏప్రిల్ 2021 నుండి 27 జూన్ 20 వరకు రైళ్ళను మళ్లీ నిలిపివేసారు. మహమ్మారి కాలంలో సేవలు పరిమితంగానే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమిత సామర్థ్యం, సామాజిక దూర నిబంధనల అమలు కారణంగా ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉంది.
2024 మార్చి నాటికి, మెట్రో వ్యవస్థలో సగటు రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 6,36,000 గా ఉంది. 2025 ఆగస్టు 11 న ప్రయాణీకుల సంఖ్య 10.48 లక్షలు. ఇది నమ్మ మెట్రో చరిత్రలో అప్పటివరకు నమోదైన అత్యధిక సంఖ్య, ఎల్లో లైన్ ప్రారంభించిన వెంటనే మొదటిసారిగా 10 లక్షలను అధిగమించింది.[89]
ఈ వ్యవస్థలో గరిష్ట రైలు వేగం 80 km/h (50 mph). అయితే, రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) వాణిజ్యపరంగా రైళ్ల వేగాన్ని సూటిగా వెళ్ళే మార్గాల్లో 67.50 km/h (41.94 mph) గాను, మలుపులలో 35 km/h (22 mph) గానూ, స్టేషన్లలో 45 km/h (28 mph) గానూ నిర్ణయించింది.
భద్రత
[మార్చు]నమ్మ మెట్రోలో భద్రతకు కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక భద్రతా దళం (KISF) బాధ్యత వహిస్తుంది. బెంగళూరు పోలీసులు మొదటిసారిగా 2017 మార్చి 25 న మెట్రో స్టేషన్లలో వివరణాత్మక మాక్ డ్రిల్‌లను నిర్వహించారు. నకిలీ బాంబు కాల్స్, ఉగ్రవాద చొరబాటు లేదా దాడులు వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో సంసిద్ధతను అంచనా వేయడానికి ఈ డ్రిల్ అని పోలీసు అధికారులు తెలిపారు. స్నిఫర్ డాగ్స్, బాంబు గుర్తింపు, నిర్మూలన స్క్వాడ్, విధ్వంసక నిరోధక స్క్వాడ్, క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRTలు) ఈ డ్రిల్‌లో పాల్గొన్నాయి. పోలీసులు గతంలో ప్రాథమిక మాక్ డ్రిల్‌లను నిర్వహించారు, కానీ నిర్దిష్ట బెదిరింపులను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన మొదటిది కసరత్తు ఇది. అధికారులకు డ్రిల్‌ను మరింత సవాలుగా మార్చడానికి, సాధారణంగా జనసమూహం ఎక్కువగా ఉండే శనివారాన్ని ఎంచుకున్నారు. BMRCL కు ఈ డ్రిల్ గురించి ముందుగా తెలియజేయలేదు.
చట్టాలు
[మార్చు]బెంగళూరు మెట్రో రైలు (క్యారేజ్, టికెట్) 2011 నియమాల ప్రకారం, వ్యక్తిగత సామాను బరువును 15 కీలోలకు పరిమితం చేసారు. నియమం 3 ఇలా చెబుతోంది: "మెట్రో రైల్వేలో ప్రయాణించేటప్పుడు, మెట్రో రైల్వే పరిపాలన ముందస్తు అనుమతి లేకుండా, 60 సెం.మీ x 45 సెం.మీ x 25 సెం.మీ కంటే ఎక్కువ పరిమాణంలో, 15 కిలోల బరువున్న వ్యక్తిగత వస్తువులను కలిగి ఉన్న చిన్న సామాను తప్ప మరే ఇతర వస్తువులను తమతో తీసుకెళ్లకూడదు." నియమాలు పేలుడు, మండే, విషపూరిత పదార్థాలను తీసుకెళ్లడాన్ని కూడా నిషేధించాయి.
మెట్రో రైల్వే (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) చట్టం, 2002, మెట్రోపై చేసిన నేరాలకు జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్షలు విధిస్తుంది. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు రైలును దెబ్బతీసే లేదా దురుద్దేశంతో బాధపెట్టే లేదా ఇతర ప్రయాణీకులను బాధపెట్టే ప్రయత్నం చేసే వారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. స్టేషన్లు లేదా రైళ్ల గోడలపై పోస్టర్లు అతికించడం లేదా గ్రాఫిటీలు గీస్తే ₹ 1,000 జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుంది. తాగి ప్రయాణించడం లేదా రైలులో ఇబ్బంది కలిగించడం చేస్తే ₹ 500 జరిమానా విధించబడుతుంది. [90] భద్రతా తనిఖీ కేంద్రాల వద్ద ప్రయాణీకులను పర్యవేక్షిస్తారు. ఇబ్బంది కలిగించే, ఎక్కువగా మద్యం తాగిన లేదా నిషేధించబడిన వస్తువులను తీసుకెళ్లే వారిని ఎక్కేందుకు అనుమతించరు.[91] మెట్రో ప్రాంగణంలో ఉమ్మివేస్తే ₹ 100 జరిమానా విధిస్తారు.[92]
నెట్‌వర్క్ మ్యాప్
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- ↑ రెండు పట్టాల మధ్య ఉండే దూరం 1,435 మిల్లీ మీటర్లు. ఇది మెట్రోల్లో ప్రామాణిక గేజిగా భావిస్తారు. భారతదేశ మెట్రోల్లో ప్రధానంగా దీన్నే వాడుతూండగా కొన్ని మెట్రోల్లో పాక్షికంగా బ్రాడ్‌గేజిని కూడా వాడుతున్నారు.
- ↑ రైలుకు విద్యుత్తు సరఫరా అందే పద్ధతులు రెండు - ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంటు, థర్డ్ రెయిల్ (మూడవ పట్టా). మొదటి పద్ధతిలో విద్యుత్తును రైలుకు పైన, రైలు మార్గం పొడవునా ఉండే తీగల నుండి తీసుకుంటుంది. భారతీయ రైల్వేలు తన రైలు మార్గాలన్నిటా ఇదే పద్ధతిని వాడుతుంది. థర్డ్ రెయిల్ పద్ధతిలో విద్యుత్తును సరాఫరా చేసే తీగ రైలు మార్గం పక్కనే ఒక పట్టా లాగా నడుస్తూ ఉంటుంది. రైళ్ళు దాన్నుండి విద్యుత్తును తీసుకుంటాయి. ఇది బయటికి కనబడదు కాబట్టి రైలు మార్గం పొడవునా తీగలు లేకుండా చూడడానికి బాగుంటుంది.
- ↑ సాధారణంగా, మెట్రో రైళ్ళకు ఓవర్‌హెడ్ తీగల ద్వారా 25 కెవి ఎసి విద్యుత్తును సరఫరా చేస్తారు. మూడవ పట్టా పరిజ్ఞానాన్ని వాడే మెట్రోల్లో 750 వోల్ట్ డిసి విద్యుత్తును సరఫరా చేస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ "Metro Phase I Will be Ready by May, to Miss Deadline". The New Indian Express. 22 October 2015. Archived from the original on 17 November 2015.
- ↑ S, Lalitha (22 April 2024). "Bengaluru Metro clocks highest ever profit of Rs 130 crore". The New Indian Express. Retrieved 2024-04-22.
- ↑ "At 1 million passengers, Namma Metro records highest ridership on Friday - newindianexpress". The New Indian Express. Retrieved 1 September 2019.[dead link]
- ↑ "Average speed of KIA metro could touch 65 KMPH". The Hindu. 20 December 2017.
- ↑ "Namma Metro - Home". english.bmrc.co.in.
- ↑ 6.0 6.1 "South India's first underground Metro launch on April 29". The Times of India. Retrieved 26 April 2016.
- ↑ "Bangalore Metro (Namma Metro) Route, Map, Metro Lines, Stations List and Latest Updates - Infra Info Hub" (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-11-11. Retrieved 2024-11-12.
- ↑ 8.0 8.1 "Namma Metro Jan-2023 Newsletter" (PDF). english.bmrc.co.in. Archived from the original (PDF) on 25 జనవరి 2023. Retrieved 2 September 2020.
- ↑ "Namma Metro fares hiked, timings extended". The Hindu. Retrieved 20 June 2017.
- ↑ "Passengers welcome higher Namma Metro frequency - KARNATAKA". The Hindu. 28 February 2017. Retrieved 14 January 2018.
- ↑ "All 420 trains now have 10 coaches commuters want better frequency". The Times of India. 30 January 2020.
- ↑ 12.0 12.1 12.2 12.3 "Wayback Machine" (PDF). documents.worldbank.org."Wayback Machine" (PDF).
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ "India's second longest metro network is here". Bangalore Mirror.
- ↑ "Metro finally comes to Whitefield, take a ride on March 26 from 7 am!". Deccan Herald.
- ↑ "Namma Metro - Home". english.bmrc.co.in.
- ↑ "PM lays foundation stone for Bangalore Metro Rail Project". Zee News (in ఇంగ్లీష్). 24 June 2006. Retrieved 2 September 2020.
- ↑ "NEC loses 25% of Namma Metro contract". The New Indian Express. 15 May 2012. Retrieved 2 September 2020.
- ↑ "Bangalore Metro seeks Rs 1,763 cr for extension work". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 17 July 2008. Retrieved 2 September 2020.
- ↑ 20.0 20.1 Shah, Narendra (20 August 2015). "Bangalore Metro | BMRC Ex-Chiefs unite against Sreedharan's view". Metro Rail News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ "A majestic prospect – tunnelling the Bangalore metro". Railway Technology (in బ్రిటిష్ ఇంగ్లీష్). 17 August 2011. Retrieved 2 September 2020.
- ↑ "Bangalore Metro TBMs inaugurated". tunneltalk.com. Retrieved 8 September 2020.
- ↑ "Helen, Margarita to resume Metro tunneling work soon". Deccan Herald (in ఇంగ్లీష్). 1 May 2012. Retrieved 2 September 2020.
- ↑ N, Shree D. (11 March 2016). "When is Namma Metro Phase-I expected to complete realistically?". Citizen Matters, Bengaluru (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ "Tunnelling for Bengaluru Metro tougher than anywhere in the world, says official". Deccan Herald (in ఇంగ్లీష్). 5 May 2016. Retrieved 2 September 2020.
- ↑ Aparajita Ray (21 Apr 2015). "Metro's tunnel borer to get its teeth again". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ "What you need to know about Bengaluru's new metro line". thenewsminute.com. 14 June 2017. Retrieved 2 September 2020.
- ↑ "Bangalore Metro misses deadline for 4th time, minister sets Sept 26 as next date: South, News". India Today. 16 September 2011. Retrieved 8 September 2014.
- ↑ "Bangalore Metro | Namma Metro". Karnataka.com (in అమెరికన్ ఇంగ్లీష్). 20 October 2011. Retrieved 2 September 2020.
- ↑ "Metro comes to Bangalore finally". The Times of India. 20 October 2011. Archived from the original on 20 October 2011.
- ↑ "Revenue Services Report" (PDF). Archived from the original (PDF) on 24 June 2013.
- ↑ Madhumathi D.S. "Business Line: Industry & Economy / Logistics: Namma Metro rides on 'gawk' power". Business Line. Retrieved 3 January 2012.
- ↑ "CM in a hurry, delays Namma Metro launch". The Hindu. 28 February 2014. Retrieved 27 March 2014.
- ↑ "25,000 ride Green line Metro on 1st working day". Deccan Herald. 3 March 2014. Retrieved 5 June 2015.
- ↑ "Byappanahallimg road metro stretch more popular". The Hindu.
- ↑ "At 4.58 lakh passengers, Namma Metro records highest ridership on Friday". The New Indian Express. 31 August 2019. Retrieved 2 September 2020.
- ↑ "Project Highlights". Official webpage of B.M.R.C. Archived from the original on 25 October 2011. Retrieved 3 May 2010.
- ↑ "Bangalore Metro Rail Project Phase 2" (PDF). bmrc.co.in. BMRC. Archived from the original (PDF) on 12 April 2015. Retrieved 5 June 2015.
- ↑ Kushala SKushala S. (21 Mar 2015). "Metro Phase-I cost is now Rs 13,845 crore". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ "Godavari sees light". Bangalore Mirror (in ఇంగ్లీష్). 20 Apr 2016. Retrieved 2 September 2020.
- ↑ "Getting Bangalore Metro north-south line back on track". tunneltalk.com. Archived from the original on 24 సెప్టెంబర్ 2020. Retrieved 2 September 2020.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ Menezes, Naveen. "Cost and & time overrun marks Bengaluru metro phase-I". The Economic Times. Retrieved 2 September 2020.
- ↑ "State Cabinet approves phase-II of metro". Business Standard. 4 January 2012. Retrieved 6 March 2012.
- ↑ "Metro project: Cabinet approves two new lines for Phase 2". The Times of India. 4 January 2012. Archived from the original on 28 September 2013.
- ↑ "Cabinet clears Namma Metro Phase 2 – Bangalore – DNA". Daily News and Analysis. 4 January 2012. Retrieved 6 March 2012.
- ↑ IRJ (30 January 2014). "Go-ahead for Bangalore metro phase 2".
- ↑ "Cities / Bangalore: Frame policy for differential fare pricing, BMRCL told". The Hindu. Chennai, India. 22 February 2012. Retrieved 6 March 2012.
- ↑ "Underground Bengaluru Metro Station service flagged off, Siddaramaiah seeks Centre's help for Namma Metro phase III". dna. 29 April 2016. Retrieved 29 April 2016.
- ↑ "Namma Metro Phase 2 will now cost Rs 32,000 crore: Deputy Chief Minister G Parameshwara". The New Indian Express. 27 October 2018. Retrieved 24 January 2019.
- ↑ "Metro gets poll push for Phase II". Deccan Chronicle. 4 June 2013. Archived from the original on 9 June 2013. Retrieved 28 September 2013.
- ↑ "All new Namma Metro stations in Phase II may get bus bays | Bengaluru News - Times of India". The Times of India. 20 May 2019.
- ↑ "Kempegowda International Airport metro connectivity by Dec 2023: Bommai". Deccan Herald (in ఇంగ్లీష్). 2022-12-29. Retrieved 2022-12-31.
- ↑ "Long wait for Namma Metro's airport link corridor will end in 2023, CM Bommai promises". TimesNow (in ఇంగ్లీష్). 2022-12-29. Retrieved 2022-12-31.
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ "PM Modi To Inaugurate Bengaluru's Namma Metro Yellow Line, Launch Phase-3 Expansion On Aug 10". News18 (in ఇంగ్లీష్). Retrieved 2025-08-04.
- ↑ 56.0 56.1 "Bengaluru Metro's Pink Line to be operational in two phases". Moneycontrol.
- ↑ 57.0 57.1 "Namma Metro Phase-III expansion receives Union Cabinet nod". The Hindu (in Indian English). 2024-08-16. ISSN 0971-751X. Retrieved 2024-08-17.
- ↑ "India's second longest metro network is here". Bangalore Mirror.
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ "Namma Metro, a third phase in the making". Deccan Herald (in ఇంగ్లీష్). 22 May 2016. Retrieved 2 September 2020.
- ↑ Menezes, Naveen. "Bangalore Metro: Namma Metro phase III may make way for elevated corridor". The Economic Times. Retrieved 2 September 2020.
- ↑ "Bengaluru Comprehensive Mobility Plan a 'backdoor' to elevated corridor?". thenewsminute.com. 18 January 2020. Retrieved 2 September 2020.
- ↑ Naveen Menezes (20 Jan 2020). "Citizens want Metro to stay off CMP, mind its own business". Bangalore Mirror (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ Christin Mathew Philip (20 Nov 2019). "Bengaluru: Gottigere-Nagawara Metro line to go Pink". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ Singh, Neha (7 March 2020). "BMRCL to Construct two Metrolite corridors via PPP mode". Metro Rail News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2 September 2020.
- ↑ "42 KMs Bangalore Metro Phase-3 Project will start its operation by 2027-28". Metro Rail News. 27 October 2021.
- ↑ "BMRCL resumes traffic analysis to finalise Phase 3 lines". Deccan Herald. 24 November 2021.
- ↑ 68.0 68.1 "Karnataka govt action plan moots four new metro lines". Deccan Herald. 10 March 2023."Karnataka govt action plan moots four new metro lines".
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ 70.0 70.1 Menezes, Naveen. "Cost and & time overrun marks Bengaluru metro phase-I – The Economic Times". The Economic Times. Retrieved 9 March 2017.
- ↑ 71.0 71.1 "Metro June Deadline Stands, But With Rider". The New Indian Express. Archived from the original on 22 January 2016. Retrieved 27 April 2016.
- ↑ "Metro June Deadline Stands, But With Rider". The New Indian Express. Archived from the original on 22 January 2016. Retrieved 27 April 2016."Metro June Deadline Stands, But With Rider".
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ 74.0 74.1 74.2 Lalitha, S. (6 February 2017). "European Bank's Rs 3.7k crore fillip for Metro Phase-II". The New Indian Express. Retrieved 10 February 2017.
- ↑ "India's second longest metro network is here". Bangalore Mirror.
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ "13.25 lakh rode the Metro". The Times of India. 25 November 2011. Archived from the original on 15 July 2012.
- ↑ "Namma Metro gains momentum – southindia – Bangalore – ibnlive". IBNLive. Ibnlive.in.com. 20 November 2011. Archived from the original on 23 November 2011. Retrieved 3 January 2012.
- ↑ "Joyrides in Bangalore Metro are over – Bangalore – DNA". Daily News and Analysis. Retrieved 25 July 2012.
- ↑ "Bangalore Metro posts Rs 41 lakh profit in first year – Bangalore – DNA". Daily News and Analysis. 18 October 2012. Retrieved 18 October 2012.
- ↑ N, Shree D. "Behind BMRCL's non-fare revenue goals". Deccan Herald.
- ↑ "Metro to complete 5 years of operations". The Hindu. 20 October 2016. Retrieved 2 November 2016.
- ↑ 83.0 83.1 Singh, Rajat (2025-09-24). "Bangalore Metro Route Map 2020: Station List, Fare, Timings". railmetro.com (in ఇంగ్లీష్). Retrieved 30 May 2020.
- ↑ "At 4.58 lakh passengers, Namma Metro records highest ridership on Friday". The New Indian Express. 31 August 2019. Retrieved 2 September 2020."At 4.58 lakh passengers, Namma Metro records highest ridership on Friday".
- ↑ "A closer look at Namma Metro that can transform Bengaluru's mobility landscape". The Economic Times. 9 June 2017. Retrieved 9 June 2017.
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ "India's second longest metro network is here". Bangalore Mirror.
- ↑ "BMRC hoping to finish work on Sampige Road-Puttenahalli line ahead of April 2017 deadline". The Times of India. 5 November 2016. Retrieved 5 November 2016.
- ↑ "Bengaluru metro ridership crosses 1 million for the first time after Yellow Line opens". Deccan Herald (in ఇంగ్లీష్). 2025-08-12. Retrieved 2025-08-12.
- ↑ "On slow track: Namma Metro operations grew just 5.6km/year over a decade". The Times of India. 19 October 2021.
- ↑ "India's second longest metro network is here". Bangalore Mirror.
- ↑ "Metro finally comes to Whitefield, take a ride on March 26 from 7 am!". Deccan Herald.
