నయనతార నటించిన సినిమాలు

భారతీయ నటి, చలనచిత్ర నిర్మాత నయనతార తమిళం, తెలుగు, మలయాళ చిత్రాలలో నటిస్తారు. ఆమె 2003లో సత్యన్ అంతికాడ్ చిత్రం మనస్సినక్కరే ద్వారా నటనారంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా విజయం తర్వాత మలయాళ పరిశ్రమలో ప్రముఖ తారగా ఎదిగారు. మరుసటి సంవత్సరం ఆమె మరో రెండు మలయాళ చిత్రాలలో నటించారు: షాజీ కైలాస్ చిత్రం నాట్టురాజావు, ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్ విస్మయతుంభత్తు. 2005లో విడుదలైన హరి తమిళ చిత్రం అయ్య ద్వారా ఆమె ఇతర భాషా చిత్రాలలో అడుగుపెట్టారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే, ఆమెను దర్శకుడు పి. వాసు భార్య మనస్సినక్కరేలో చూసి సిఫార్సు చేయడంతో చంద్రముఖిలో అవకాశం లభించింది. ఈ చిత్రం థియేటర్లలో 100 రోజులకు పైగా ప్రదర్శితమై, నయనతారను తమిళ సినిమాల్లో అత్యంత గిరాకీ ఉన్న నటీమణులలో ఒకరిగా నిలబెట్టింది.[1]
నయనతార 2006లో లక్ష్మి సినిమాతో తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించారు, అదే ఏడాది మరో తెలుగు చిత్రం బాస్‌లో నటించారు. ఆ సంవత్సరమే ఆమె నాలుగు తమిళ చిత్రాలలో నటించారు: కల్వనిన్ కాదలి, వల్లవన్, తలైమగన్, ఈ. 2007లో బిల్లా చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి.[2] ఆ చిత్రం విజయంతో సిఫీ ఆమెను "తమిళ సినిమా గ్లామర్ క్వీన్"గా అభివర్ణించింది.[3] 2008లో విడుదలైన యారడీ నీ మోహిని ఆ ఏడాది కథానాయికగా ఆమెకు దక్కిన ఏకైక విజయం.[4] 2009లో ఆమె మూడు చిత్రాలలో నటించారు: విల్లు, ఆంజనేయులు, ఆదవన్. 2010లో ఆమె నటించిన ప్రధాన చిత్రాలన్నీ వాణిజ్యపరంగా విజయం సాధించాయి: నాలుగు దక్షిణాది భాషల్లో ఐదు బాక్సాఫీస్ హిట్లు అందుకున్నారు – అదుర్స్ (తెలుగు), బాడీ గార్డ్ (మలయాళం), సింహా (తెలుగు), బాస్ ఎంగిర భాస్కరన్ (తమిళం), కన్నడ చిత్రం సూపర్. సింహా, బాస్ ఎంగిర భాస్కరన్, సూపర్ చిత్రాలలో నటనకు గాను ఆమె ఆయా భాషల్లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్లు పొందారు.[5]
2011లో నయనతార హిందూ పురాణం రామాయణం ఆధారంగా రూపొందిన శ్రీ రామరాజ్యంలో సీత పాత్రను పోషించారు, దీనికి గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి - తెలుగు అవార్డును గెలుచుకున్నారు.[6] కృష్ణం వందే జగద్గురుం (2012) చిత్రంలో నటనకు గాను మరో నామినేషన్ దక్కింది. రాజా రాణి (2013),[7] నానుమ్ రౌడీ దాన్ (2015),[8] అరమ్ (2017) చిత్రాలకు ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి - తమిళం అవార్డులను గెలుచుకున్నారు.[9] దక్షిణాదిలో మహిళా ప్రధాన చిత్రాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.[10] ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలైన మాయ (2015), పుతియ నియమం (2016), అరమ్ (2017), కోలమావు కోకిల (2018), ఇమైకా నోడిగల్ (2018), మూకుతి అమ్మన్ (2020), నెట్రికన్ (2021) విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్య విజయం సాధించాయి. 2023లో విడుదలైన జవాన్ చిత్రం ద్వారా ఆమె హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు, ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.[11]
తెలుగు చిత్రాలు
[మార్చు]| సంవత్సరం | చిత్రం | పాత్ర(లు) | గమనికలు | మూలాలు |
|---|---|---|---|---|
| 2006 | లక్ష్మి | నందిని | తెలుగు అరంగేట్రం | |
| బాస్ | అనురాధ | |||
| 2007 | యోగి | నందిని | ||
| దుబాయ్ శీను | మధుమతి | |||
| తులసి | వసుంధర రామ్ | |||
| 2008 | కథానాయకుడు | ఆమెగా | అతిథి పాత్ర | |
| సత్యం | దివ్య | |||
| 2009 | ఆంజనేయులు | అంజలి | ||
| 2010 | అదుర్స్ | చంద్రకళ | ||
| సింహా | గాయత్రి | |||
| 2011 | శ్రీ రామరాజ్యం | సీత | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు | [12] |
| 2012 | కృష్ణం వందే జగద్గురుం | దేవిక | ||
| 2013 | గ్రీకు వీరుడు | సంధ్య | ||
| 2014 | అనామిక | అనామిక | ||
| 2016 | బాబు బంగారం | శైలజ | ||
| 2018 | జై సింహా | గౌరీ | ||
| 2019 | సైరా నరసింహారెడ్డి | సిద్ధమ్మ | ||
| 2021 | ఆరడుగుల బుల్లెట్ | నయన | ||
| 2022 | గాడ్ ఫాదర్ | సత్యప్రియ జైదేవ్ | ||
| 2026 | మన శంకర వరప్రసాద్ గారు | శశిరేఖ | ||
| NBK 111 † | TBA | చిత్రీకరణలో ఉంది |
మూలాలు
[మార్చు]- ↑ Pillai, Sreedhar (1 July 2006). "Plain Jane turns star". The Hindu. Retrieved 4 April 2017.
- ↑ ""I have not done a smooching scene": Nayan". Sify. 29 December 2007.
- ↑ "Billa hits a century!". Sify. 22 March 2008.
- ↑ Pillai, Sreedhar (2008). "Looking back". The Times of India.
- ↑ "Best in the south from 2010". Post. 29 June 2011.
- ↑ "నయనతార 'శ్రీరామరాజ్యం'కు పదేళ్లు." Sakshi. 17 November 2021.
- ↑ "IN PICS: 61st Filmfare Awards (South) Tamil winners list 2013". The Times of India.
- ↑ "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". Filmfare.
- ↑ "Winners: 65th Jio Filmfare Awards (South) 2018". The Times of India. 17 June 2018.
- ↑ "నయనతార.. గ్లామర్ క్వీన్ నుంచి లేడీ సూపర్‌స్టార్ వరకు!". Eenadu. 18 November 2023.
- ↑ "బాక్సాఫీస్ వద్ద జవాన్ వసూళ్ల ప్రభంజనం". Sakshi. 18 September 2023.
- ↑ "నయనతార 'శ్రీరామరాజ్యం'కు పదేళ్లు." Sakshi. 17 November 2021.