నయా ఆద్మీ
స్వరూపం
నయా ఆద్మీ (1955 హిందీ సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సి.పి.దీక్షిత్ |
నిర్మాణం | ఎం. సోమసుందరం |
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, జమున, రాజసులోచన, |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | జుపిటర్ పిక్చర్స్ |
భాష | హిందీ |
నయా ఆద్మీ 1955లో విడుదలైన హిందీ సినిమా. ఇది సి పి దీక్షిత్ అనే హిందీ దర్శకుడు తీసిన బాలీవుడ్ చిత్రం. తెలుగు నటుడు నందమూరి తారకరామారావు నటించిన ఏకైక హిందీ చిత్రం ఇది. ఎన్టీఆర్, అంజలీదేవి, జమున, హెలెన్, అన్వర్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం జూపీటర్ పిక్చర్స్ వారి బ్యానర్‌లో నిర్మించబడింది. 1955లో వచ్చిన తెలుగు చిత్రం 'సంతోషం'కు ఈ చిత్రం రీమేక్.[1]
తారాగణం
[మార్చు]- నందమూరి తారకరామారావు - ఆనంద్
- జమున - సరస
- రాజ సులోచన - శాంత
- ఆర్.నాగేంద్రరావు - జమీందార్ దయానిధి
- రామశర్మ - మూర్తి
- అంజలీదేవి - అమృతం
- వడ్లమాని విశ్వనాథం - సుందరయ్య
- కాకినాడ రాజరత్నం - మదన్ మోహన్ తల్లి
- పొదిలి కృష్ణమూర్తి - హరిహరదాసు (దొంగస్వామి)
- హెలెన్ - నర్తకి
- బొడ్డపాటి
- హెలెన్
- అన్వర్
విశేషాలు
[మార్చు]ఈ సినిమా సంతోషం సినిమాకు రీమేక్. సంతోషం చిత్రంలో నటించిన అదే తారాగణంతో ఈ సినిమాను నిర్మించారు. కాకపోతే హిందీ సినిమాలో జగ్గయ్య స్థానంలో అన్వర్ హుసేన్, రేలంగి స్థానంలో గోపి నటించారు. హిందీ నర్తకి హెలెన్‌కు తెలుగులో ఇది మొదటి చిత్రం.
మూలాలు
[మార్చు]- ↑ "Naya Admi (1955)". Indiancine.ma. Retrieved 2025-05-25.