నరసాపురం (పశ్చిమ గోదావరి)మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరసాపురం
—  మండలం  —
పశ్చిమ గోదావరి పటములో నరసాపురం మండలం స్థానం
పశ్చిమ గోదావరి పటములో నరసాపురం మండలం స్థానం
నరసాపురం is located in Andhra Pradesh
నరసాపురం
నరసాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో నరసాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రం నరసాపురం
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,39,084
 - పురుషులు 69,681
 - స్త్రీలు 69,403
అక్షరాస్యత (2001)
 - మొత్తం 77.31%
 - పురుషులు 82.59%
 - స్త్రీలు 72.02%
పిన్‌కోడ్ 534275

నరసాపురం (Narsapuram), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణము, మరియు అదే పేరుగల మండలమునకు కేంద్రము. పిన్ కోడ్: 534275. దీని అక్షాంశ రేఖాంశాలు 16° 27' 0" ఉత్తరం, 81° 40' 0" తూర్పు. 'నృసింహపురి', 'అభినవభూతపురి' అన్న పేర్లు కూడా కొన్ని (సాహితీ) సందర్భాలలో వాడుతారు.

జనవిస్తరణ[మార్చు]

బస్టాండ్ సెంటర్

2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషుల సంఖ్య 49%, స్త్రీల సంఖ్య 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. నరసాపురం లేసు పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. జనాభా ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు. కనుక వివిధ సంస్కృతుల ప్రభావం ఈ పట్టణంలో కనిపిస్తుంది.