నరుకుళ్ళపాడు
నరుకుళ్ళపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°50′09″N 80°40′57″E / 16.835920°N 80.682625°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | అమరావతి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,484 |
- పురుషుల సంఖ్య | 1,127 |
- స్త్రీల సంఖ్య | 1,208 |
- గృహాల సంఖ్య | 726 |
పిన్ కోడ్ | 522016 |
ఎస్.టి.డి కోడ్ |
నరుకుళ్ళపాడు, గుంటూరు జిల్లా, అమరావతి మండలం లోని గ్రామము. ఇది మండల కేంద్రమైన అమరావతి నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 726 ఇళ్లతో, 2335 జనాభాతో 941 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1127, ఆడవారి సంఖ్య 1208. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 758 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 141. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589949[1].పిన్ కోడ్: 522016, ఎస్.టి.డి.కోడ్ = 08645.
విషయ సూచిక
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]
గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు[మార్చు]
తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
గ్రామo పేరు వెనుక చరిత్ర[మార్చు]
వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు చెంచులను విందుకు పిలిచి వాళ్ళు భోజనం చేశాక 150 మంది చెంచు నాయకులను వరుసగా నిలబెట్టి నరికించాడనీ అందుకే ఆ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడుగా మారిందనీ చరిత్ర.
సమీప గ్రామాలు[మార్చు]
ఉత్తరాన కంచికచర్ల మండలం, తూర్పున తుళ్ళూరు మండలం, దక్షణాన పెదకూరపాడు మండలం, తూర్పున ఇబ్రహింపట్నం మండలం.
గ్రామ విశేషాలు[మార్చు]
విజయవాడ పోలీసు కమిషనరుగా పనిచేయుచున్న శ్రీ గౌతం సవాంగ్, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకొనుటకు తన సంసిద్ధతను వ్యక్తం చేసారు. [2]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,484.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,238, స్త్రీల సంఖ్య 1,246, గ్రామంలో నివాస గృహాలు 670 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 941 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 2,335 - పురుషుల సంఖ్య 1,127 - స్త్రీల సంఖ్య 1,208 - గృహాల సంఖ్య 726