నరేందర్ నాథ్
| నరేందర్ నాథ్ | |||
| ముందు | రామ్ నివాస్ గోయల్ | ||
|---|---|---|---|
| తరువాత | జితేందర్ సింగ్ షుంటి | ||
| నియోజకవర్గం | షహదర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
నరేందర్ నాథ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు షహదర శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విద్య, సాంకేతిక విద్య, విద్యుత్, పర్యాటక & భాషల మంత్రిగా పని చేశాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]నరేందర్ నాథ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1977 వరకు షహదర బ్లాక్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా, 1983 నుండి 1990 వరకు మెట్రోపాలిటన్ కౌన్సిల్ సభ్యుడిగా, 1990 నుండి 1994 వరకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా, 1997 నుండి 1998 వరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికై కార్పొరేషన్ లో ప్రతిపక్ష నాయకుడిగా, 1995 నుండి 2004 వరకు డీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పని చేశాడు.
నరేందర్ నాథ్ 1998 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షహదర శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జ్యోత్స్న అగర్వాల్ పై 240 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[2] విద్య, సాంకేతిక విద్య, విద్యుత్, పర్యాటక & భాషల మంత్రిగా పని చేశాడు. ఆయన 2003 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జితేందర్ సింగ్ షుంటిపై 13,185 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]
నరేందర్ నాథ్ 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షహదర శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జితేందర్ సింగ్ షుంటిపై 1,536 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జితేందర్ సింగ్ షుంటి చేతిలో 15,117 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Elections December 2013 Results, Election Commission of India". the original నుండి 2014-01-02 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2014-12-15.
- ↑ "Delhi Assembly Election Results 1998". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2003". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.
- ↑ "Delhi Assembly Election Results 2008". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 December 2024.