నరేంద్ర ప్రసాద్
| నరేంద్ర ప్రసాద్ | |
|---|---|
| జననం | 1946 డిసెంబరు 26 మావేలిక్కర, సెంట్రల్ డివిజన్, ట్రావన్‌కోర్ (ప్రస్తుత మావేలిక్కర, కేరళ) |
| మరణం | 2003 నవంబరు 3 (వయసు: 56) కోజికోడ్, కేరళ, భారతదేశం |
| విశ్వవిద్యాలయాలు |
|
| వృత్తి |
|
రాఘవ కురుప్ నరేంద్ర ప్రసాద్ (1946 డిసెంబరు 26 - 2003 నవంబరు 3), ఒక భారతీయ నటుడు, నాటక రచయిత, దర్శకుడు, ఉపాధ్యాయుడు, సాహిత్య విమర్శకుడు. ఆయన పూర్వపు ట్రావన్‌కోర్ రాజ్యం మావెలిక్కరలో జన్మించాడు.[1] తన నటనకు ప్రశంసలు అందుకున్న ఆయన మలయాళ చిత్రాలలో క్యారెక్టర్ పాత్రలు, విలన్ పాత్రలను పోషించడానికి ప్రసిద్ధి చెందాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన పండలం లోని ఎన్. ఎస్. ఎస్. కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ డిగ్రీ (గణితంలో) చదువుకున్నాడు. ఆంగ్ల భాష, సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆయన కేరళ విశ్వవిద్యాలయం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ లో పూర్తిచేసాడు. ఆయన కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో నిర్వహించే మలయాళం, ఆంగ్ల సాహిత్య చర్చలు, పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్నాడు. ఆయన నాటకం సౌపర్ణిక 1985లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకుంది.[3]
నరేంద్ర ప్రసాద్ కళాశాల ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ప్రారంభించాడు, ఆయన 1967లో బిషప్ మూర్ కళాశాల ఆంగ్లంలో లెక్చరర్ గా చేరాడు. 1968లో ప్రభుత్వ సేవలోకి ప్రవేశించిన ఆయన పాలక్కాడ్ లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలలో లెక్చరర్ గా పనిచేసాడు. తిరువనంతపురంలోని ఆర్ట్స్ కాలేజ్, యూనివర్శిటీ కాలేజ్ లలో ప్రొఫెసర్ గా పనిచేసాడు. 1989లో యూనివర్శిటీ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు, కొట్టాయంలోని మహాత్మా గాంధీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లెటర్స్ డైరెక్టర్ పదవికి ఎంపికయ్యాడు. ఆయన తన మరణం వరకు ఈ పదవిలో కొనసాగాడు.
సినిమా
[మార్చు]ప్రతినాయక పాత్రలతో నటుడిగా గుర్తింపు పొందాడు. ఆయన విజయవంతమైన చిత్రాలలో మేలేపరంబిల్ ఆన్వీడు, అన్యన్ బావ చేతన్ బావ, తలస్తానం, ఉత్సవమేలం, పైత్రుకమ్, స్థలతే ప్రధాన పయ్యన్స్, ఏకలవ్యన్, భరనకూడం, యాధవం, ఆరం తంబురాన్, కృష్ణగుడియిల్ ఒరు ప్రణయకలతు, నంగల్ సంతుష్టరను, ఉస్తాద్, వజున్నోర్, వన్ మ్యాన్ షో, సుసన్నా.. ఇలా ఆయన 150 చిత్రాలలో నటించాడు, "పైతృకం" చిత్రానికి 'ఉత్తమ సహాయ నటుడిగా' రాష్ట్ర అవార్డును గెలుచుకున్నాడు.
అవార్డులు
[మార్చు]కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు
- రెండవ ఉత్తమ నటుడు-1993 - పైత్రుకమ్
మరణం
[మార్చు]ఆయన 2003 నవంబరు 3న కోజికోడ్‌లోని పివిఎస్ ఆసుపత్రిలో కార్డియో-రెస్పిరేటరీ అరెస్ట్ కారణంగా మరణించాడు. ఊపిరితిత్తుల క్షీణతకు కారణమయ్యే ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ (ILD) వల్ల కలిగే అప్నియా కోసం ఆయనను ఎర్నాకుళంలోని అమృత ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుండి ఆయనను పివిఎస్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆయన స్పృహలోకి వచ్చినప్పటికీ, అనారోగ్యంతో మరణించాడు.[4] ఆయన మరణించే సమయానికి 56 సంవత్సరాల వయస్సు. మావెలిక్కరలోని ఆయన స్వగృహంలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు.
మూలాలు
[మార్చు]- ↑ "നരേന്ദ്രപ്രസാദ് ഓര്മ്മദിനം". Archived from the original on 24 November 2009. Retrieved 26 November 2013.
- ↑ "5 Evergreen Villians of Malayalam Cinema". The Times of India. Retrieved 2021-03-12.
- ↑ "Manorama Online | Malayalam News | Nostalgia |". Archived from the original on 2 December 2013. Retrieved 26 November 2013.
- ↑ "Narendra Prasad passes away". The Hindu. 3 November 2003. Archived from the original on 10 November 2012. Retrieved 19 June 2011.