నర్మద (జిల్లా)
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో ...నర్మదా జిల్లా (గుజరాతీ: નર્મદા જીલ્લો) ఒకటి. రాజ్పిప్ల పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,755 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 5,90,379. జిల్లాలోని 10.44% నగరప్రాంతంలో నివసిస్తున్నారు. నర్మదా (జిల్లా) ఉత్తర సరిహద్దులో వదోదరాజిల్లా, తూర్పు సరిహద్దులో మహారాష్ట్ర రాష్ట్రం, దక్షిణ సరిహద్దులో తపిజిల్లా, పశ్చిమ సరిహద్దులో భారూచ్ జిల్లాలు ఉన్నాయి.[1] 2011 గణాంకాలను అనుసరించి గుజరాత్ రాష్ట్ర జిల్లాలలో జనసంఖ్యాపరంగా నర్మదా జిల్లా అత్యల్ప జనసాంధ్రత కలిగిన జిల్లాలలో మూడవదిగా గుర్తించబడింది. మొదటి రెండు స్థానాలలో డాంగ్స్ జిల్లా, పోర్బందర్ జిల్లాలు ఉన్నాయి.[2]
చరిత్ర[మార్చు]
1997 అక్టోబరు 2 లో వదోదర జిల్లాలోని తిలక్వాడా తాలూకా, భారూచ్ జిల్లాలోని నాందాద్, దెదియాపద, సగ్బర తాలూకాలను కలిపి నర్మదా జిల్లా రూపొందించబడింది.[3]
విభాగాలు[మార్చు]
- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : నాందాద్, సగ్బరా, దెదియపద, తిలక్వాడా, గరుడేశ్వర్.
ఆర్ధికం[మార్చు]
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో నర్మదా జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న గుజరాత్ రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 590,379,[2] |
ఇది దాదాపు. | సోలోమన్ ఐలాండ్స్ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 528వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 214 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 14.77%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 960:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | అధికం |
అక్షరాస్యత శాతం. | 73.29%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-13.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "About District". Narmada District Panchayat.
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Solomon Islands 571,890 July 2011 est.
line feed character in|quote=
at position 16 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Wyoming 563,626
line feed character in|quote=
at position 8 (help)
వెలుపలి లింకులు[మార్చు]
[1] Best Places in Narmada
![]() |
వదోదరా జిల్లా | ![]() | ||
భారూచ్ జిల్లా | ![]() |
నందూర్బార్ జిల్లా,మహారాష్ట్ర | ||
| ||||
![]() | ||||
సూరత్ జిల్లా | తపి జిల్లా |